Home /News /crime /

THE YOUNG MAN CHEATED BY BELIEVING THAT HE WOULD MARRY THE YOUNG WOMAN IN KARIMNAGAR BN

పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. భర్త నుంచి విడాకులు తీసుకోమ్మని మోసం..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

పెద్దమ్మ ఇంటి ముందు ఉంటే నాగుల చంద్రశేఖర్‌తో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారి శారీరకంగా ఒక్కటయ్యే వరకు వచ్చింది. ఈ క్రమంలో అంజలికి సంవత్సరం క్రితం మరో వ్యక్తితో వివాహం అయ్యింది.

    ఓ యువతిని యువకుడు ప్రేమించాడు. పెళ్లి చేసుకుంటానన్నాడు. యువకుడిని నమ్మిన యువతి శారీరకంగానూ దగ్గరయ్యింది. ఈ క్రమంలో వేరే వ్యక్తితో యువతికి పెళ్లి చేశారు. అయినా పెళ్లి తర్వాత కూడా ఆ యువకుడు యువతిని పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమెను కలుస్తూనే వస్తున్నాడు. భర్తకు అనుమానం రావడంతో అతడి నుంచి విడాకులు తీసుకో.. నేను పెళ్లి చేసుకుంటానని యువకుడు యువతికి చెప్పాడు. అది నమ్మి ఆ యువతి భర్త నుంచి విడాకులు తీసుకుంది. తీరా పెళ్లి చేసుకుందామంటే మొహం చాటేశాడు. దీంతో ఆ యువతి ప్రియుడి ఇంటి ఎదుట బైఠాయించింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. జూలపెల్లి మండల కేంద్రానికి చెందిన వొల్లాజి అంజలి(24) కొన్ని సంవత్సరాల క్రితం ఏరడపెల్లిలోని తన పెద్దమ్మ ఇంటికి వచ్చింది. ఆ సమయంలో పెద్దమ్మ ఇంటి ముందు ఉంటే నాగుల చంద్రశేఖర్‌తో పరిచయం ఏర్పడింది.

    అది కాస్త ప్రేమగా మారి శారీరకంగా ఒక్కటయ్యే వరకు వచ్చింది. ఈ క్రమంలో అంజలికి సంవత్సరం క్రితం మరో వ్యక్తితో వివాహం అయ్యింది. పెళ్లి తర్వాత కూడా చంద్రశేఖర్ అంజలికి తరచూ ఫోన్ చేసేవాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మిస్తూ వీలు ఉన్నప్పుడల్లా శారీరకంగా కలిసేవాడు. తరచూ ఫోన్‌లో మాట్లాడుతుండడం, కలస్తుండడంతో అంజలి భర్తకు అనుమానం వచ్చింది. దీంతో అంజలి తన భర్తకు అనుమానం వచ్చిందని చంద్రశేఖర్‌కు చెప్పింది. దీంతో చంద్రశేఖర్ నేను పెళ్లి చేసుకుంటా.. భర్త నుంచి విడాకులు తీసుకోవాలని చెప్పాడు.

    దాంతో అంజలి పది రోజుల క్రితం భర్త నుంచి విడాకులు తీసుకుంది. అనంతరం పెళ్లి చేసుకుందామని చంద్రశేఖర్‌ను అడిగితే మొహం చాటేశాడు. దీంతో అంజలి ప్రియుడి ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. దీంతో చంద్రశేఖర్, అతడి కుటుంబ సభ్యులు అంజలిని తిట్టడంతో గొడవకు దారితీసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు.
    Published by:Narsimha Badhini
    First published:

    Tags: Crime news, Karimnagar, Lovers

    తదుపరి వార్తలు