కలకాలం కలిసి జీవిస్తానని బాసలు చేసిన భర్త పట్టించుకోలేదు. మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అన్నీ తెలిసీ భర్తకు విడాకులు ఇచ్చింది ఆ ఇల్లాలు. అయితే విడాకులు ఇచ్చిన భర్త (Husband) కుమారుడిని తీసుకువెళ్లి పంపకపోవడంతో మనస్తాపం చెందిన మహిళ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది (Mother commits suicide). ఈ ఘటన హైదరాబాద్ (Hyderabad)లోని రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం హుడా కాలనీకి చెందిన షహజాబేగం (25), ఎంఎం పహాడీకి చెందిన షేక్ ఇమ్రాన్ (29)తో నాలుగు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. షేక్ ఇమ్రాన్ స్థానికంగా హార్డ్‌వేర్ దుకాణాన్ని కొనసాగిస్తున్నాడు. ఇతడికి బంధువుల మహిళతో అక్రమ సంబంధం (Extra marital affairs) ఉండటంతో సంవత్సరం క్రితం షహజాబేగం రెడ్‌హ్యాండ్‌గా పట్టుకొని నిలదీసింది. అయితే భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నప్పటి నుంచి ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి.
హత్యా ప్రయత్నం..
ఆరు నెలల క్రితం షేక్ ఇమ్రాన్ పాలల్లో గుర్తు తెలిని క్రిమి సంహారక మందు (Poison) కలిపి షహజాబేగంతో తాగించాడు. దీంతో అస్వస్తతకు గురైన షహజాబేగంను ఆసుపత్రికి తరలించగా వారం రోజుల పాటు చికిత్స పొంది డిశ్చార్జ్ అయింది. ఈ సమయంలో భర్తపై రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ (Rajendra nagar police station)లో కేసు నమోదు చేసింది. వీరికి ఇద్దరు సంతానం. స్థానిక పెద్దల జోక్యంతో కేసు విత్‌డ్రా చేసుకున్న షహజాబేగం అమ్మగారి ఇంటి వద్దే ఉంటోంది. మూడు నెలల క్రితం విడాకులు తీసుకుంది. కాగా పది రోజుల క్రితం షేక్ ఇమ్రాన్ కుమారుడి (Son)ని చూస్తానని ఇంటికి తీసుకువెళ్లాడు. తిరిగి షాజాహబేగంకు అప్పగించలేదు. తరచూ స్థానికులతో అసత్య ప్రచారాన్ని చేపట్టాడు భర్త.
ఇది కూడా చదవండి: మద్యం తాగిన భర్త కిడ్నాప్.. భర్త ప్రాణాల కోసం మానాన్ని పణంగా పెట్టిన ఇల్లాలు.. ఆ రాత్రి ఏం జరిగిందంటే..
మనస్తాపం చెంది..
దీంతో మనస్తాపం చెందిన కుమారుడి తల్లి షాహజాబేగం ఇంట్లో ఉరి వేసుకొని (Mother Commits Suicide) మృతి చెందింది. తల్లిదండ్రులు రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పంచనామా నిర్వహించి మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు.
తన కూతురు చావుకు ఇమ్రాన్ కారణమని..
ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రాజేంద్రనగర్ పోలీసులు తెలిపారు. తన కూతురు చావుకు ఇమ్రాన్ కారణమని, అతని పై కఠిన చర్యలు తీసుకోవాలని శాజహా బేగం కుటుంబ సభ్యులు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కు విజ్ఞప్తి చేశారు. బుధవారం రాత్రి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: అయ్యో ఎంత పని చేశావమ్మా... డాక్టర్ చెప్పాడని నిండు గర్భిణి అయి ఉండి ఇంతటి కఠోర నిర్ణయం తీసుకున్నావా..?
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Extra marital affair, Hyderabad, Mother, Wife suicide