• Home
  • »
  • News
  • »
  • crime
  • »
  • THE WIVES SHARED THREE TO THREE DAYS A WEEK TO BE WITH HIM IN UTTARPRADESH VB

Two Wifes and One Husband: అతడికి ఇద్దరు భార్యలు.. కాపురం చేయడానికి అతడిని ఇలా పంచుకున్నారు.. పూర్తి వివరాలు తెలుసుకోండి..

ప్రతీకాత్మక చిత్రం

Wifes and Husband: ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులో ఇద్దరు భార్యల మొగుడుగా వెంకటేశ్ పాత్ర ఉంటుంది. అయితే ఇక్కడ నిజంగానే అలాంటి సినిమాని తలపించే విధంగా ఓ వ్యక్తి కి జరిగింది. కానీ ఇక్కడ అతడిని విచిత్రంగా కాపురం చేయడానికి వారిద్దరు భార్యలు రోజుల వారీగా పంచుకున్నారు.

  • Share this:
    అతడికి అప్పటికే వివాహం జరిగింది. మళ్లీ అతడు ఎవరికీ తెలియకుండా మరో పెళ్లి చేసుకుంటాడు. ఈ విషయం వాళ్లకు వీళ్లకు తెలయడంతో మొదటి భార్య దాకా వెళ్తుంది. గొడవలు జరిగాయి. తీరా ముగ్గురు ఒక ఒప్పందానికి వచ్చి ఈ పెళ్లిని ఒప్పకున్నారు. అందరి సమక్షంలో రెండో పెళ్లి చేసుకున్నాడు. అయితే ఇక్కడే ఒక చిక్కు వచ్చి పడింది. భర్త ఎవరి దగ్గర ఉండాలనే సందేహం కలిగింది. ఇక్కడ వాళ్లు పెద్దగా ఆలోచించి ఒక ఫార్ములాను వాడారు. అదే 50-50 ఫార్ములా. అంటే ఒక భార్య దగ్గర మూడు రోజులు, మరో భార్య దగ్గర మూడు రోజులు ఉండి మిగిలిన రోజు తన తల్లిదండ్రుల వద్ద ఉండేదుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ వార్త ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లో ధోంక్‌పురి తాండా ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి అంతకు ముందే వివాహం జరిగింది. అయితే, ఈ వ్యక్తికి అస్సాంకు చెందిన యువతితో ఫేస్‌బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఆ యువతి ప్రేమ కోసం వ్యక్తి తన భార్యను వదిలిపెట్టి చండీగఢ్ చేరుకున్నాడు.

    అక్కడ తన ప్రేయసితో కొంతకాలం సహజీవనం చేశాడు. అలా కొంతకాలం తరువాత యువతి గర్భవతి అయి ఒక బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో కంగారు పడిన వ్యక్తి.. తన ప్రేయసిని వదిలి స్వగ్రామానికి పారిపోయి వచ్చాడు. అది గ్రహించిన ప్రేయసి.. తనను వదిలేసి పారిపోయిన ప్రియుడి కోసం తీవ్రంగా గాలించింది. చివరికి అతని స్వగ్రామాన్ని కనిపెట్టి ఆ ఊరికి చేరుకుంది. తన గోడునంతా గ్రామ పెద్దలకు వివరించింది. పోలీసులకు ఆశ్రయించగా.. వారు కల్పించుకుని సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

    అనంతర పరిణామాల నేపథ్యంలో చివరికి ఆ వ్యక్తి తన ప్రేయసిని పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్య కూడా చేసేదేమీ లేక ఆ పెళ్లికి అంగీకరించింది. అయితే, పెళ్లి జరిగాక అసలు సమస్య ఉత్పన్నమయ్యింది. భర్త ఎవరి వద్ద ఉండాలనే సమస్య ఉత్పన్నమవగా.. మధ్యవర్తులు 50-50 ఫార్ములాను ఉపయోగించారు. అంటే మొదటి భార్య వద్ద 3 రోజులు, రెండవ భార్య వద్ద 3 రోజులు.. మిగిలిన ఒక రోజు అతని తల్లిదండ్రుల వద్ద ఉండేలా రాజీ కుదుర్చారు.
    Published by:Veera Babu
    First published: