Home /News /crime /

THE VICTIM HAS LODGED A COMPLAINT WITH THE MUNICIPAL COMMISSIONER OF POLICE SEEKING IMMEDIATE ARREST OF HER HUSBAND IN COIMBATORE SSR

Wife: మా ఆయనను వెంటనే అరెస్ట్ చేయండంటూ కమిషనర్ ఆఫీస్‌కు భార్య.. కారణం ఏంటంటే...

బాధితురాలు

బాధితురాలు

భర్తను వెంటనే అరెస్ట్ చేయాలని కమిషన్ ఆఫీస్‌లో భార్య ఫిర్యాదు చేసిన ఘటన తమిళనాడులోని కోయంబత్తూరులో వెలుగుచూసింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. కోయంబత్తూరుకు చెందిన హిసిల్ జేమ్స్ అనే మహిళ ఐదేళ్ల క్రితం ధర్మదురై అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది.

ఇంకా చదవండి ...
    కోయంబత్తూరు: భర్తను వెంటనే అరెస్ట్ చేయాలని కమిషన్ ఆఫీస్‌లో భార్య ఫిర్యాదు చేసిన ఘటన తమిళనాడులోని కోయంబత్తూరులో వెలుగుచూసింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. కోయంబత్తూరుకు చెందిన హిసిల్ జేమ్స్ అనే మహిళ ఐదేళ్ల క్రితం ధర్మదురై అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఈ జంటకు ఇద్దరు కుమార్తెలు. హిసిల్ ఓ ప్రైవేట్ స్కూల్‌లో టీచర్‌గా పని చేస్తుండేది. ధర్మదురై తండ్రి కోయంబత్తూరు పోలీస్ విభాగంలో స్పెషల్ అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నాడు. హిసిల్, ధర్మదురైకి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. భార్యను ధర్మదురై వేధింపులకు గురిచేసేవాడు. ఇద్దరికీ అభిప్రాయ భేదాలు తలెత్తడంతో భర్త వేధింపులు తాళలేక పుట్టింటికి వెళ్లిపోవాలని హిసిల్ నిర్ణయించుకుంది. అప్పటి నుంచి విడిపోయి ఉంటున్నారు. విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. హిసిల్ తన ఇద్దరు కూతుర్లను తీసుకుని పుట్టింట్లో ఉంటోంది.

    2019లో భర్త నుంచి విడాకులు, భరణం కోరుతూ హిసిల్ కోర్టులో దావా వేసింది. ఆ క్రమంలో భార్యపై కక్ష పెంచుకున్న ధర్మదురై ఆమెకు రోజూ ఫోన్ చేసి భరణం ఇచ్చేది లేదంటూ తెగేసి చెప్పాడు. ఏం చేసుకుంటావో చేసుకోవాలని భార్యను బెదిరించేవాడు. తన తండ్రి పోలీసు శాఖలో పనిచేస్తున్న విషయం గుర్తుపెట్టుకోవాలని, ఆయనతో చెప్పి గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నావని తప్పుడు కేసు బనాయించి అరెస్ట్ చేయిస్తానని బెదిరించేవాడు. అంతేకాదు.. ఆమెను మరింతగా వేధించడం మొదలుపెట్టాడు.

    ఇది కూడా చదవండి: Lover: ఇది ప్రేమా.. ఇతను ఒకమ్మాయిని లవ్ చేశాడు.. ఆమెకు మరొకరితో పెళ్లి అయిపోయిందని తెలిసి..

    ఆమె పనిచేసే స్కూల్‌కు వెళ్లి గొడవపడి అసభ్య పదజాలంతో దూషించాడు. తన భర్త స్నేహితులను వెంటేసుకుని తన పుట్టింటికి వచ్చి నా తండ్రి జేమ్స్‌పై, అన్నావదినలపై దాడి చేశాడని.. తన రెండో కూతురైన ఆరు నెలల పాపను చంపాలని ప్రయత్నించాడని హిసిల్ కమిషనర్ ఆఫీస్‌లో ఫిర్యాదు చేసింది. ఆ పసికందును కాపాడే క్రమంలో తన అన్న ధర్మదురైను ఓ గదిలో ఉంచి లాక్ చేశాడని.. తన తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా తన భర్తను అరెస్ట్ చేశారని ఆమె చెప్పింది.

    ఇది కూడా చదవండి: 15 Days Before the Wedding: 15 రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఏం పనిది.. ఇలాంటోళ్లను ఏమనాలి అసలు..

    బొతనూర్ పోలీస్ స్టేషన్‌లో తన భర్తపై కేసు నమోదు చేయగా.. బెయిల్‌పై బయటకు వచ్చాడని హిసిల్ ఫిర్యాదులో పేర్కొంది. తన భర్తను అతని తండ్రి తన పోలీస్ పరపతిని ఉపయోగించి కాపాడుకుంటూ వస్తున్నాడని.. ఆయనపై, ధర్మదురైపై చర్యలు తీసుకోవాలని, తన భర్తను వెంటనే అరెస్ట్ చేయాలని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఈ వ్యవహారం కమిషనర్ ఆఫీస్ వరకూ వెళ్లడంతో పోలీసులు సీరియస్‌గా దృష్టి సారించారు. కేసుపై విచారణ జరిపి తప్పుందని తేలితే తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. తన భర్త నుంచి విడాకులతో పాటు ఇద్దరు కూతుర్ల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని భరణాన్ని ఇప్పించాల్సిందిగా బాధితురాలు కోరుతోంది.
    Published by:Sambasiva Reddy
    First published:

    Tags: Coimbatore, Crime news, Husband, Wife

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు