కేరళలోని మలప్పురంలో జరిగిందీ ఘటన. తన ఇంట్లో కరెంటు పోవడంతో.. పక్కింటి వారికి కూడా పోయిందా లేదా అనేది తెలుసుకోవాలని ఓ వ్యక్తి.. పక్కింటికి వెళ్లాడు. తలుపు మూసి ఉంది. లోపల గడియ వేసినట్లు ఉండటంతో.. పక్కనే తెరచి వున్న కిటికీ నుంచి చూశాడు. లోపల ఓ మహిళ ఉరివేసుకొని.. విగత జీవిలా కనిపించింది. వెంటనే పోలీసులకు కాల్ చేశాడు. పోలీసులు వచ్చి.. శవాన్ని కిందకు దింపి.. పోస్ట్‌మార్టం కోసం పంపారు. ఈ క్రమంలో ఓ విషయం అర్థమైంది. ఆమె పేరు సౌజత్. నాలుగేళ్ల కిందట.. ప్రియుడు బషీర్‌తో కలిసి.. అర్థరాత్రి భర్త సావద్ను రాడ్డుతో తల పగలగొట్టి చంపింది.
ఆ కేసు అలా ఉంటే.. తాజాగా ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుంది అనేది మరో కోణం. దీనిపై దర్యాప్తు చెయ్యగా.. పోలీసులకు మరో షాకింగ్ విషయం తెలిసింది. ఆమె ప్రియుడు బషీర్.. కోజికోడ్ లోని మెడికల్ కాలేజీ హాస్పిటల్లో ఉన్నాడు. అతను విషం తాగాడనీ.. పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. అతనితో మాట్లాడే పరిస్థితి లేదు.
పక్కింటాయన ఇచ్చిన క్లూలను బట్టి.. పోలీసులు ఓ అంచనాకి వచ్చారు. భర్తను చంపిన సౌజత్.. ఆ తర్వాత బషీర్‌తో సంబంధం కొనసాగిస్తోంది. ఐతే.. కొన్నాళ్లుగా వారి మధ్య మనస్పర్థలు వచ్చాయి. తరచూ దీనిపై వారు గొడవపడుతూ ఉన్నారు. ప్రియుడి మోజులో పడి.. చేజేతులా భర్తను చంపుకున్నానని.. తప్పు తెలుసుకున్న సౌజత్.. తట్టుకోలేక.. ఆత్మహత్య చేసుకుందనీ.. ఈ విషయం తెలుసుకున్న ప్రియుడు కూడా.. చనిపోవాలని ప్రయత్నించి విషం తాగి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. నిజంగా ఇదే జరిగిందా అనేది తేలాలంటే.. బషీర్‌ని పోలీసులు ఇంటరాగేట్ చెయ్యాలి. అతని పరిస్థితి మెరుగైతే.. ప్రశ్నించాలని పోలీసులు ఎదురు చూస్తున్నారు. ఇలా ఈ కేసు స్థానికంగా చర్చకు దారితీసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime, Crime news, National News