ఆ ఊరి గ్రామస్తులే దారుణానికి పాల్పడ్డారు.. ఆ ఒక్క రోజు ఆమె అటు వెళ్లకుండా ఉంటే ఇలా జరిగేది కాదేమో..

ప్రతీకాత్మక చిత్రం

Crime News: ఇద్దరు వ్యక్తులు ఫుల్ గా మద్యం సేవించి ఓ మహిళను వివస్త్రను చేసి దారుణంగా చంపేశారు. ఈ ఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

 • Share this:
  నల్గొండ(Nalgonda) జిల్లాలో దారుణం జరిగింది. ముషంపల్లి(Mushampalli) గ్రామంలో ఓ మహిళను దారుణంగా హత్య చేశారు ఇద్దరు దుండగులు. మహిళ వివస్త్రను చేసి దారుణంగా చంపి.. పరారయ్యారు. ఈ ఘోరం చేసిన సమయంలో నిందితులిద్దరూ మద్యం మత్తులో ఉన్నారని తెలుస్తోంది. ఆ మహిళ ఒంటిపై ఉండాల్సిన బంగారు ఆభరణాలు మాయమ్యాయని, దీంతో మద్యం మత్తులో ఆభరణాల కోసమే హత్య చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులు లింగయ్య, పుల్లయ్య కోసం పోలీసులు గాలిస్తున్నారు. వ్యసనాలకు బానిసైన ఇద్దరు .. ఓ పెద్ద వయసు మహిళపై పట్టపగలే అత్యాచారానికి పాల్పడ్డారు.

  అందరితో పాటే ఆ బాలిక నిమజ్జనానికి వెళ్లింది.. మాయ మాటలు చెప్పి 17 ఏళ్ల బాలుడు.. మసీదు వెనకకు తీసుకెళ్లి..


  ఆమెపై ఉన్న బంగారాన్ని లాక్కుని, చివరికి హత్య చేశారు. నల్లగొండ జిల్లా కేంద్రానికి దగ్గరిలో ఉన్న మూషంపల్లి గ్రామంలో ఈ దారుణం జరిగింది. ఇంత దుర్మార్గానికి పాల్పడిన ఇద్దరూ 34 ఏళ్లలోపు వారే.. బాధిత మహిళ ఇంటికి సమీపంలో ఉండేవారే కావడం గమనార్హం. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లాలోని మూషంపల్లికి చెందిన 54 ఏళ్ల మహిళ, తన భర్త నివాసం ఉంటున్నారు. జీవనోపాధికోసం తన ఇంటికి సమీపంలో ఓ కిరాణ దుకాణాన్ని నడిపిస్తున్నారు. రోజూ ఆమె ఆ దుకాణానికి ఇంటి నుంచి నడుచుకుంటూ వెళ్లేది.

  ఓ రోజు ఇలానే కిరాణ దుకాణానికి నడుచుకుంటూ వెళ్తుండగా పెద్ద వర్షం వచ్చింది. ఆమె హడావుడిగా నడుచుకుంటూ వెళ్తుండగా.. దారి మధ్యలో లింగయ్య యాదవ్ అనే ఇంటి వద్దకు రాగానే అతడితో పాటు ఏర్పుజర్ల పుల్లయ్య ఆమెను ఆపారు. అటు బయట వర్షం పడుతుండగా.. ఇద్దరు కలిసి ఆమెను బలవంతంగా ఇంటి లోపలకి లాక్కెళ్లారు.

  Court Bail: వింత తీర్పు.. బెయిల్ మంజూరు చేయాలంటే.. ఈ పని చేయాల్సిందే..


  ఆమెను వివస్త్రను చేసి.. సామూహికంగా అత్యాచారానికి పాల్పడ్డారు. సదరు వ్యక్తులు మద్యం సేవించి ఉన్నట్లు తెలిసింది. అత్యాచారానికి పాల్పడటంతోపాటు ఆమె ఒంటిపై ఉన్న నగలు లాక్కున్నారు. తర్వాత ఆమెను నేలకేసి.. గోడకేసి  తలను కొట్టడంతో అక్కడిక్కడే చనిపోయింది. దీంతో ఇద్దరు కలిసి ఆ వర్షంలోనే ఆమె ఇంటికి మృతదేహాన్ని తీసుకెళ్లి వరండాలో పడేసి వెళ్లిపోయారు. ఇంటికి వచ్చి రక్తపు మరకలను కడిగేశారు. తర్వాత అక్కడ నుంచి పుల్లయ్య బయటకు వెళ్లగా.. లింగయ్య మాత్రం ఇంట్లోనే ఉన్నాడు. పుల్లయ్య వెళ్తున్న క్రమంలో సదరు మహిళ మరిది కనిపించాడు. మీ వదిన రోడ్డుపై పడి ఉంది అంటూ చెప్పాడు. ఆమె మరిది పరుగున వచ్చి చూసేసరికి.. వరండాలో రక్తపు మడుగులో ఆమె కనిపించింది.

  ఈ తతంగం మొత్తం గ్రామస్తులు తెలుసుకున్నారు. ఇద్దరిని పట్టుకొని చితకబాది.. పోలీసులకు అప్పజెప్పారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఉండగా.. వాళ్లకు పెళ్లిళ్లు అయ్యాయి. అయితే హత్యాచారానికి పాల్పడిని లింగయ్య, పుల్లయ్యలు ఇద్దరూ వ్యవసాయ పనులు చేసుకునేవారు. కొన్నాళ్లు మద్యానికి బానిసగా మారారు. ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోకపోవడంతో పుల్లయ్య భార్య విడాకులు తీసుకొని వెళ్లిపోయింది. ఈ మధ్య అతడు రెండో వివాహం చేసుకున్నాడు. రెండో భార్యతో కూడా రోజూ అదే తంతు. నిత్యం గొడవలు జరగ్గా.. కొన్ని రోజుల తర్వాత వాళ్లు కూడా కనిపించలేదు. అయితే పుల్లయ్య వేధింపులకు భరించలేక వాళ్లు ఎటైనా వెళ్లారా.. లేదా ఇతడే చంపేశాడా అన్న అనుమానాలు ఇంకా ఉన్నాయి.

  ప్రేమ వివాహం చేసుకున్నాడు.. భార్య ఇంత పని చేస్తుందని అతడు ఊహించలేకపోయాడు.. చివరకు..


  అయితే గ్రమాస్తులు మాత్రం పుల్లయ్య చంపాడన్న ఆరోపణలు చేస్తున్నారు. ఇక బక్కతొట్ల లింగయ్య కూడా మహిళలతో తరచూ అసభ్యంగా ప్రవర్తించేవాడని గ్రామస్తులు చెప్తున్నారు. వారం రోజుల కింద కూడా గ్రామంలో ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడని.. అయితే లింగయ్య భార్య వచ్చి బతిమాలడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయలేదని తెలిసింది. తర్వాత లింగయ్య భార్య కూడా అతడితో గొడవ పెట్టుకొని పుట్టింటికి వెళ్లిపోయిందని స్థానికులు చెబుతున్నారు. ఇలా భార్య, పిల్లలు లేకుండా.. మద్యం సేవించి ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తుంటారని గ్రామస్తులు చెబుతున్నారు
  Published by:Veera Babu
  First published: