ఎంత ఘోరం... ఆడబిడ్డకు జన్మనిచ్చిన 8వతరగతి విద్యార్థిని

ఎవరికైనా ఈ విషయం చెబితే చంపేస్తానంటూ పాపం ఆ అమ్మాయిని బెదిరించాడు. ఆ కామాంధుడి బెదిరింపులకు భయపడిపోయిన ఆ పసిప్రాణం తన బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియలేదు.

news18-telugu
Updated: February 12, 2020, 10:56 AM IST
ఎంత ఘోరం... ఆడబిడ్డకు జన్మనిచ్చిన 8వతరగతి విద్యార్థిని
బిడ్డకు జన్మనిచ్చిన 8వ తరగతి విద్యార్థిని
  • Share this:
ఓవైపు అత్యాచారాలకు పాల్పడుతున్న నిందితులకు కఠిన శిక్షలు విధిస్తున్నారు. కొందర్ని ఎన్‌కౌంటర్ చేస్తుంటే.. మరికొందర్ని ఉరితీస్తున్నారు. అయిన కూడా కామాంధులు కళ్లు మాత్రం తెరవడంత లేదు. కామంతో కళ్లు మూసుకుపోయి... అన్నెం పున్నెం ఎరుగని పసిమొగ్గలపై తమ ప్రతాపం చూపిస్తున్నారు. రాజస్థాన్ రాష్ట్రం బికనీర్‌ జిల్లాలో ఇలాంటి దారుణ ఘటనే చోటు చేసుకుంది. 8వ తరగతి చవుతున్న బాలికపై... వారితో పాటు... ఆ ప్రాంతాంలోనే నివసిస్తున్న శంకర్ నాయక్ అనే ఓ నీఛుడు పాడుకన్నుపడింది. రెండు సార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరికైనా ఈ విషయం చెబితే చంపేస్తానంటూ పాపం ఆ అమ్మాయిని బెదిరించాడు. ఆ కామాంధుడి బెదిరింపులకు భయపడిపోయిన ఆ పసిప్రాణం తన బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియలేదు.

తనతో ఏం జరుగుతుందన్న పూర్తి అవగాహన కూడా లేదు. దీంతో అలాంటి వయస్సులోనే ఆమె గర్భం దాల్చింది.  ఇది తెలిసిన కన్నవారు విషయం బయటకు తెలియనివ్వకుండా అమ్మాయిని రహస్యంగా ఉంచారు. 9 నెలల నిండగానే... ఆ ఆస్పత్రికి తీసుకెళ్లి డెలివరీ చేయించారు. పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. అయితే పుట్టిన బిడ్డను శిశు సంక్షేమ కేంద్రంలో వదిలి వెళ్లిపోతుండటంతో అనుమానం వచ్చిన కొందరు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులకు అసలు విషయం తెలిసింది దీంతో వెంటనే నిందితుడు శంకర్ నాయక్‌ను అరెస్ట్ చేశారు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

First published: February 12, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు