కొట్టాయం: కేరళలోని కొట్టాయం మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌లో మూడు రోజుల పసికందు కిడ్నాప్‌కు గురైన ఘటన కలకలం రేపింది. జనవరి 6న జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. కిడ్నాప్ చేసింది 33 ఏళ్ల మహిళ అని తెలిసి పోలీసులు అవాక్కయ్యారు. ఆమెను హాస్పిటల్ దగ్గర్లో ఉన్న లాడ్జిలో ఉండగా అదుపులోకి తీసుకున్నారు. ఆ పసికందును తల్లి వద్దకు చేర్చారు. అయితే.. ఈ కేసు విచారణలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. పాపను కిడ్నాప్ చేసిన ఆ మహిళ పేరు నీతూ. తిరువళ్లకు చెందిన ఆమె ప్రస్తుతం కలమస్సేరిలో ఉంటోంది. జనవరి 6న సాయంత్రం 3 గంటల సమయంలో నర్సులా గెటప్ వేసుకుని హాస్పిటల్‌లోకి ఎంటరైంది. పాప ఆరోగ్యాన్ని పరీక్షించే నెపంతో ఆ పసికందును అక్కడ నుంచి తీసుకుని వెళ్లిపోయింది.
నర్సు పాపను తీసుకెళ్లి ఎంతకూ తిరిగిరావడం లేదేంటని తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. హాస్పిటల్‌లో విచారించగా ఆమె అసలు నర్సే కాదని తెలిసింది. పాపను ఆ మహిళ ఎత్తుకెళ్లిపోయిందని తల్లిదండ్రులకు అర్థమైంది. మూడు రోజుల క్రితం పుట్టిన తమ పాపను ఓ మహిళ నర్సులా వచ్చి కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయిందని గాంధీ నగర్ పోలీస్ స్టేషన్‌లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా.. పాపను ఎత్తుకెళ్లిపోయిన ఆ నకిలీ నర్సు తొలుత లాడ్జికి వెళ్లింది. ఆ తర్వాత లాడ్జి దగ్గర నుంచి వెళ్లిపోయేందుకు ఓ ఆటో మాట్లాడుకునేందుకు బయటకు వచ్చింది.
ఇది కూడా చదవండి: OMG: 50 ఏళ్ల వయసులో కూడా ఇంత కామ కోరికలా.. ఆమెనూ, నిన్నూ ఏం చేయాలి అసలు..
ఆటోను ఆపి.. తనతో పాటు ఒక పిల్లాడు, పసికందు ఉన్నారని.. తాను హాస్పిటల్‌కు వెళ్లాలని చెప్పింది. ఆమె తీరుపై ఆటో డ్రైవర్ అలెక్స్‌కు అనుమానం వచ్చింది. కొట్టాయం హాస్పిటల్‌లో పాప కిడ్నాప్‌కు గురైన విషయం అప్పటికే తెలుసుకున్న ఆటో డ్రైవర్ పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు వెంటనే స్పాట్‌కు చేరుకుని ఆమెను అరెస్ట్ చేశారు. ఆ పసికందును క్షేమంగా తల్లి ఒడికి చేర్చారు.
నీతూ అనే ఈ మహిళ పసికందును ఎందుకు కిడ్నాప్ చేసిందో తెలిసి పోలీసులు అవాక్కయ్యారు. తనతో కొంత కాలం నుంచి కలిసి ఉండి.. ఇప్పుడు మరో పెళ్లికి సిద్ధపడిన తన లవర్ ఇబ్రహీంను బ్లాక్‌మెయిల్ చేసేందుకు పాపను కిడ్నాప్ చేసినట్లు పోలీసులకు నీతూ చెప్పింది. నీతూ(33), ఇబ్రహీం(28) కొంత కాలంగా ప్రేమలో మునిగి తేలారు. శారీరక సంబంధం కొనసాగించడంతో నీతూ రెండుసార్లు గర్భం దాల్చింది. గర్భం దాల్చిన నీతూకు ఏవేవో మాయమాటలు చెప్పి ఇబ్రహీం అబార్షన్ చేయించాడు. అంతేకాదు.. నీతూ నుంచి దాదాపు 30 లక్షల డబ్బు, బంగారం కూడా ఇబ్రహీం తీసుకున్నాడు. అన్నీ తీసుకున్న తర్వాత ఇబ్రహీం నీతూకు హ్యాండిచ్చి మరో పెళ్లికి సిద్ధపడ్డాడు. ఈ విషయం తెలిసి ఇబ్రహీం పెళ్లిని ఎలాగైనా ఆపాలని.. ఓ పసికందును చూపించి నీ వల్లే ఈ పాప పుట్టిందని చెప్పి ఇబ్రహీంను బ్లాక్‌మెయిల్ చేసి.. తన డబ్బు, బంగారం తిరిగి పొందాలని నీతూ భావించింది. పక్కా ప్లాన్ ప్రకారం.. పాపను కిడ్నాప్ చేసింది. నీతూకు, ఇబ్రహీంకు టిక్‌టాక్‌లో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఇద్దరూ బాగా దగ్గరయ్యారు. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. ఇబ్రహీం మోజులో పడి తన భర్తకు కూడా నీతూ విడాకులిచ్చింది. పోలీసులు ఇబ్రహీంను, ఈ కిడ్నాప్‌కు పాల్పడిన నీతూను అరెస్ట్ చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Kerala, Kidnap, New born baby