కరోనాను జయించిన ఆనందంలో ఇంటికెళ్తుండగా.. రోడ్డు ప్రమాదంలో..

చిన్నశంకరంపేటకు చెందిన వెంకటేశ్, అతడి అల్లుడు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం కల్యాణికి చెందిన విజయ్‌లు హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని పోలీసు అకాడమీ క్యాంటీన్‌లో పనిచేసేవారు

news18-telugu
Updated: July 12, 2020, 1:10 PM IST
కరోనాను జయించిన ఆనందంలో ఇంటికెళ్తుండగా.. రోడ్డు ప్రమాదంలో..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఓ యువకుడికి కరోనా వైరస్ సోకింది. ఒక్కట్రెండు రోజులు కాదు.. 14 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ పోరాడాడు. మరోసారి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా, ఫలితం నెగిటివ్‌గా తేలింది. వైద్యులు ఇంటికెళ్లొచ్చని సూచించారు. అతి బతుకుతానో లేదో అన్న స్థితి నుంచి కరోనా తగ్గి వైద్యులు ఇంటికెళ్లాలని సూచించడంతో ఆ యువకుడి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. కరోనా మహమ్మారిని జయించానన్న ఆనందంతో ఇంటికి వెళుతున్న ఆ యువకుడు.. విధి ఆడే వింత నాటకంలో బలయ్యిపోయాడు. ఇంటికొస్తాడని గంపెడాశతో ఎదురుచూస్తున్న తల్లిదండ్రులకు రోడ్డు ప్రమాదంలో కానరాని లోకాలకు వెళ్లాడన్న వార్త అంతులేని శోకాన్ని మిగిల్చింది. ఈ ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. మెదక్ జిల్లాలోని చిన్నశంకరంపేటకు చెందిన వెంకటేశ్, అతడి అల్లుడు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం కల్యాణికి చెందిన విజయ్‌లు హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని పోలీసు అకాడమీ క్యాంటీన్‌లో పనిచేసేవారు. 15 రోజుల క్రితం విజయ్‌కు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, పాజిటివ్‌గా తేలింది.

దీంతో 14 రోజుల పాటు అక్కడే స్వీయ నిర్బంధంలో ఉండి కరోనాను జయించాడు. గురువారం మరోసారి పరీక్షలు నిర్వహించడంతో నెగిటివ్‌గా తేలింది. దీంతో అక్కడి అధికారులు విజయ్‌ను ఇంటికి వెళ్లాలని సూచించారు. దీంతో విజయ్, అతడి మామ వెంకటేశ్‌తో కలిసి బైకుపై శుక్రవారం ఇంటికి బయలుదేరాడు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం దండుపల్లకి వద్దకు రాగానే రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మామ అల్లుళ్లు వెంకటేశ్, విజయ్ ఇద్దరు చనిపోయారు. ఈ క్రమంలో విజయ్ తల్లిదండ్రులు మనోహరాబాద్ పోలీసు స్టేషన్‌కు వెళ్లిన సమయంలో అతడికి కరోనా సోకి తగ్గిన విషయం వెలుగులోకి వచ్చింది.

గ్రామంలో అంత్యక్రియలకు నిరాకరణ..
ఇదిలావుంటే.. విజయ్ మృతదేహానికి పోస్టుమార్టం నిమిత్తం అంత్యక్రియలు నిర్వహించేందుకు అంబులెన్సులో సొంత గ్రామం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం కల్యాణికి తరలించారు. అయితే విజయ్ కరోనా వైరస్ బారిన పడిన విషయం తెలుసుకున్న గ్రామస్తులు.. మృతదేహాన్ని ఇంటికి తీసుకువెళ్లనివ్వలేదు. 15 రోజుల క్రితం పోలీసులు, వైద్యులు ఇంటికి ఆరా తీయడంతో కరోనా వచ్చినట్టు గ్రామస్తులు నిర్ధారించుకున్నారు. దీంతో కుటుంబ సభ్యులు చేసేదేం లేక విజయ్ మృతదేహాన్ని శనివారం నేరుగా శ్మశాన వాటికకు తీసుకెళ్ల అంత్యక్రియలు నిర్వహించారు. విజయ్ దాదాపు మూడు నెలల క్రితం పని కోసం ఇంటి నుంచి హైదరాబాద్ వెళ్లాడు. అప్పటి నుంచి తల్లిదండ్రులు విజయ్‌ని చూడలేదు. కనీసం చివరి చూపునకు నోచుకోకపోవడంతో కుటుంబ సభ్యుల ఆవేదన అంతా ఇంతాకాదు.
Published by: Narsimha Badhini
First published: July 12, 2020, 1:10 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading