Home /News /crime /

THE WATER WAS HEATING UP FOR A BATH WHEN THE WOMAN CAME IN THE GRIP OF THE CURRENT SSR

Married Woman: భర్త, ఒక పాప.. హ్యాపీ లైఫ్.. ఉదయాన్నే స్నానం చేసేందుకు బాత్రూమ్‌కు వెళ్లింది.. కానీ..

ప్రియాంక (ఫైల్ ఫొటో)

ప్రియాంక (ఫైల్ ఫొటో)

ఆ వివాహిత వయసు 25 సంవత్సరాలు. ఆమెకు పెళ్లైంది. ఐదేళ్ల కూతురు ఉంది. బాగా చూసుకునే భర్త. అత్తారింట్లో కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ.. అంత సంతోషంగా ఉన్న ఆమెను మృత్యువు ఊహించని విధంగా కబళించింది.

  జట్టారి: ఆ వివాహిత వయసు 25 సంవత్సరాలు. ఆమెకు పెళ్లైంది. ఐదేళ్ల కూతురు ఉంది. బాగా చూసుకునే భర్త. అత్తారింట్లో కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ.. అంత సంతోషంగా ఉన్న ఆమెను మృత్యువు ఊహించని విధంగా కబళించింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌‌లోని జట్టారి పట్టణానికి సమీప గ్రామంలో నివాసం ఉండే యాదవేంద్ర సింగ్ అలియాస్ యాదూకు, ప్రియాంకకు (25) కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఐదేళ్ల పాప కూడా ఉంది. ఎంతో సంతోషంగా సాగిపోతున్న వీరి జీవితంలో ఒక్క ఘటన పెను విషాదాన్ని నింపింది. ఐదేళ్ల కూతురికి తల్లిని దూరం చేసింది. బాత్రూమ్‌లో స్నానం చేసేందుకు ప్రియాంక రోజూలానే జనవరి 3 ఉదయం కూడా వెళ్లింది.  ప్రియాంకకు వేడి నీళ్లతో స్నానం చేసే అలవాటు ఉంది. రోజూ బాత్రూమ్‌లో బకెట్‌లో నీళ్లు పట్టి హీటర్‌తో నీళ్లు కాచుకుని స్నానం చేసేది. నిన్న ఉదయం కూడా హీటర్‌ పెట్టుకుని బాత్రూమ్‌లో నీళ్లు కాగబెట్టుకుంది. బట్టలు తీసుకుని స్నానం చేసేందుకు బాత్రూమ్‌కు వెళ్లింది. నీళ్లు కాగడంతో హీటర్ తీసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఆమెకు కరెంట్ షాక్ కొట్టింది. దీంతో.. ఆమె విలవిలలాడుతూ కుప్పకూలిపోయింది. స్నానానికి వెళ్లిన అమ్మ ఇంకా రాలేదేంటని ఐదేళ్ల కూతురు లవిత ‘అమ్మా.. అమ్మా’ అంటూ బాత్రూమ్ బయట నిల్చుని పిలిచింది. ఎంత పిలిచినా ఆమె నుంచి స్పందన లేకపోవడంతో ‘నానమ్మా.. అమ్మ ఎంత పిలిచినా పలకడం లేదు’ అని ఆ పాప నానమ్మకు చెప్పింది.

  ఇది కూడా చదవండి: OMG: కొడుకు వయసుండే కుర్రాడితో ఈ మహిళ వివాహేతర సంబంధం.. చివరకు ఊహించని రీతిలో..

  ఆమె బాత్రూమ్ తలుపు కొట్టి కోడలిని పిలిచింది. ఎంత పిలిచినా స్పందన లేదు. దీంతో.. భయంతో ఆ వృద్ధురాలు పెద్దగా కేకలేసింది. ఏమైందా.. అని ఇంట్లో వాళ్లంతా వచ్చి చూశారు. ఎన్నిసార్లు పిలిచినా ప్రియాంక పలకడం లేదంటూ ఆమె చెప్పగానే బాత్రూమ్ తలుపు బద్ధలు కొట్టి చూడగా ప్రియాంక కిందపడి కనిపించింది. కరెంట్ షాక్ కారణంగా ఇలా జరిగిందని వారికి అర్థమైంది. వెంటనే ఇంటికి కరెంట్ రాకుండా చేసి ప్రియాంకను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆమెలో ఎలాంటి కదలిక కనిపించలేదు.

  ఇది కూడా చదవండి: Chennai: బ్యాంకులో ఉద్యోగం.. నెలకు 2 లక్షలకు పైగానే జీతం.. కానీ ఏం లాభం.. డిసెంబర్ 31న..

  దీంతో.. కుటుంబ సభ్యులు కంగారుపడ్డారు. సమీపంలోని.. కైలాష్ హాస్పిటల్‌కు ఆమెను తరలించారు. అయితే.. ఆమె చనిపోయిందని వైద్యులు చెప్పారు. ఆమె చనిపోయిందని భావించి ఇంటికి తీసుకొచ్చారు. ఐదారు గంటల తర్వాత ప్రియాంక శరీరంలో కదలిక కనిపించింది. దీంతో.. ఆమె బతికే ఉందని.. మెరుగైన చికిత్స కోసం ఢిల్లీకి తరలించారు. అయితే.. ఢిల్లీలోని ఓ హాస్పిటల్‌లో ఆమెను పరీక్షించిన డాక్టర్లు ఆమె ప్రాణాలతో లేదని నిర్ధారించారు.

  ఇది కూడా చదవండి: Love Marriage: ప్రేమించి పెళ్లి చేసుకున్న మరుసటి రోజే లారీ డ్రైవర్‌కు ఊహించని అనుభవం..

  తొలుత ఆమె ప్రాణాలతో లేదని చెప్పి వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, సకాలంలో వైద్యం అంది ఉంటే ఆమె బతికే అవకాశం ఉండేదని ఢిల్లీలో వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఐదేళ్ల కూతురు విగత జీవిగా పడి ఉన్న తల్లిని చూసి భోరున విలపిస్తుంటే ఆ పాపను ఓదార్చడం అక్కడున్న వారి తరం కాలేదు. ‘అమ్మా.. లే అమ్మా’ అంటూ ఆ పాప ఏడుస్తుంటే అక్కడున్న వారికి కళ్లు చెమ్మగిల్లాయి. అందరితో ఎంతో కలుపుగోలుతనంతో ఉండే ప్రియాంక చనిపోయిందన్న చేదు నిజాన్ని ఆమె కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
  Published by:Sambasiva Reddy
  First published:

  Tags: Crime news, Married women, Uttar pradesh

  తదుపరి వార్తలు