Viral Video: వామ్మో.. దేవుడి విగ్రహం ముందే బంగారు గొలుసు చోరీ.. ఈ లేడీ మామూలు కిలాడీ కాదు..

బంగారు గొలుసు దొంగిలిస్తున్న మహిళ

దొంగలు చాలా తెలివిగా వ్యవహరిస్తుంటారు. జనాలకు మాటల్లో పెట్టి దొంగతనాలు చేసేవారు కొందరైతే.. మరికొందరు మాత్రం రద్దీగా ఉండే ప్రదేశాలలో చోరీలకు పాల్పడతారు.

  • Share this:
    దొంగలు చాలా తెలివిగా వ్యవహరిస్తుంటారు. జనాలకు మాటల్లో పెట్టి దొంగతనాలు చేసేవారు కొందరైతే.. మరికొందరు మాత్రం రద్దీగా ఉండే ప్రదేశాలలో చోరీలకు పాల్పడతారు. రద్దీగా ఉండే ప్రదేశాల్లో దొంగతనాలు చేసేవారు.. జనాల్లో కలిసిపోయి దోపిడిలు చేస్తారు. తాజాగా గుడిలో అమ్మవారి విగ్రహం ముందే ఇలాంటి దోపిడికి పాల్పడింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో నమోదయ్యాయి. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని (Madhya Pradesh) ఉజ్జాయినిలో చోటుచేసుకుంది. వివరాల.. నవరాత్రి సందర్బంగా అమ్మవారిని దర్వించుకోవడాని ఆలయాలకు పెద్ద ఎత్తున జనాలు క్యూ కట్టారు. ఈ సమయంలోనే ఉజ్జయిని (Ujjain) ఫ్రీగంజ్ ప్రాంతంలోని (Freeganj area) సుందర్ డెయిరీకి సమీపంలో నివసిస్తున్న మీనా దేవి కూడా అమ్మవారి దర్శనం కోసం.. ఆదివారం గద్‌కాళిక మాత ఆలయానికి (Gadhkalika Mata Mandir) వెళ్లింది.

    భక్తులు పెద్ద సంఖ్యలో ఉండటంతో ఆమె దర్శనం కోసం క్యూ లైన్‌లో నిల్చుంది. అమ్మవారి దర్శనం కోసం భక్తుల అంతా వేచిచూస్తున్నారు. అయితే క్యూ లైన్‌లో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మీనా దేవి వెనక నిల్చున్నా దొంగల ముఠా మీనా దేవి బంగారు గొలుసును దొంగిలించింది. అయితే దీనిని మీనా దేవి ఆసమయంలో గమనించలేదు. ఆమె అమ్మవారిని దర్శించుకోవాలనే భక్తి భావంతో ఉంది. ఇదే అదనుగా మహిళ దొంగ ఆమె మెడలోని గొలుసును నోటితో కొరికి తీసేసుకుంది.

    Viral Video: చంటి బిడ్డనుఎత్తుకుని రోడ్డుపై వెళ్తున్న మహిళ.. మ్యాన్‌ హోల్‌లో పడిపోయింది.. అలా ఎలా జరిగిందంటే..?

    తొలుత మాములుగా గొలుసును దొంగిలించడానికి ప్రయత్నించిన మహిళ దొంగ.. అది రాకపోవడంతో దాన్ని నోటితో కొరికి విరగొట్టి చోరీ చేశారు. ఇది మొత్తం ఆలయంలోని అమ్మవారి విగ్రహం ముందే చోటుచేసుకుంది. బంగారు గొలుసును (Gold Chain) దొంగిలించిన మహిళ.. అనంతరం అక్కడి నుంచి పక్కకు వెళ్లిపోయింది. ఇది మొత్తం ఆలయంలో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయింది.

    Manmohan Singh Family: కేంద్ర మంత్రి తీరుపై మన్మోహన్ సింగ్ కుటుంబం అభ్యంతరం.. ఇలాగేనా చేసేది అంటూ..


    Singhu border killing: రైతులు ఆందోళన చేస్తున్న సింఘు సరిహద్దుల్లో ఘోరం.. అత్యంత కిరాతకంగా హత్య.. ఈ హత్య చేసింది ఎవరు..?

    అయితే ఆ తర్వాత మీనా దేవి తన బంగారు గొలుసు చోరీకి గురైందనే విషయాన్ని గ్రహించింది. ఈ ఘటనకు సంబంధించి సీసీ ఫుటేజ్ (CCTV Footage) ఆధారంగా దొంగతనం చేసిన మహిల గురించి అన్వేషణ కొనసాగుతంది. మహిళను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
    Published by:Sumanth Kanukula
    First published: