Viral Video: ఎందుకిలాంటి పనులు చేయడం.. తన్నులు తినడం.. ఇతనిని ఎందుకిలా కొడుతున్నారో తెలిస్తే..

యువకుడికి దేహశుద్ధి చేస్తున్న దృశ్యం

ఓ ప్రైవేట్ హోటల్‌లో పనిచేస్తున్న యువతి పెళ్లి చేసుకోవాలని భావించింది. ఆమె వివరాలను ఓ మ్యాట్రిమొనీ సైట్‌లో అప్‌లోడ్ చేసింది. ఆమె ప్రొఫైల్‌ను చూసి ఓ యువకుడు ఆమెను సంప్రదించాడు. ఇద్దరూ ఒకరి ఫోన్ నంబర్లు ఒకరు తెలుసుకున్నారు. ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది.

  • Share this:
    చెన్నై: ఓ ప్రైవేట్ హోటల్‌లో పనిచేస్తున్న యువతి పెళ్లి చేసుకోవాలని భావించింది. ఆమె వివరాలను ఓ మ్యాట్రిమొనీ సైట్‌లో అప్‌లోడ్ చేసింది. ఆమె ప్రొఫైల్‌ను చూసి ఓ యువకుడు ఆమెను సంప్రదించాడు. ఇద్దరూ ఒకరి ఫోన్ నంబర్లు ఒకరు తెలుసుకున్నారు. ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది. ఒకరినొకరు ఇష్టపడటంతో ఆ యువతి అతనిని తల్లిదండ్రులకు పరిచయం చేసింది. అంతా బాగానే ఉన్నా.. ఆ యువకుడు పచ్చి మోసగాడన్న సంగతి ఆ యువతికి మోసపోయిందాకా తెలియదలేదు. ఆమెను మోసం చేసిన ఆ యువకుడిని యువతి బంధువులు చితకబాదారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన చెన్నైలో జరిగింది.

    పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నైలోని ఎక్కదుతంగల్‌లోని ఓ హోటల్‌లో తిరుచ్చికి చెందిన ఓ యువతి పనిచేస్తోంది. ఆమె పెళ్లి చేసుకోవాలని భావించి తన ప్రొఫైల్‌ను ఓ ప్రముఖ మ్యాట్రిమొనీ సైట్‌లో పోస్ట్ చేసింది. ఆమె ప్రొఫైల్ చూసిన గోకుల కృష్ణన్ అనే ఓ యువకుడు ఆమెను సంప్రదించాడు. ఆమె ఫోన్ నంబర్ తెలుసుకున్నాడు. ఇద్దరూ ఒకరి నంబర్లు ఒకరు తెలుసుకుని ఫోన్‌లో గంటల కొద్దీ మాట్లాడుకుంటూ పరిచయం పెంచుకున్నారు. గోకుల్ కృష్ణన్‌ను సదరు యువతి పూర్తిగా నమ్మింది. ఆ నమ్మకంతోనే గోకుల్ అడిగిన ప్రతిసారి డబ్బులు ఇచ్చేది. ఏదో ఒక అబద్ధం చెబుతూ గోకుల్ ఆమె నుంచి డబ్బు తీసుకునేవాడు. అలా దాదాపు.. లక్షా పాతిక వేల రూపాయల వరకూ ఆమె వద్ద నుంచి తీసుకున్నాడు. ఇక.. అవసరం తీరిపోయిందనుకున్నాడో ఏమో గానీ పెళ్లి ప్రస్తావన తీసుకొస్తే దాటవేసే ప్రయత్నం చేసేవాడు. ఆమెకు దూరంగా ఉండేందుకు ఎవరితోనో నీకు అఫైర్ ఉందని ఆమెపై నిందలేశాడు. ఆ క్రమంలోనే.. గోకుల కృష్ణన్ తనను మోసం చేశాడని, కేవలం డబ్బు కోసమే తనతో చనువుగా ఉన్నాడని గ్రహించిన యువతి విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది. దీంతో.. యువతి బంధువులు, ఆమెతో కలిసి గోకుల్‌ను కలిశారు. ఈ క్రమంలో కృష్ణన్‌కు, ఆ యువతికి మధ్య వాగ్వాదం నడిచింది. ఆ క్రమంలో విచక్షణ మరిచి ప్రవర్తించిన కృష్ణన్ ఆ యువతిని తోసేసి డ్రస్‌ను చించేశాడు.

    ఇది కూడా చదవండి: Newly Married: ఎంతపని చేశావ్ బ్రదర్.. పెళ్లయిన 38 రోజులకే ఇలా చేయడం.. తొందరపడ్డావేమో..!

    ఈ పరిణామంతో ఆమె బంధువులు తీవ్రంగా స్పందించారు. ఓ మహిళ కృష్ణన్‌ను జుట్టు పట్టుకుని రెండు చెంపలు వాయించింది. ‘ఇలా అమ్మాయిలను పెళ్లి పేరుతో మోసం చేస్తావా’ అంటూ మహిళలు ఆ యువకుడికి దేహశుద్ధి చేశారు. ఈ ఘటనను వారిలో కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో.. ఈ వీడియో వైరల్‌గా మారింది. యువతిని మోసం చేసిన కృష్ణన్‌ను పోలీస్ స్టేషన్‌లో యువతి బంధువులు అప్పగించారు. యువతి బంధువుల దాడిలో అతను గాయపడటంతో రాయ్‌పేట్ ప్రభుత్వాసుపత్రికి తరలించి అతనికి చికిత్స చేయించారు. ఆ తర్వాత అదుపులోకి తీసుకున్నారు. అయితే.. ఈ ఘటనపై కృష్ణన్ కూడా ఫిర్యాదు చేశాడు. తనను ఆ యువతి మోసం చేసిందే కాకుండా తన స్నేహితులను తీసుకొచ్చి తనపై దాడి చేసిందని యువకుడు ఆరోపించాడు.
    Published by:Sambasiva Reddy
    First published: