గిరిజన యువకులను చితకబాది...మూత్రం తాగించిన పోలీసులు...

5 గురు గిరిజన యువకులను అదుపులో తీసుకున్నారు. స్టేషన్ లోని వారిని చితకబాదారు. గాయాలు తాళలేక మంచినీళ్లు అడిగిన యువకులకు మూత్రం తాగించారు.

news18-telugu
Updated: August 13, 2019, 11:01 AM IST
గిరిజన యువకులను చితకబాది...మూత్రం తాగించిన పోలీసులు...
తీవ్రంగా గాయపడ్డ బాధితులు, నిలదీస్తున్న కుటుంబసభ్యులు (Image : ANI)
news18-telugu
Updated: August 13, 2019, 11:01 AM IST
కస్టడీలో ఉన్న వ్యక్తితో మధ్య ప్రదేశ్ పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. నిదింతులను స్టేషన్ లో చిత్రహింసలకు గురిచేసిన వారితో మూత్రం తాగించిన ఘటనతో యావత్ దేశం ఉలిక్కి పడింది. వివరాల్లోకి వెళితే మధ్యప్రదేశ్ లోని అలీరాజ్ పూర్ జిల్లాలోని నన్పూర్ పోలీస్ స్టేషన్‌లో ఆన్ డ్యూటీలో ఉన్న పోలీసులపై దాడి చేసారనే కేసులో 5 గురు గిరిజన యువకులను అదుపులో తీసుకున్నారు. స్టేషన్ లోని వారిని చితకబాదారు. గాయాలు తాళలేక మంచినీళ్లు అడిగిన యువకులకు మూత్రం తాగించారు. వరుసగా మూడు రోజులు కస్టడీలో చిత్రహింసలకు పాల్పడటంతో ఆ యువకులు తీవ్ర అస్వస్థతతకు గురయ్యారు. దీంతో వారిని స్థానిక అలీరాజ్‌పూర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడే విషయం బయటపడింది. ఘటనపై స్థానిక ఎస్పీ విపుల్ శ్రీవాస్తవ సీరియస్ యాక్షన్ తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికే నలుగురు పోలీసులను విధుల నుంచి తప్పిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

First published: August 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...