THEFT AT TEMPLE IN YELLANDU BHADRADRI KOTTAGUDEM DISTRICT SNR KMM
Telangana: భద్రాద్రి జిల్లాలోని ఆ అమ్మవారి గుడిలో హుండీ,నగలు మాయం..ఎవరి పనో తెలుసా
(గుడిలో హుండీ, నగలు మాయం)
Theft:ముత్యాలమ్మ తల్లి మెడలో నగలు మాయం చేశారు మాయదారి దొంగలు. ఇల్లందు మండల కేంద్రంలోని ఇళ్ల మధ్య ఉన్న ఆలయం తాళాలు పగలగొట్టి హుండీలో డబ్బు, అమ్మవారి విగ్రహంపై నగలు దోచుకెళ్లారు.స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు దొంగల్ని పట్టుకునే పనిలో పడ్డారు.
భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kottagudem)జిల్లాలో దొంగలు బరితెగిస్తున్నారు. నగలు, నగదు కోసం ఇళ్లకు కన్నాలు వేసే స్థాయి నుంచి ఇళ్లలోకి చొరబడి దాడి చేసిన నగలు ఎత్తుకెళ్లేందుకు తెగిస్తున్నారు. ఇళ్లే కాదు ఇప్పుడు దొంగలు తమ టార్గెట్ ఆలయపైనే పడింది. సెక్యురిటీ లేని గుళ్లు, సీసీ కెమెరాలు(cc camera) అమర్చి దేవాలయాలను ఎంచుకొని హుండీలు మాయం చేస్తున్నారు. దేవతామూర్తుల విగ్రహాల మెడలో నగలు(Jewelry)వెండి సామాన్లు (Silverware)దోచుకెళ్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు(Yellandu)లో ఈతరహా దోపిడీలు, దొంగతనాలు ఈ మధ్యకాలంలోనే మరింత పెట్రేగిపోయాయి.
గుడిలో నగలు, కానుకలు మాయం..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలోని బాలాజీ నగర్ పంచాయితీ పరిధిలోని సంజయ్‌నగర్‌లో చోరీ జరిగింది.ముత్యాలమ్మగుడిలో అమ్మవారి నగలు, గుడిలో హుండీపై కన్నేసిన దుండగులు గుడి తాళాలు పగలగొట్టి లోపలికి చొరబడ్డారు. హుండీలో డబ్బులు తీసుకొని హుండీని గుడి పక్కనే ఉన్న చెట్లలో పడేసారు. అటుపై గుడిలో ఉన్న ముత్యాలమ్మ తల్లి విగ్రహానికి అలంకరించిన బంగారు నగలను ఎత్తుకెళ్లారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో గుడి దగ్గరకు చేరుకున్న పోలీసులు, క్లూస్ టీమ్ ఆలయంలోని చోరీ చేసిన నగలు, హుండీ పడేసిన ప్రాంతాన్ని పరిశీలించారు. క్లూస్ సేకరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
దొంగల బీభత్సం ..
అమ్మవారి గుడిలో చోరీ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. దేవాలయంలో చుట్టూ జనం ఉంటున్న గుడిలోనే దొంగతనం చేస్తే..ఇళ్లలో ఉంటున్న తమపై దాడి చేస్తే పరిస్థితి ఏమిటని భయపడిపోతున్నారు. ఇప్పుడే కాదు గత కొంతకాలంగా ఇళ్లల్లో చోరీకి పాల్పడిన దొంగలు ఇంట్లో ఉన్న వారిని చితకబాది డబ్బులు, బంగారు నగలు ఎత్తుకెళ్లిన సంఘటనలు ఉన్నాయి. దోపిడి దొంగల దాడిలో ఇద్దరు వ్యక్తులు చనిపోవడంతో స్థానికుల్లో గుబులు మొదలైంది.
వరుస చోరీలతో భయపడుతున్న జనం..
ఇల్లందు మండల కేంద్రంలోనే దారుణాలకు తెగబడుతూ చోరీలు చేస్తుంటే పోలీసులు శాంతిభద్రతలపై దృష్టి పెట్టడం లేదంటున్నారు. రోజు రోజుకు పెరుగుతున్న దోపిడీలు, దొంగతనాల్ని దృష్టిలో పెట్టుకొని పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని కాలనీలు, శివారు ప్రాంతాల్లో నైట్ పెట్రోలింగ్ ఏర్పాటు చేసిన స్థానికుల ధన, మాన, ప్రాణాలకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు.
Published by:Siva Nanduri
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.