హోమ్ /వార్తలు /క్రైమ్ /

The Village Sarpanch: దారుణం.. గ్రామ సర్పంచ్ సజీవ సమాధి.. తన మనవడు కూడా.. ఏం జరిగిందంటే..

The Village Sarpanch: దారుణం.. గ్రామ సర్పంచ్ సజీవ సమాధి.. తన మనవడు కూడా.. ఏం జరిగిందంటే..

సర్పంచ్ లచ్చమ్మ, యోగేశ్వర్(file)

సర్పంచ్ లచ్చమ్మ, యోగేశ్వర్(file)

Telangana: మట్టి మిద్దె కూలి పోయి గ్రామ సర్పంచ్ ఆమె మనవడు సజీవ సమాధి ఆయన ఘటన వనపర్తి జిల్లా రేవల్లి మండలం ఏదుల రిజర్వాయర్ ముంపు గ్రామమైన బండ రావి పాకుల గ్రామంలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

(సయ్యద్ రఫీ, మహబూబ్ నగర్ జిల్లా, న్యూస్18 తెలుగు)

ఏదుల రిజర్వాయర్ ముంపు గ్రామమైన రవి పాకుల గ్రామంలో గ్రామ సర్పంచ్ లచ్చమ్మ (65) ఆమె కుటుంబ సభ్యులతో నివాసముంటుంది. ఇటీవల మట్టి మిద్దె పై చౌడు వేశారు. పైగా కప్పును మోసే దూలాలూ, వాట్లు దెబ్బతిన్నాయి. మంగళవారం రాత్రి కుటుంబ సభ్యులు వేర్వేరు గదుల్లో నిద్రిస్తుండగా సర్పంచ్ తన మనవడు యోగేశ్వర్(12) తో కలిసి మరో గదిలో నిద్రించారు. పై కప్పు ఒక్కసారిగా కూలీ కింద పడడంతో వారు అక్కడికక్కడే సజీవ సమాధి అయ్యారు. బుధవారం ఉదయం మిగతా కుటుంబ సభ్యులు లేచి తలుపులు తెరిచే ప్రయత్నం చేశారు. ఇల్లు కూలింది విషయం గుర్తించి తలుపులు బద్దలు కొట్టి చూసే వరకు ఇద్దరూ మట్టిలో కలిసిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు దుఃఖసాగరం లో మునిగిపోయారు. సంఘటనకు సంబంధించిన విషయం తెలిసిన వెంటనే గ్రామస్తులు పెద్ద ఎత్తున ఇంటికి చేరుకున్నారు. అక్కడ సహాయక చర్యలు చేపట్టి మృతదేహాలను బయటికి తీశారు. బండ రాయిపాకుల ఏదుల రిజర్వాయర్ ముంపు గ్రామం కావడంతో చాలా రోజులుగా పునరావాసం కోసం వేచిచూస్తున్న గ్రామస్తులు, ప్రభుత్వం పునరావాసం కల్పించకపోవడంతో అదే ఇళ్లలో ఉంటున్నారు.

రాత్రి ఇలా జరగడంతో గ్రామం మొత్తం విషాదఛాయలు అలముకున్నాయి.ఈ ఘటనపై వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సంఘటన జరగడానికి గల కారణాలను మంత్రి ఆరా తీశారు.

Read Also: తెలంగాణ అమ్మాయి.. ఆంధ్రా అబ్బాయి.. అమెరికాలో ఇరువురు కలిసి..


ఒక్కసారిగా ఇద్దరు మరణించడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. కుటుంబసభ్యుల రోధనలు చూసేవారికి కన్నీళ్లను తెప్పించాయి. కుటుంబానికి మంత్రి సానుభూతిని తెలియజేయడంతో పాటు వారి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని మంత్రి హామీ ఇచ్చారు.

First published:

Tags: Accident, Crime, Mahabubnagar, Wanaparthi

ఉత్తమ కథలు