సూర్యాపేటలో ఇద్దరబ్బాయిల ప్రేమ.. లింగమార్పిడి తర్వాత ట్విస్ట్...

లింగ మార్పిడి చేయించుకుంటేనే పెళ్లి చేసుకుంటానని ఓ యువకుడు షరతు పెట్టాడు. దీంతో రెండో యువకుడు.. లింగమార్పిడి చేసుకుని మహిళగా మారాడు.

news18-telugu
Updated: December 4, 2019, 6:16 PM IST
సూర్యాపేటలో ఇద్దరబ్బాయిల ప్రేమ.. లింగమార్పిడి తర్వాత ట్విస్ట్...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఔను.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు. పెళ్లి చేసుకుందామనుకున్నారు..! అయితే అన్ని ప్రేమకథల్లాగే ఈ స్టోరీలో కూడా వారి పెళ్లికి ఆటంకాలు ఎదురయ్యాయి. చివరకు పంచాయితీ పోలీసుల వద్దకు చేరింది. ఇంతవరకూ స్టోరీ రొటీనే. అయితే ఈ కథలో ట్విస్ట్‌ ఏంటంటే..వాళ్లిద్దరూ అబ్బాయిలు. ఔను..ఇద్దరు యువకుల మధ్య చిగురించిన ప్రేమ..పెళ్లికి దారి తీసింది. అయితే లింగ మార్పిడి చేయించుకుంటేనే పెళ్లి చేసుకుంటానని ఓ యువకుడు షరతు పెట్టాడు. దీంతో రెండో యువకుడు.. లింగమార్పిడి చేసుకుని మహిళగా మారాడు. అయితే లాస్ట్‌మినిట్‌లో మొదటి యువకుడు పెళ్లికి నిరాకరించడంతో పంచాయితీ పోలీసుల వద్దకు చేరింది.

సూర్యాపేట జిల్లా ఇమాంపేటకు చెందిన ఓ యువకుడు ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో సూర్యాపేటకు చెందిన యువకుడితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ప్రేమ పేరుతో దగ్గరైన వీరిద్దరూ పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. మహిళగా మారితేనే పెళ్లి చేసుకుంటానని రెండో వ్యక్తి చెప్పడంతో.. యువకుడు లింగమార్పిడి చేయించుకున్నాడు. తీరా మహిళగా మారిన తర్వాత రెండో వ్యక్తి పెళ్లికి నిరాకరించాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ పంచాయితీని ఎలా విప్పాలో తెలియక పోలీసులు తలలు పట్టుకున్నారు.
First published: December 4, 2019, 6:13 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading