THE WOMAN HAD DECIDED TO RUN AWAY WITH HER HUSBAND AFTER 12 YEARS OF MARRIAGE SSR
Married Woman: 12 ఏళ్లు భర్తతో కలిసి ఉన్న భార్య చేయాల్సిన పనేనా ఇది.. వదినమరిది ఇలా చేశారేంటో..
పరమ్‌జిత్ కౌర్, అమన్
బంధాలు, వావివరుసలు రోజురోజుకూ కనుమరుగైపోతున్నాయి. వదిన అంటే తల్లి తర్వాత తల్లిలాంటిదంటారు. వదినను మరిది తల్లిలా భావించి గౌరవించాలి. కానీ.. హర్యానాలోని ఓ గ్రామంలో వదినమరిది పెడతోవ పట్టారు.
కర్నాల్: బంధాలు, వావివరుసలు రోజురోజుకూ కనుమరుగైపోతున్నాయి. వదిన అంటే తల్లి తర్వాత తల్లిలాంటిదంటారు. వదినను మరిది తల్లిలా భావించి గౌరవించాలి. కానీ.. హర్యానాలోని ఓ గ్రామంలో వదినమరిది పెడతోవ పట్టారు. చివరకు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హర్యానాలోని కర్నాల్‌కు సమీపంలోని ఘోగ్రిపూర్ గ్రామంలో నివాసం ఉండే పరమ్‌జిత్ కౌర్(35) అనే మహిళకు, మనోజ్ అనే యువకుడికి 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ జంటకు ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. కొన్ని నెలల నుంచి మనోజ్ తమ్ముడు అమన్(28), పరమ్‌జిత్ వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నారు. మనోజ్‌కు తెలియకుండా వదినమరిది గుట్టుగా వ్యవహారం సాగించారు. అంతటితో ఆగలేదు.
కొన్ని రోజుల క్రితం అమన్, పరమ్‌జిత్ కలిసి ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. ఈ పరిణామం ఆ ఇంట్లో కలకలం రేపింది. తన తమ్ముడు, భార్య కలిసి ఇంట్లో నుంచి వెళ్లిపోయారని మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి 15 రోజుల్లో వాళ్ల ఆచూకీ కనుగొని ఇద్దరినీ తిరిగి ఇంటికి తీసుకొచ్చారు. అప్పటి నుంచి పరమజిత్ పిల్లలతో కలిసి ఇంట్లోనే ఉంటోంది. అమన్‌ను ఇంట్లో నుంచి పంపించేశారు. అంతా సద్దుమణిగిందని అంతా అనుకున్నారు. కానీ.. ఫోన్లో టచ్‌లో ఉన్న ఈ వదినమరిది షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఇలా విడిపోయి ఉండలేమని.. ఇద్దరం కలిసి చచ్చిపోదామని మాట్లాడుకుని చివరకు అన్నంత పని చేశారు. తాను చనిపోతే ముగ్గురు పిల్లలు తల్లికి దూరమవుతారన్న ఆలోచన కూడా లేకుండా పరమ్‌జిత్ అమన్‌తో కలిసి రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లింది. ఇద్దరూ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు.
అయితే.. కొన్ని రోజుల క్రితం ఇంట్లో నుంచి వీళ్లిద్దరూ వెళ్లిపోవడంతో గతంలోలా ఎక్కడికైనా వెళ్లిపోయి ఉంటారని అంతా భావించారు. కానీ.. ఇలా ఆత్మహత్య చేసుకోవడంతో ఆ గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రైలు కింద పడి చనిపోయింది అమన్, పరమ్‌జిత్ అని కుటుంబ సభ్యులు నిర్ధారించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరి మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు కారణాలపై పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. క్షణిక సుఖాల మోజులో పడి భర్త, కన్నబిడ్డలను దూరం చేసుకున్న పరమ్‌జిత్ కౌర్ జీవితం ఊహించని విధంగా ముగిసింది. వయసులో చిన్న చిన్న పిల్లలు కావడంతో పరమ్‌జిత్ చేసిన పనేంటో కూడా కన్నబిడ్డలు తెలుసుకోలేని పరిస్థితి. భార్య ఆత్మహత్యతో మనోజ్ కుమిలిపోయాడు.
Published by:Sambasiva Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.