మద్యం మత్తులో అర్థరాత్రి ఇంటికి వచ్చిన భర్త.. బెడ్రూంలో భార్య.. అక్కడ ఇలాంటి ఘటన జరుగుతుందని ఊహించి ఉండరు..

భార్యాభర్తలు

Husband Murder: మద్యం మత్తులో కత్తితో పొడవడానికి వచ్చిన భర్తను ఓ భార్య కడతేర్చింది. ఈ ఘటన తమిళనాడులోని కాంచీపురంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

 • Share this:
  వారిద్దరికి పది సంవత్సరాల క్రితం పెళ్లి జరిగింది. ఇద్దరు ఎంతో అన్యోన్యంగా ఉంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఈ మధ్య వారికి మనస్పర్థలు ఎక్కువగా అయ్యాయి. దీంతో తరచూ ఇంట్లో గొడవలు జరిగేవి. మద్యంకు బానిసగా మారిన ఆమె భర్త ప్రతీ రోజు భార్యను కొట్టేవాడు. ఓ రోజు అర్థరాత్రి మద్యం తాగి వచ్చిన అతడితో బార్య తీవ్ర వాగ్వాదానికి దిగింది. ఇద్దరి మధ్య వాగ్వాదం కాస్త చిలికి చిలికి పెద్ద గొడవగా మారింది. క్షణికావేశంలో అతడు బెడ్రూంలోకి వెళ్లి పళ్లను కోసే కత్తితో భార్యపై దాడికి దిగాడు. ఈ ప్రయత్నంలోనే అతడు అదుపు తప్పి కింద పడిపోయాడు. ఆ కత్తిని అందుకున్న భార్య అతడిపై దాడి చేసింది. దాడిలో భర్త అక్కడిక్కడే మృతిచెందాడు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.  తమిళనాడులోని కాంచీపురం మల్లిగశెట్టి వీధికి చెందిన నౌషద్‌ (37), అతడి భార్య రేవతి అలియాస్ రషియా( 30) జీవిస్తున్నాడు.

  ఆటో డ్రైవర్ గా తన కుటుంబాన్ని పోశిస్తున్నాడు. వాళ్లకు ఇద్దరు సంతానం. అందులో భైరవ కుమార్తె, పైసల్‌ అనే కుమారుడు ఉన్నారు. మద్యానికి బానిస అయిన నైషద్ తరచూ రషియాను ఇబ్బందులు పెట్టేవాడు. ఓ రోజు అర్థరాత్రి మద్యం మత్తులో ఉన్న అతడు ఇంటికి వచ్చాడు. ఎందుకు తాగి వచ్చావ్ అంటూ భార్య నిలదీసింది. దీంతో ఇద్దరి మధ్య గొడవ పెద్దగా అయింది.

  ఆగ్రహం చెందిన నౌషద్‌ బెడ్ రూంకి వెళ్లి కత్తితో భార్యపై దాడి చేసేందుకు ప్రయత్నించి అదుపుతప్పి కిందపడ్డాడు. వెంటనే రషియా అదే కత్తి తీసుకుని అతనిపై దాడి చేసింది. దాడిలో నౌషద్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. శివకంచి పోలీసులు రషియాను అరెస్ట్‌ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో వీధిలో విషాద ఛాయలు నెలకొన్నాయి
  Published by:Veera Babu
  First published: