హోమ్ /వార్తలు /క్రైమ్ /

Shocking Incident: తెల్లవారితే కుమార్తె పెళ్లి.. అంతలోనే  విషాదం.. ఆగిన కల్యాణం.. ఏం జరిగింది?

Shocking Incident: తెల్లవారితే కుమార్తె పెళ్లి.. అంతలోనే  విషాదం.. ఆగిన కల్యాణం.. ఏం జరిగింది?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆ ఇంట్లో తెల్లవారితే పెళ్లి జరగాలి. ఓ వైపు బాజా భజంత్రీలు మోగుతూనే ఉన్నాయి. కానీ, ఇంట్లో ఒక్కసారిగా విషాదం నెలకొంది. కూతురు పెళ్లి వుండటంతో అన్నీ తానై ఏర్పాట్లు చూసుకుంటున్న తండ్రి గురించి విషాద వార్త వినాల్సి వచ్చింది.

తెల్లవారితే పెళ్లి (Marriage).. కుటుంబ సభ్యులు, బంధువుల అంతా పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యారు. ఆ ఇంట్లో అంతా సందడి వాతావరణం ఉంది. మరికొన్ని గంటల్లో వధువు మెడలో వరుడు మూడు ముళ్లు వేయాల్సి ఉంది. కొత్త జీవితంలోకి అడుగుపెట్టే క్షణాల కోసం వధువు ఎంతగానో ఎదురుచూస్తోంది. కానీ అంతలోనే ఊహించని పరిణామం చోటుచేసుకుంది. కూతురు పెళ్లి (daughter marriage) వుండటంతో అన్నీ తానై ఏర్పాట్లు చూసుకుంటున్న తండ్రి గురించి విషాద వార్త వినాల్సి వచ్చింది. అప్పటివరకు అన్నిపనులు తానై చూసుకున్న ఆ తండ్రి రోడ్డు ప్రమాదానికి (Road accident) గురయి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన జగిత్యాల (Jagityal)  జిల్లాలో చోటుచేసుకుంది. జగిత్యాల (Jagityal) జిల్లా గొల్లపల్లి మండలం తిరుమలాపూర్ గ్రామానికి చెందిన బైన నర్సయ్య కూతురు పెళ్లి గురువారం  జరగాల్సి వుంది. ఘనంగా కూతురు పెళ్లి జరపాలని భావించిన నర్సయ్య పెళ్లి  (Marriage) బాధ్యతలన్నీ మీదేసుకుని ఏర్పాట్లన్ని తానే దగ్గరుండి చూసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే పెళ్లి భోజనాల కోసం ముందుగానే కూరగాయలు తెచ్చిపెట్టుకుందామని భావించిన తండ్రి నర్సయ్య బైక్ పై మార్కెట్ కు వెళ్లాడు.

రెండు కార్లు ఢీకొనడంతో..

పెళ్లి కోసం కూరగాయలు తీసుకుని వస్తుండగా ఈ  ప్రమాదం (Road Accident) జరిగింది. నర్సయ్య బైక్ మెళ్లిగా వస్తుండగా జాబితాపూర్ పెట్రోల్ పంప్ వద్ద రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ క్రమంలోనే ఓ కారు వేగంగా వచ్చి నర్సయ్య ప్రయాణిస్తున్న బైక్ ను ఢీకొట్టింది. దీంతో నర్సయ్య తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతుడు నర్సయ్యగా గుర్తించి బంధువులకు సమాచారం అందించారు. దీంతో తెల్లవారితే పెళ్లి అని ఆనందోత్సాహాలతో కళకళలాడుతున్న ఇంట ఒక్కసారిగా విషాదం నెలకొంది.

మరోవైపు కూతురు పెళ్లి ఏర్పాట్లు చేస్తూ ఇలా తండ్రి మృతిచెందడంతో (Father died) గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తన పెళ్లి ఏర్పాట్లు చేస్తూ తండ్రి మృతిచెందడంతో ఆ కూతురు కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. పెళ్లి చేసుకుని ఆనందంగా కొత్తజీవితం ప్రారంభించాల్సిన అమ్మాయి ఇలా తండ్రి కోసం కంటతడి పెట్టడం అందరినీ కలచివేస్తోంది. రోడ్డు ప్రమాదం కారణంగా పెళ్లి భాజా మోగాల్సిన ఇంట చావుభాజా మోగించాల్సి వచ్చింది.

 రంగారెడ్డిలో ఇలాగే..

గతంలో రంగారెడ్డి జిల్లాలో తెల్లారితే పెళ్లి అనగా ఆ కల్యాణం ఆగిపోయింది. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం మెదక్‌పల్లికి చెందిన పట్టెబర్ల యాదమ్మ, లింగయ్యల చిన్న కుమారుడు శ్రీకాంత్‌గౌడ్‌(25)కు కందుకూర్‌ మండలంలోని ఓ గ్రామానికి చెందిన అమ్మాయితో వివాహం చేయడానికి ముహూర్తం కుదిరింది.

పెళ్లి జరగనుందన్న నేపథ్యంలో కొత్తగా ఇంటిని కూడా నిర్మించుకున్నారు. కొత్తగా నిర్మించిన ఇంటి వద్ద కుటుంబసభ్యులు, బంధువులు గురువారం తెల్లవారుజామున పందిరి వేసే పనుల్లో ఉన్నారు. తెల్లారితే పెళ్లి అంటే ఉదయం పెళ్లి పీటలపై కూర్చనే వరుడు విశ్రాంతి తీసుకోవాలని అతడికి ప్రత్యేకంగా పాత ఇంటి వద్ద పడుకొమ్మని కుటుంబసభ్యులు చెప్పారు. పాత నివాసంలో నిద్రిస్తున్న శ్రీకాంత్‌గౌడ్‌ దగ్గరికి అతని అన్న రాజు వెళ్లి నిద్రలేపి ద్విచక్రవాహనం తీసుకొని పెళ్లి పందిరి వేసేందుకు పందిరి కొమ్మలు తీసుకురావడానికి వెళ్తున్నామని చెప్పాడు. రాజు తిరిగి వచ్చే సరికి ఇంట్లో శ్రీకాంత్‌ ఉరేసుకుని ఉండటంతో తల్లిదండ్రులతో పాటు బంధువులు దిగ్భ్రాంతికి గురయ్యారు.

First published:

Tags: Father died, Jagityal, Marriage, Road accident

ఉత్తమ కథలు