THE YOUNG MAN MURDERED THE YOUNG WOMAN HE LOVED IN ODISHA BN
అయ్యో పాపం.. ప్రేమించిన పాపానికి ప్రాణం తీసేశాడు..
ప్రతీకాత్మక చిత్రం
తెంతులుకుంటి సమితి కొంచులుగుమ్మ గ్రామానికి చెందిన కాలేజీ చదివే యువతి అదే గ్రామానికి చెందిన ఓ యువకుడిని ప్రేమించింది. యువతియువకులు ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకోవడంతో కొంతకాలం పాటు సాఫీగానే సాగింది.
ఓ యువతి తన గ్రామానికి చెందిన ఓ యువకుడిని ప్రేమించింది. యువకుడి సైతం ప్రేమించడంతో ఇద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. కానీ ఇంతలో ఏమైందో ఏమోగానీ ప్రేమించిన పాపానికి ఆ యువతిని చంపేశాడు. ఈ ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఒడిశాలోని నవరంగపూర్ జిల్లా తెంతులుకుంటి సమితి కొంచులుగుమ్మ గ్రామానికి చెందిన కాలేజీ చదివే యువతి అదే గ్రామానికి చెందిన ఓ యువకుడిని ప్రేమించింది. యువతియువకులు ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకోవడంతో కొంతకాలం పాటు సాఫీగానే సాగింది. ఈ నేపథ్యంలో యువకుడు గురువారం ఆ యువతిని గ్రామంలోని ఓ పాఠశాల వద్ద కలుసుకుందామంటూ పిలిచాడు. ఏమైందో ఏమోగానీ యువకుడిని నమ్మి అక్కడికి వెళ్లిన యువతిని యువకుడు చంపేశాడు.
యువతి ఎంతకీ ఇంటికి తిరిగిరాకపోవడంతో ఆమెను కుటుంబ సభ్యులు వెతుక్కుంటూ వెళ్లారు. విద్యాలయం వద్ద యువతి అచేతన స్థితిలో పడి ఉండడాన్ని కుటుంబ సభ్యులు గమనించారు. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్టు వైద్యులు తెలిపారు. దీంతో యువతి కుటుంబ సభ్యులు యువకుడిపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. యువకుడు పరారీలో ఉండగా కేసు నమోదు చేసుకుని పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు. కాగా స్థానికంగా యువతి హత్య కలకలం సృష్టించింది.
Published by:Narsimha Badhini
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.