అతని వయసు 42 సంవత్సరాలు. పెళ్లయింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ.. ఈ ప్రబుద్ధుడి బుద్ధి గడ్డి తిని ఓ పని చేశాడు. దీంతో.. ఆ ఇల్లాలు తనకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన తమిళనాడులోని సేలం జిల్లాలో వెలుగుచూసింది. బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. సేలంలోని పొన్నమ్మపేట్ ప్రాంతానికి చెందిన మోహనప్రియ, రమేష్(42) భార్యాభర్తలు. ఈ దంపతులకు ఇద్దరు మగ పిల్లలు. రమేష్ ఓ ప్రైవేట్ జువెలరీ స్టోర్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. జీతం కూడా బాగానే వస్తుంది. భార్యాభర్తలిద్దరూ ఇద్దరు పిల్లలను చూసుకుంటూ సంతోషంగానే జీవిస్తున్నారు. కానీ.. ఇటీవల రమేష్ ఆలోచన మారింది.
స్టోర్‌లో పనిచేసే 22 ఏళ్ల యువతితో ఈ 42 ఏళ్ల అంకుల్‌కు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా ఇద్దరి మధ్య అఫైర్‌కు దారితీసింది. ఈ యువతితో వీకెండ్స్‌లో సినిమాలకు, షికార్లకు వెళుతుండేవాడు. మేనేజర్ కావడంతో అతనితో కలిసి ఉంటే జీవితం బాగుంటుందని భావించిన సదరు యువతి పెళ్లి ప్రతిపాదన తీసుకొచ్చింది. దీంతో.. భార్యా ఇద్దరు పిల్లలున్నారన్న సంగతి మరిచి ఈ ప్రబుద్ధుడు పెళ్లికి సిద్ధపడ్డాడు. అంతేకాదు.. గుట్టు చప్పుడు కాకుండా ఆ యువతిని పెళ్లి కూడా చేసుకున్నాడు. రమేష్, ఆ యువతి ఎక్కడికి వెళ్లిపోయారో కూడా ఎవరికీ తెలియదు.
చివరకు ఇద్దరూ పెళ్లి చేసుకున్నారన్న సంగతి తెలిసి రమేష్ భార్య మోహనప్రియకు గుండె పగిలినంత పనయింది. ఈ పరిణామంతో తీవ్ర మనస్తాపం చెందిన రమేష్ మొదటి భార్య అమ్మపెట్టై మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో.. ఆమె ఫిర్యాదుతో పోలీసులు ఈ కేసు విచారణ మొదలుపెట్టారు. సదరు యువతి ఇంటికి వెళ్లి ఆమె తల్లిదండ్రులను విచారించారు. తమ కూతురు ఆయనతో ప్రేమ వ్యవహారం సాగిస్తున్న సంగతి తమకు తెలియదని వారు చెప్పారు.
ఇది కూడా చదవండి: Newly Married: ఈ జంటకు పెళ్లి జరిగి ఆరు నెలలయింది.. ఇన్ని రోజుల తర్వాత ఏమైందంటే..
ఇదిలా ఉండగా.. కేసు వాపస్ తీసుకోకపోతే చంపేస్తానని తన భర్త బెదిరిస్తున్నాడని రమేష్ భార్య చెప్పింది. తాను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని, ఆమెతోనే కలిసి ఉంటానని రమేష్ తన భార్యకు తెగేసి చెప్పాడు. ఈ పరిణామంతో షాకయిన రమేష్ భార్య మోహనప్రియ తన ఇద్దరు పిల్లలతో కలిసి తనకు న్యాయం చేయాలని సేలం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేసింది. తన భర్త వల్ల తనకూ, తన పిల్లలకు ప్రాణ హాని ఉందని.. తన భర్తపై చర్యలు తీసుకోవాలని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.
జువెలరీ షాప్ యజమాని కూడా తన భర్తకు మద్దతు తెలుపుతున్నారని.. ఈ విషయంలో తనకు న్యాయం జరిగేలా చూడాలని బాధితురాలు కోరుతోంది. పోలీసులు రమేష్‌పై ఇప్పటివరకూ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. రమేష్, అతనితో పాటు వెళ్లిపోయిన యువతి కోసం గాలిస్తున్నామని, త్వరలోనే వారిని అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ ఇస్తామని పోలీసులు తెలిపారు. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. సదరు యువతితో గతంలో కూడా ఒకసారి రమేష్ ఇలానే వెళ్లిపోయాడని తెలిసింది. ఆ సమయంలో పోలీసులు జోక్యం చేసుకుని ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చి.. ఇంకెప్పుడూ ఇలా చేయవద్దని హెచ్చరించి పంపించేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Extra marital affair, Husband, Wife