Newly Married Women: ఎంత పని చేశావ్ తల్లి.. ఆ ఒక్క రాత్రి ఆగాల్సింది.. ఇలా జరిగి ఉండకపోవచ్చేమో..

మౌనిక (ఫైల్)

Newly Married Women: క్షణికావేశంలో ఒక మహిళ ఆత్మహత్య చేసుకోవడంతో పండుగ పూట రెండు కుటుంబాల్లో ఊహించని విషాదం నెలకుంది. పండగకు భర్త ఇంటికి రాననడంతో బాధపడిన ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మూడు రోజు క్రితం జరిగినా.. తాజాగా వెలుగులోకి వచ్చింది.  పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

 • Share this:
  ఇటీవల చాలామంది చిన్న చిన్న కారణాలకు ఉరేసుకోవడం, పురుగుల మందు తాగి ఆత్మహత్యలకు(Suicide) పాల్పడటం చూస్తున్నాం. నిండు జీవితాలను ఆవేశంతో, ఆలోచనారాహిత్యంతో బుగ్గిపాలు చేసుకుంటున్నారు. నమ్ముకున్న కన్న తల్లిదండ్రులను(Parents).. వాళ్లపై ఆధారపడిన కుటుంబసభ్యులను(Family) ఇబ్బందులకు గురిచేస్తున్నారు. తాజాగా ఈ కోవకు చెందిన ఘటన చోటు చేసుకుంది. దసరా పండుగ రోజున తన భర్త అత్తింటికి రాలేదనే మనస్తాపంతో భార్య పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. నల్గొండ జిల్లాలోని ఆమనగల్లు మేడిగడ్డలో ఈ విషాదం చోటుచేసుకుంది. మేడిగడ్డకి చెందిన వడ్త్యావత్‌ మౌనిక (20)కు అదే గ్రామానికి చెందిన మేనమామ కుమారుడు అనిల్‌తో ఆరు నెలల కిందట పెళ్లి జరిగింది.

  Unexpected Incident: ఎంత పని చేశావ్ బ్రదర్.. అంత చిన్న కారణానికి ఇంత పెద్ద శిక్షా.. చివరకు ఏమైందో చూడు..


  అనిల్‌ డీసీఎం డ్రైవర్‌‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వృత్తి నిమిత్తం వివిధ ప్రాంతాలకు వెళ్తుంటాడు. తాజాగా కిరాయి రావడంతో వేరే ఊరు వెళ్లాడు. అయితే పండుగకు ఇంటికి వెళ్దాం రా అంటూ తన భార్య బలవంతం చేసింది. దీంతో అతడికి కిరాయి ఉందని నువ్వు వెళ్లు.. తర్వాత నేను వస్తానని భార్యను పంపిచేస్తాడు. ఆ రోజు అతడు కిరాయి ఉందని వెళ్లాడు. తర్వాత రోజు భార్య ఎన్ని సార్లు ఫోన్ చేసినా.. ఊరికి మాత్రం రాలేదు. ఇక్కడ పని ఉంది రాలేను.. ఈ పని పూర్తివగానే రేపు వస్తాను లే అని చెప్పినా భార్య వినలేదు. భర్తకు ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయింది.

  Explained: ప్రేమ పెళ్లి కంటే.. పెద్దలు కుదిర్చిన పెళ్లి ఎక్కువ కాలం నిలబడటానికి కారణం ఏంటి.. దీని వెనుక రహస్యం ఇదే..


  దీంతో ఆమె అదే రోజు పొలానికి అని ఇంట్లో చెప్పి వెళ్లింది. తనతో పాటు పురుగు మందు డబ్బా తీసుకెళ్లి అక్కడే తాగి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు వెంటనే కల్వకుర్తి గవర్నమెంట్‌ హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. పరీక్షించిన డాక్టర్లు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. పండుగ పూట జరిగిన విషాదంతో ఇరు కుటుంబాలు తీవ్ర శోక సంద్రంలో మునిగిపోయాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈటనతో ఆ గ్రామంతో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.

  అతడికి వివాహం జరిగి నాలుగు నెలలు.. ఆ ఒక్క మాట పేపర్ పై రాసి భార్య బ్యాగులో వేశాడు.. చివరకు ఏం జరిగిందంటే..


  క్షణికావేశంలో ఇటువంటి నిర్ణయాలు తీసుకోరాదని.. అటువంటి సమయంలో ఇంటి సభ్యులతో మాట్లాడుకోవాలని.. లేదంటూ స్నేహితులతో కలిసి మనస్సులో ఉన్న బాధను చెప్పుకోవాలని పోలీసులు తెలిపారు. అలా మనస్సులో ఉన్న బాధను బయటకు చెబితే భారం తగ్గినట్లు ఉండి.. మనస్సు ప్రశాంతంగా ఉండటంతో పాటు పాజిటివ్ గా ఆలోచించడం మొదలు పెడతారని పోలీసులు తెలిపారు.
  Published by:Veera Babu
  First published: