లిఫ్ట్ ఇస్తామని చెప్పి మహిళను కారులో ఎక్కించుకొని అడవిలోకి తీసుకెళ్లి...

మహిళకు లిఫ్టు ఇస్తామని అందులోని డ్రైవర్ అన్నాడు. దీంతో ఆమె కారెక్కింది. కాస్త దూరం వెళ్లిన తర్వాత మరో ఇద్దరు కూడా కారులో ఎక్కారు. కొంతదూరం వెళ్లిన తరువాత ఆ కారులో ఉన్న ముగ్గురు నిందితులూ ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు.

news18-telugu
Updated: September 15, 2019, 10:41 PM IST
లిఫ్ట్ ఇస్తామని చెప్పి మహిళను కారులో ఎక్కించుకొని అడవిలోకి తీసుకెళ్లి...
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: September 15, 2019, 10:41 PM IST
లిఫ్టు ఇస్తామని కారు ఎక్కించుకొని మహిళపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటుచేసుకుంది. కైరానా పట్టణం సమీంలో ఓ మహిళ బస్టాపులో బస్సు ఎంతకి రాకపోవడంతో అర్థరాత్రి అయిపోవడంతో ఏం చేయాలో తోచని నిల్చొని ఎవరైనా సహాయం చేస్తారేమోనని ఎదురుచూసింది. ఈ సమయంలోనే అటుగా వెళ్తున్న ఓ కారు ఆమె ముందు ఆగింది. మహిళకు లిఫ్టు ఇస్తామని అందులోని డ్రైవర్ అన్నాడు. దీంతో ఆమె కారెక్కింది. కాస్త దూరం వెళ్లిన తర్వాత మరో ఇద్దరు కూడా కారులో ఎక్కారు. కొంతదూరం వెళ్లిన తరువాత ఆ కారులో ఉన్న ముగ్గురు నిందితులూ ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు.

నిందితులు ఆమెను సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం బాధితురాలిని బెదిరించి అక్కడి నుంచి జారుకున్నారు. అనంతరం బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

First published: September 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...