Home /News /crime /

THE WIFE COMMITTED SUICIDE ALONG WITH HER 9 MONTH OLD BABY BECAUSE OF HUSBAND FAMILY DOMESTIC VIOLENCE IN MAHBUBNAGAR PRV MBNR

Mahbubnagar: “ నా కూలీ డబ్బులతోనే నా అంత్యక్రియలు నిర్వహించండి’’: లేఖ రాసి బిడ్డతో సహా తనువు చాలించిన ఇల్లాలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

పెళ్లయి ముచ్చటగా మూడేళ్లు కూడా కాలేదు. రెండు పదుల వయసులోనే ఓ ఇల్లాలు తనువు చాలించింది. పొద్దున్న కూలీకి వెళ్లి ఇంటికొచ్చే ఇల్లాలికి.. కట్టుకున్నోడి మాటలు.. అత్తింటి చివాట్లు.

    పెళ్లయి ముచ్చటగా మూడేళ్లు కూడా కాలేదు. రెండు పదుల వయసులోనే ఓ ఇల్లాలు తనువు చాలించింది. పొద్దున్న కూలీకి వెళ్లి ఇంటికొచ్చే ఇల్లాలికి.. కట్టుకున్నోడి మాటలు.. అత్తింటి చివాట్లు.. చిన్నతనంలోనే అలాంటి వేధింపులు (Domestic violence) తట్టుకోలేక.. తన ముక్కుపచ్చలారని తొమ్మిది నెలల కూతురితో ఆత్మహత్య చేసుకుంది. ఈ హృదయ విదారకర ఘటన గురువారం మహబూబ్‌నగర్‌ (Mahbubnagar) జిల్లా మిడ్జిల్‌లో జరిగింది. ఈ సంఘటనపై స్థానిక ఎస్‌ఐ జయప్రసాద్‌ కథనం ప్రకారం.. నాగర్‌కర్నూల్‌ (Nagar Kurnool) జిల్లా తిమ్మాజిపేట మండలం గుమ్మకొండకు చెందిన ఎల్లమ్మ, సంగయ్యల కుమార్తె సరిత (21)ను రెండేళ్ల క్రితం మిడ్జిల్‌కు చెందిన తన మేనత్త ఎత్తరి రాములమ్మ కుమారుడు శ్రీశైలం (Srisailam)కు ఇచ్చి వివాహం చేశారు. వీరికి 9 నెలల కూతురు ఉంది.

    బంగారం పట్టుకురావాలని..

    పెళ్లి (marriage) జరిగినప్పటి నుంచే ఇంట్లో కలహాలు మొదలయ్యాయి. పెళ్లి సమయంలో ఇస్తామన్న బంగారం తెమ్మంటూ..  భూమి తన పేరున రాయించుకొని పట్టుకురావాలని అత్తారింట్లో రోజు వేధించసాగారు (Domestic violence) . రోజు కూలి పనులకు (daily wages) వెళ్లి తెచ్చిన డబ్బుల్లో సగమే తనకు ఇస్తోందని  సరితను ఆడిపోసుకునేవారు. దీంతో పలుమార్లు పంచాయతీ నిర్వహించి సర్ది చెప్పినా కలహాలు తగ్గకపోవడంతో మనస్తాపానికి గురైన సరిత మంగళవారం చంటిపాప (girl child)తో కలిసి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. సాయం త్రం భర్త శ్రీశైలం ఇంటికి రాగా.. భార్య, కూతురు కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు, బంధువుల ఇంట్లో వెతికాడు. అయినా ఆచూకీ లభించకపోవడంతో బుధవారం మిడ్జిల్‌ పోలీసుస్టేషన్‌ (police station)లో ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు.

    బిడ్డను చీర కొంగుకు కట్టుకుని..

    గురువారం ఉదయం మిడ్జిల్‌ చెరువులో మృతదేహం (dead body) కనిపించడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడికి వచ్చి మృతదేహాన్ని బయటకు తీశారు. బిడ్డను చీర కొంగుకు కట్టుకుని శవమై తేలిన సరిత (Sarita), పసిపిల్ల మృతదేహాలను చూసి గ్రామస్తులు, కుటుంబ సభ్యులు బోరున విలపించారు. కుటుంబ కలహాలు తల్లితో పాటు అభం శుభం తెలియని చిన్నారి ప్రాణాన్ని బలి తీసుకుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.

    ‘బావా.. నేను చనిపోయిన తర్వాత నువ్వు.. మీ అమ్మ సంతోషంగా ఉండండి.. మరో పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండు.. నేను కూలి చేసి సంపాదించిన పైసలతోనే నా అంత్యక్రియలు (last rites) నిర్వహించు’అని సరిత రాసిన సూసైడ్‌ నోట్‌ (Suicide) ఇంట్లో బయటపడింది. సరిత తండ్రి సంగయ్య ఫిర్యాదు మేరకు కేసు పోలీసులు కేసు నమోదు చేశారు. ఉప తహసీల్దార్ గీత సమక్షంలో శవ పంచనామా నిర్వహించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు . భర్త శ్రీశైలం అత్త రాములమ్మ పై గృహహింస (Domestic violence) కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Attemp to suicide, Crime news, Domestic Violence, Mahbubnagar

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు