THE TWIN MURDERS OF ABDULLAPURMATE IN RANGAREDDY DISTRICT WERE COMMITTED BY THE DECEASED JYOTI HUSBAND HERE THE DETAILS PRV
Abdhullapur twin Murders: అబ్దుల్లాపూర్ జంట హత్యల కేసు.. హంతకులను పట్టుకున్న పోలీసులు.. ఎందుకు చంపారంటే..?
ప్రతీకాత్మక చిత్రం
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కొత్తగూడెం బ్రిడ్జి వద్ద నగ్నంగా పడి ఉన్న జంట మృతదేహాలు బుధవారం కలకలం రేపాయి. రెండ్రోజుల కిందటే వీరిని చంపినట్టు పోలీసులు భావించారు. అయితే ఈ కేసును ఎట్టకేలకు పోలీసులు చేధించారు.
రంగారెడ్డి (Rangareddy) జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ (Abdhullapurmate) పోలీస్‌స్టేషన్ పరిధిలోని కొత్తగూడెం బ్రిడ్జి వద్ద నగ్నంగా పడి ఉన్న జంట మృతదేహాలు బుధవారం కలకలం రేపాయి. మృతులను సికింద్రాబాద్ వారాసిగూడకు చెందిన ఎండ్ల యశ్వంత్ (22), మెట్టుగూడకు చెందిన వివాహిత జ్యోతి (28)గా పోలీసులు గుర్తించారు. మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో ఉన్నాయి. రెండ్రోజుల కిందటే వీరిని చంపినట్టు (Twin murders) పోలీసులు భావించారు. అయితే ఈ కేసును ఎట్టకేలకు పోలీసులు చేధించారు. యశ్వంత్, జ్యోతిలను భర్త (Jyoti Husband) శ్రీనివాసరావు (Srinivasa rao) హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఈ హత్య (Twin murders)లో తానొక్కడినే పాల్గొన్నట్లు నిందితుడు చెబుతున్నాడు. కానీ, పోలీసులు మాత్రం ఇది సుఫారీ గ్యాంగ్ (Supari gang) పనేనని అనుమానిస్తున్నారు.
కారణం ఏంటి?
హైదరాబాద్ నగరంలోని వారాసీగూడకు చెందిన యశ్వంత్ (Yaswanth) కు అదే ప్రాంతానికి చెందిన వివాహిత జ్యోతి (Jyoti)తో వివాహేతర సంబంధం (Extramarital affairs) ఉంది. యశ్వంత్, జ్యోతి మధ్య సంబంధం కొనసాగుతున్నట్లు భర్త గుర్తించాడు. ఓసారి ఇంట్లోనే వీరిద్దరూ ఏకాంతంగా గడుపుతుండటాన్ని చూసి ఆయన (Husband) హెచ్చరించారు. అయినప్పటికీ వారి ప్రవర్తనలో మార్పు రాలేదు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం వారాసిగూడ నుంచి యశ్వంత్, జ్యోతి కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండటాన్ని భర్త గుర్తించి వారిని వెంబడించాడు.
ఇద్దరూ ఏకాంతంగా గడుపుతుండటంతో..
సుమారు 30 కి.మీ దూరంలోని అబ్దుల్లాపూర్‌మెట్ కొత్తగూడ సమీపంలో చెట్లపొదల్లోకి వారు వెళ్లడాన్ని గమనించాడు. యశ్వంత్, జ్యోతి ఏకాంతంగా గడుపుతుండటాన్ని భర్త నేరుగా చూశాడు. మార్గంమధ్యలో కొనుగోలు చేసి తీసుకెళ్లిన మద్యాన్ని అక్కడే తాగాడు. అనంతరం ఆవేశాన్ని అణచుకోలేక పక్కనే ఉన్న రాయి తీసుకెళ్లి జ్యోతి తలపై మోదాడు దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. ఆ తర్వాత తన వెంట తెచ్చుకున్న స్క్రూడ్రైవర్‌తో యశ్వంత్ గుండెపై ఒక్కసారిగా పొడిచాడు. దీంతో యశ్వంత్ కుప్పకూలి అపస్మారక స్థితికి వెళ్లాడు. అప్పటికే కసితో రగిలిపోతున్న జ్యోతి భర్త.. యశ్వంత్ మర్మాంగంపైనా దాడి చేసి ఛిద్రం చేశాడు. ఇద్దరూ చనిపోయారని నిర్ధారించుకున్నాక అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
మరోవైపు ఈ హత్యలను (Abdhullapur twin Murders) తానొక్కడినే చేసినట్లు జ్యోతి భర్త చెబుతున్నాడు. కానీ, పోలీసులు అతని బంధువులను కూడా విచారిస్తున్నారు. ఇప్పటికే కొంతమందిని అదుపులోకి సైతం తీసుకున్నారు. ఇది ఒక్కడు చేసిన పని కాదని, మరో నలుగురు సహకరించినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ విషయాన్ని మీడియా సమావేశంలో పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది.
ఎలా బయటపడింది?
కొత్తగూడ బ్రిడ్జి వద్ద ఓ గీత కార్మికుడు కల్లు గీసే సమయంలో యశ్వంత్,జ్యోతిలు హత్యకు గురైన ప్రాంతంలో టూ వీలర్ ను గుర్తించాడు. ఈ బైక్ వద్దకు గీత కార్మికుడు వచ్చిన సమయంలో దుర్వాసన రావడంతో అక్కడికి వెళ్లి చూడడంతో రెండు మృతదేహాలు కన్పించాయి. దీంతో అతను పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఈ సమాచారం ఆధారంగా అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు నిన్న సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు.ఈ దర్యాప్తులో బైక్ ను యశ్వంత్ దిగా గుర్తించారు. హత్య ప్రదేశంలోని హ్యాండ్ బ్యాగ్ లో దొరికిన చెప్పుల రశీదు ఆధారంగా మృతురాలిని జ్యోతిగా గుర్తించారు.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.