హోమ్ /వార్తలు /క్రైమ్ /

ప్రేమపేరుతో మోసం.. యువతి దెబ్బకు అడ్డం తిరిగిన కథ

ప్రేమపేరుతో మోసం.. యువతి దెబ్బకు అడ్డం తిరిగిన కథ

బ్యాంకు అధికారులు అతడికి నష్టపరిహారాన్ని చెల్లించాల్సిందేనంటూ తీర్పునిచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇలా కూడా సెలవులు పొందొచ్చా? అంటూ నెటిజన్లు తెగ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

ఓ యువకుడు హైదరాబాద్‌కు చెందిన యువతితో మూడేళ్లు ప్రేమాయణం సాగించాడు. తీరా మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడు. విషయం తెలుసుకున్న సదరు యువతి ఫిర్యాదు చేయడంతో పీటల మీద పెళ్లి ఆగిపోయింది.

  ప్రేమన్నాడు.. పెళ్లి చేసుకుంటానన్నాడు.. మూడేళ్లు కలిసే తిరిగారు. కానీ చివరికి ఆ యువకుడు మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడు. కానీ ప్రియురాలు పోలీసులను ఆశ్రయించడంతో పీటల మీదే పెళ్లి ఆగిపోయింది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని సెంటినరీ కాలనీలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సెంటినరీ కాలనీకి చెందిన నాగెళ్లి సాంబయ్య, స్వరూపరాణి దంపతుల మొదటి కొడుకు వరుణ్ కుమార్. ఇతడు హైదరాబాద్‌కు చెందిన ఓ యువతితో మూడేళ్లుగా ప్రేమాయణం సాగించాడు.

  తీరా సూర్యాపేట జిల్లాకు చెందిన మరో యువతితో వివాహానికి సిద్ధమయ్యాడు. శనివారం ఉదయం 9.58 గంటలకు వివాహం చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇంతలో సదరు యువతి హైదరాబాద్‌లోని ముషీరాబాద్ పోలీసు స్టేషన్‌లో ప్రేమపేరుతో మోసం చేశాడని, మరో యువతిని పెళ్లి చేసుకుంటున్నాడని ఫిర్యాదు చేసింది. వెంటనే అక్కడి పోలీసులు రామగిరి మండల పోలీసులకు సమాచారం ఇవ్వడంతో శనివారం వరుణ్‌ను అరెస్టు చేశారు. పెళ్లికొడుకును అరెస్టు చేశారని తెలియడంతో పెళ్లికి వచ్చిన బంధువులంతా వెనుదిరిగి పోయారు.

  Published by:Anil
  First published:

  Tags: Hyderabad, Karimangar, Marriage

  ఉత్తమ కథలు