హోమ్ /వార్తలు /క్రైమ్ /

BSF Jawan Wife: ఈమె భర్త ఒక జవాను.. కొన్ని రోజుల క్రితమే సెలవులపై ఇంటికొచ్చాడు.. ఇంతలోనే..

BSF Jawan Wife: ఈమె భర్త ఒక జవాను.. కొన్ని రోజుల క్రితమే సెలవులపై ఇంటికొచ్చాడు.. ఇంతలోనే..

మీరా దేవి (ఫైల్ ఫొటో)

మీరా దేవి (ఫైల్ ఫొటో)

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఉన్న శంషాబాద్ అనే ప్రాంతానికి చెందిన ఓ యువకుడు జవానుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆ యువకుడి భార్య అనుమానాస్పద స్థితిలో చనిపోవడం కలకలం రేపింది.

ఆగ్రా: ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఉన్న శంషాబాద్ అనే ప్రాంతానికి చెందిన ఓ యువకుడు జవానుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆ యువకుడి భార్య అనుమానాస్పద స్థితిలో చనిపోవడం కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గర్హి హరిశ్చంద గ్రామానికి చెందిన సత్యవీర్ అనే యువకుడు బీఎస్ఎఫ్ జవానుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇతనికి మీరా దేవి(28) అనే యువతితో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు ఎనిమిదేళ్ల వయసున్న కొడుకు, ఐదేళ్ల వయసున్న కూతురు ఉన్నారు. కొన్ని రోజుల క్రితం సత్యవీర్ సెలవుపై ఇంటికొచ్చాడు. ఏం జరిగిందో తెలియదు గానీ గత సోమవారం ఉదయం మీరా దేవి తన గదిలో అనుమానాస్పద స్థితిలో చనిపోయి కనిపించింది. ఈ ఘటన గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు స్పాట్‌కు చేరుకున్నారు. ఆమె మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

మీరా చనిపోయిన విషయం తెలిసి ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు స్పాట్‌కు చేరుకున్నారు. ఆమె భర్త సత్యదేవ్ చిత్రహింసలకు గురిచేసేవాడని, ఆ వేధింపులు తాళలేకే మీరా దేవి ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. మీరా మృతదేహంపై గాయాలున్నట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాదు.. ఆమె చనిపోయి పడి ఉన్న గదిలో.. ఆమె మృతదేహానికి దగ్గర్లో సత్యవీర్ వాడుతున్న బెల్ట్ ఉండటం అనుమానాలకు తావిస్తోంది. ఆమెను సత్యవీర్ చంపాడన్న ఆరోపణలకు బలం చేకూర్చుతోంది. పోలీసులు సత్యవీర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Wife: మా ఆయనను వెంటనే అరెస్ట్ చేయండంటూ కమిషనర్ ఆఫీస్‌కు భార్య.. కారణం ఏంటంటే...

భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్న విషయం వాస్తవమేనని ఇరుగుపొరుగు వాళ్లు చెప్పారు. సత్యవీర్ పలు సందర్భాల్లో ఆమెపై చేయి చేసుకోవడం కూడా చూశామని తెలిపారు. ఇదిలా ఉంటే.. మీరా దేవి మృతితో ఆమె కొడుకు, కూతురు చిన్న వయసులోనే తల్లిని కోల్పోయారు. ఆమె మృతదేహంపై పడి వాళ్లు రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది.

ఇది కూడా చదవండి: Married Woman: ఆమె ఎంత సంతోషంగా కనిపిస్తుందో కదా.. కానీ ఇలా జరుగుతుందని కలలో కూడా ఊహించలేకపోయింది..

పోలీసులు ఈ ఘటన గురించి మాట్లాడుతూ.. సత్యవీర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని, మీరా దేవి పోస్ట్‌మార్టం నివేదిక వస్తే నిజానిజాలు నిగ్గు తేలే అవకాశం ఉందని చెప్పారు. మీరా కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఒక జవాను అయి ఉండి భార్యతో సక్రమంగా నడుచుకోకుండా ఆమె చావుకు కారణమైన సత్యవీర్‌ను కఠినంగా శిక్షించాలని మీరా దేవి కుటుంబ సభ్యులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు. పెళ్లయిన కొన్నేళ్లు సత్యవీర్ భార్యతో అన్యోన్యంగానే ఉన్నాడని, రానురానూ అతని ప్రవర్తన మారిపోయిందని.. భార్యను వేధింపులకు గురిచేశాడని ఆరోపించారు. కొన్నిసార్లు భార్యాభర్తల మధ్య సర్దుబాటు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పారు. ఏదేమైనా.. క్షణికావేశంలో విచక్షణ మరిచి తీసుకునే నిర్ణయాలు విషాదాంతాలకు దారితీస్తాయని ఈ ఘటన మరోసారి రుజువు చేసింది.

First published:

Tags: Crime news, Husband, Wife, Wife murdered

ఉత్తమ కథలు