Home /News /crime /

THE TWO GIRLS FELL IN LOVE WITH EACH OTHER AND GOT MARRIED IN HARYANA STATE VB

Two Girls were Married: పెళ్లి చేసుకున్న ‘ఇద్దరమ్మాయిలు’.. ఔను వాళ్లిద్దరు పారిపోయి మరీ ఒక్కటయ్యారు.. కారణం ఏంటంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Two Girls were Married: సాధారణంగా పెళ్లి ఎవరు చేసుకుంటారు? ఇంకెవరు.. ఆడ, మగ చేసుకుంటారు. కానీ అంతటా ఇలా జరగదు. కొన్ని చోట్ల ఆడవారు ఆడవారిని, మగవారు మగవారిని పెళ్లి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు. తాజాగా ఇలాంటి ఓ వింత వివాహం హర్యానాలో​ జరిగింది.

ఇంకా చదవండి ...
    పెళ్లి అంటే మ‌న‌కు తెలిసి.. ఓ అమ్మాయి.. ఓ అబ్బాయి ఉండాలి. అదే మ‌న‌కు తెలిసిన పెళ్లి. ఇద్ద‌రు అమ్మాయిలు.. ఇద్ద‌రు అబ్బాయిలు క‌ల‌సి జీవించే సంఘ‌ట‌న‌లు విదేశాల్లో స‌హ‌జ‌మే అయినా.. భార‌త్‌లో మాత్రం పరిస్థితి వేరు. ఇద్దరు అమ్మాయిలు కలిసి జీవనం సాగించడాన్ని మెజారిటీ ప్రజలు విచిత్రంగానే చూస్తారు. కానీ ఒకటి రెండు చోట్ల అమ్మాయిలు వివాహ బంధంతో ఏకమవుతున్నారు. కానీ ఇందుకు వారి కుటుంబ సభ్యులు మాత్రం అంగీకరించడంలేదు. తాజాగా ఇలాంటి ఓ వింత వివాహం హర్యానాలో​ చోటుచేసుకుంది. ఇద్దరు విద్యార్థినిల మనసులు కలవడంతో.. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇంట్లో వాళ్లు అంగీకరించకపోవడంతో వారు ఈ క్రమంలో ఇంట్లో నుంచి వెళ్లి పెళ్లి చేసుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.  గురుగ్రామ్‌కు చెందిన 20 ఏళ్ల బాలిక, జాజర్‌ జిల్లాకు చెందిన 19 ఏళ్ల బాలిక మంచి స్నేహితులు. వీరిద్దరు కూడా జాజర్‌ జిల్లాలోని ఒకే పాఠశాలలో చదువుకునేవారు. ఇద్దరూ ఒకరిని విడిచి మరొకరు ఉండేవాళ్లు కాదు. అలా 7 సంవత్సరాల స్నేహం కాస్త ప్రేమగా మారింది.

    ఎలాగైనా ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. దీంతో వీరి ప్రేమను వారి తల్లిదండ్రులకు చెప్పారు. ఇదెక్కడి ఘోరమని వారి నిర్ణయాన్ని తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది సమాజంలో ఆమోద​ యోగ్యం కాదు, ఇలాంటి పిచ్చి ఆలోచనలు మానుకోవాలని చెప్పారు. కానీ అప్పటికే పీకల్లోతు ప్రేమలో ఉన్న వారిద్దరికి వారి మాటలను వినిపించుకోలేదు. ఇంట్లో నుంచి పారిపోయి వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్లుగానే ఒకరోజు ఇద్దరూ తమ ఇంట్లో నుంచి పారిపోయి సోన్‌హాలోని ఒక ఆలయానికి చేరుకున్నారు. అక్కడ హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహాం చేసుకున్నారు. ఈ విషయం తెలియని జాజర్‌ యువతి తండ్రి తమ కూతురు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో మిస్సింగ్‌ కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

    ఆ తర్వాత సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా యువతులు ఉన్న ప్రదేశాన్ని గుర్తించారు. అమ్మాయిలిద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు స్థానిక న్యాయస్థానం ముందు హజరుపర్చారు. ఈ క్రమంలో వీరి మధ్య వాదనలు ఆసక్తిగా జరిగాయి. ఆ యువతులిద్దరు తాము మేజర్లమని.. తమ ఇష్టప్రకారమే వివాహం చేసుకున్నామని, ఒకరిని విడిచి మరొకరం ఉండలేమని కోర్టుకు తెలిపారు. అయితే, ఆ యువతుల తల్లిదండ్రులు మాత్రం వారికి నచ్చజెప్పడానికి ఎంతగానో ప్రయత్నిస్తున్నారట కానీ వారు అస్సలు వినిపించుకోవడం లేదట. ఏదేమైనా ఇద్దరూ కలిసి జీవించడానికి మొగ్గుచూపుతున్నారని హెలినామ్డి పోలీసు అధికారి మహేష్‌ కుమార్‌ తెలిపారు. ముఖ్యంగా యువ‌త ఇలాంటి పెడ‌ధోర‌ణుల‌కు అల‌వాటు ప‌డ‌టానికి ప్ర‌ధాన కార‌ణం ఎక్క‌డ ప‌డితే అక్క‌డ ఫోన్ల‌లో వీడియోలు అందుబాటులో ఉండ‌ట‌మే కార‌ణం అని భావిస్తున్నారు.
    Published by:Veera Babu
    First published:

    Tags: Crime news, Haryana, Haryana police, Love marriage

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు