Father And Son: మహిళను ఓ గదిలో నెలల పాటు నిర్భంధించి.. తండ్రీకొడుకులు దారుణానికి ఒడిగట్టారు.. చివరకు ఆమెను ఓ వ్యక్తితో..

ప్రతీకాత్మక చిత్రం

Madhyapradesh: మధ్యప్రదేశ్‌కు చెందిన తండ్రీకొడుకులు దారుణానికి పాల్పడ్డారు. ఓ మహిళను కొన్ని నెలల పాటు నిర్బంధించి ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఆ తరువాత బాధితురాలిని ఓ వ్యక్తికి రూ.60 వేలకు అమ్మేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
    ఆమె ఒక నిరుద్యోగి. ఉద్యోగం కోసం పలు ఇటర్వ్యూలకు వెళ్లింది. అయినా ఎక్కడా ఉద్యోగం రాలేదు. ఒక రోజు ఇలాగే ఉద్యోగ అన్వేషణలో ఉన్న సమయంలో ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. అతడితో స్నేహం చేసింది. ఆమెకు ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి ఆమెను లొంగతీసుకున్నాడు. ఓ ఇంట్లో ఆమెను నిర్భందించి పలు మార్లు అత్యాచారం చేశాడు. అంతేకాకుండా అతడితో పాటు తన తండ్రి కూడా ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఇలా తండ్రి కొడుకులు ఒకరి తర్వాత ఒకరు ఆమెపై అత్యాచారం చేశారు. ఇలా ఆమనె ఓ గదిలో నిర్బందించి కొన్ని నెలలకు వరకు ఈ దారుణానికి పాల్పడ్డారు. చివరకు ఆమెను ఓ వ్యక్తికి ఇచ్చి అమ్మెయ్యాలని నిర్ణయించుకున్నారు. అదే వ్యక్తితో పెళ్లి చేయించేందుకు డీల్ కుదుర్చుకున్నారు. అనుకున్నట్లుగానే ఆమెను సదరు వ్యక్తికి అమ్మడంతో ఆమె నేరుగా పోలీసు స్టేషన్ కి వెళ్లి జరిగిన విషయం మొత్తం చెప్పింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

    ఈ ఘటన మధ్యప్రరేశ్ లోని భోపాల్ నగరంలో చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు పోలీసులు ఇలా చెప్పారు.  మధ్యప్రదేశ్‌ రాజధాని బోపాల్ నగరంలో రమేశ్ అతడి కొడుకు రవి నివసిస్తున్నారు. అందులో రవి అనే అతడినికి ఉద్యోగ అన్వేషణలో ఉన్న ఓ మహిళ నాలగు నెలల క్రితం పరిచయం ఏర్పడింది. ఆమెకు ఉద్యోగం కల్పిస్తానని మాయమాటలు చెప్పి పట్టణంలోని ఓ గదిలో ఆ మహిళను కొన్ని నెలల పాటు నిర్బంధించారు. ఆపై ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఆ తరువాత బాధితురాలిని ఓ వ్యక్తికి రూ.60 వేలకు అమ్మేశారు. ఓ రోజు ఆమె పోలీసులను ఆశ్రయించి వారిపై ఫిర్యాదు చేసింది.

    బాధితురాలిని పెళ్లి చేసుకునేందుకు సదరు వ్యక్తి తండ్రికొడుకులతో డీల్ కుదుర్చుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో నిందితుడు ఆమెపై ఓ రోజు అత్యాచారానికి పాల్పడ్డాడని, ఆ తరువాత అతడి తండ్రి రమేశ్‌ కూడా ఈ దారుణానికి తెగించాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సర్మన్ ప్రజాపతి అనే వ్యక్తితో డీల్ కుదిరే వరకూ తనపై తండ్రీకోడుకులు దారుణానికి పాల్పడ్డారని ఆమె పేర్కొన్నారు. పరారీలో ఉన్న తండ్రీకొడుకుల కోసం పోలీసులు ప్రస్తుతం విస్తృతంగా గాలిస్తున్నారు.
    Published by:Veera Babu
    First published: