Home /News /crime /

THE WIFE STAYS AWAY FROM HER HUSBAND EVEN AFTER 11 YEARS OF MARRIAGE AS THE AUSPICIOUS MOMENT IS NOT RIGHT GH VB

Wife And Husband: ముహూర్తం సరిగా లేదని.. 11 ఏళ్లుగా భర్తకు దూరంగా ఉన్న భార్య.. ఆమె తల్లి ఇంట్లోనే ఉంటూ..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

భర్తతో కాపురానికి వెళ్లేందుకు మూహూర్తం సరిగా లేదని సాకు చూపింది ఛత్తీస్​గఢ్​కు చెందిన ఒక మహిళ. అలా ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా పెళ్లయిన తర్వాత 11ఏళ్ల పాటు తల్లిగారింట్లోనే ఉండిపోయింది.

అత్తగారింటికి వెళ్లేందుకు శుభ ముహూర్తం కోసం ఎదురుచూస్తూ.. 11 ఏళ్ల పాటు తల్లిగారింట్లోనే ఉండిపోయిందో మహిళ(Women). దీనిని భరించలేని ఆమె భర్త కోర్టు(Court)ను ఆశ్రయించాడు. ఛత్తీస్​గఢ్​లో (Chhattisgarh) వెలుగుచూసిన ఈ ఘటనలో సదరు భర్త బాధితుడిగా (divorce cases in favour of husband) మిగిలాడని ఛత్తీస్​గఢ్​ హైకోర్టు (High Court) అభిప్రాయపడింది. వివరాల్లోకి వెళ్తే.. భర్తతో కాపురానికి వెళ్లేందుకు మూహూర్తం సరిగా లేదని సాకు చూపింది ఛత్తీస్​గఢ్​కు చెందిన ఒక మహిళ. అలా ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా పెళ్లయిన తర్వాత 11ఏళ్ల పాటు తల్లిగారింట్లోనే ఉండిపోయింది. అయితే భార్య ప్రవర్తనపై విసుగుచెందిన బాధిత భర్త విడాకుల కోసం హైకోర్టును (High Court) ఆశ్రయించగా.. కోర్టు సానుకూలంగా స్పందించింది.

Married Women: ముగ్గురు పిల్లల తల్లిపై అలా ఎలా చేయాలనిపించిందయ్యా నీకు.. చివరకు ఏమైందో చూడు..


11 సంవత్సరాలుగా తన భర్తకు దూరంగా ఉండటాన్ని అసాధారణ అంశంగా పేర్కొంది కోర్టు. ఇరు కుటుంబాల శ్రేయస్సు కోసమే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు జస్టిస్ గౌతమ్ భాదురి, జస్టిస్ రజనీ దూబేల ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ మేరకు హిందూ వివాహ చట్టం సెక్షన్ 13(1బీ) ప్రకారం వారి వివాహాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. భర్తను విడిచిపెట్టి దూరంగా ఉంటున్నందున విడాకులు కోరే హక్కు అతనికి ఉందని గత నెలలోనే తన తీర్పులో పేర్కొంది కోర్టు.

భర్తతో కేవలం 11 రోజులే..
తన భార్య తనకు దూరంగా ఉంటోందని.. అందువల్ల తనకు విడాకులు మంజూరు చేయాలని కోరుతూ ఛత్తీస్​గఢ్ జాంజ్‌గిర్‌కు చెందిన సంతోష్ సింగ్ అనే వ్యక్తి ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. అయితే దీనిని చిన్న కారణంగానే పరిగణించిన కోర్టు అతనికి విడాకులు ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో సంతోష్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2010 జులైలో వివాహం అనంతరం కేవలం 11 రోజులు మాత్రమే తనతో ఉంది. అనంతరం అత్తమామలు వచ్చి ఏదో ఫంక్షన్ ఉందనే సాకుతో తన భార్యను తీసుకెళ్లారు. తన భార్యను ఇంటికి తీసుకుచ్చుకునేందుకు రెండుసార్లు ప్రయత్నించినప్పటికీ అతనితో వెళ్లేందుకు శుభముహూర్తం లేదని వెళ్లేందుకు నిరాకరించింది భార్య.

Comedian Raghu Karumanchi: మద్యం అమ్ముతున్న కమెడియన్ రఘు.. కారణం ఏంటో తెలుసా..


ఆచారాలతో కాలక్షేపం!
ఈ కేసులో భార్య తరఫున న్యాయస్థానానికి హాజరైన న్యాయవాది.. భర్త ఇంటికి వెళ్లేందుకు తన క్లయింట్ సిద్ధంగా ఉందని, కానీ ముహూర్తం సరిగా లేదని వాదించారు. స్థానిక పద్ధతులు, ఆచారాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. తన క్లయింట్ అయిన మహిళ భర్తను విడిచిపెట్టలేదని విన్నవించారు. దీనిపై సంతోష్ సింగ్ తరఫు న్యాయవాది స్పందిస్తూ.. చట్టప్రకారం వివాహ హక్కులు సంక్రమించినప్పటికీ ఆమె తన భర్తతో సంసారానికి రాలేదని వాదించారు.
Published by:Veera Babu
First published:

Tags: Crime, Wife and husband

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు