Gokarting: హైదరాబాద్‌లో విషాదం.. ప్రమాదవశాత్తు యువతి మృతి

Gokarting: హైదరాబాద్ కు చెందిన ఓ యువతి కార్టింగ్ చేస్తుండగా కారు టైరులో వెంట్రుకలు చిక్కుకుని కింద పడింది. తలకు తీవ్రంగా గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.

news18-telugu
Updated: October 8, 2020, 7:09 PM IST
Gokarting: హైదరాబాద్‌లో విషాదం.. ప్రమాదవశాత్తు యువతి మృతి
వర్షిణి(ఫైల్ ఫొటో), ప్రమాద స్థలం
  • Share this:
అప్పటిదాక సరదాగా ఉన్న ఆ యువతికి అనుకోని ప్రమాదం ఎదురైంది. తల వెంట్రుకలే యమపాశమై ప్రాణాలు తీశాయి. సరదాగా బయటకు వెళ్లిన తమ కూతురు చనిపోయందన్న వార్త విన్న ఆ తల్లిదండ్రుల గుండెలు పగిలి కుప్పకూలారు. హృదయాన్ని కలిచివేసే ఈ విషాదఘటన హైదరాబాద్ నగర శివారులో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. హైదరాబాద్ లోని వనస్థలీపురానికి చెందిన శ్రీ హర్షిణి అనే విద్యార్థి ఇంజనీరింగ్ చదువుతోంది. అయితే గుర్రంగూడలోని ఓ ప్లే జోన్ కు ఆ యువతి సరదాగా గడిపేందుకు తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లింది. అక్కడ ఆ యువతి కార్టింగ్ చేస్తుండగా ఊహించని ఘటన చోటు చేసుకుంది.

అనుకోకుండా హెల్మెట్ కింద పడిపోవడంతో ఆమె వెంట్రుకలు కారు టైరులో చిక్కుకుపోయాయి. దీంతో ఆ యువతి ఒక్క సారిగా ఎగిరి రోడ్డుపై పడిపోయింది. దీంతో ఆ యువతి తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. తీవ్ర రక్త స్రావం అయ్యింది. వెంటనే ఆ యువతిని బంధువులు, అక్కడ ఉన్న వారు ఆస్పత్రికి తరలించారు. తలకు తీవ్రంగా గాయాలు కావడంతో చికిత్స ప్రారంభించిన కొద్ది సేపటికే మృతి చెందింది. కారు వేగంగా ఉండడంతో ప్రమాద తీవ్రత అధికంగా ఉన్నట్లు సమాచారం.


నిర్లక్ష్యంగా నిర్వాహకుల తీరు..

అయితే గో కార్టింగ్ నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగానే తమ కూతురు చనిపోయిందని బాధిత తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు నిర్వాహకులపై మీర్ పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరిగినప్పటి నుంచి గో కార్టింగ్ నిర్వాహకులు అందుబాటులోకి రాలేదని బాధిత కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. హెల్మెట్ కింద పడిపోవడంతోనే ప్రమాద తీవ్రత పెరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీట్ బెల్ట్, హెల్మెట్ సరిగా లేకపోవడంతోనే ఇలా జరిగిందని చెబుతున్నారు. హెల్మట్ చిన్నపిల్లలు పెట్టుకునేలా ఉందని ఆరోపిస్తున్నారు. గో కార్టింగ్ యాజమాన్యం మాత్రం తాము అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నామని చెబుతోంది.
Published by: Nikhil Kumar S
First published: October 8, 2020, 6:13 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading