Tamil nadu: సినీ ఫక్కీలో అడవిలోకి వెళ్లిన దొంగ.. పట్టుకోవడానికి వచ్చిన పోలీసులపై కాల్పులు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

దొంగలు పక్కా ప్రణాళికతో మాటు వేసి ఒంటరిగా వెళుతున్న మహిళల (women) మెడలో నుంచి చైన్లు (chains) లాక్కెళుతున్నారు. రోడ్డుపై ఎవరూ లేకుండా చూసి మహిళను సమీపించి చోరీ (theft) చేస్తున్నారు. ఇక ఇటీవల తమిళనాడు (tamil nadu)లో సైతం రెచ్చిపోతోంది ముఠా.  

 • Share this:
  చైన్ స్నాచింగ్ (Chain snatching) ఘటనలు ఇటీవల అధికమవుతున్నాయి. చోరీ చేయడానికి వస్తున్న దొంగలు పక్కా ప్రణాళికతో మాటు వేసి ఒంటరిగా వెళుతున్న మహిళల (women) మెడలో నుంచి చైన్లు (chains) లాక్కెళుతున్నారు. రోడ్డుపై ఎవరూ లేకుండా చూసి మహిళను సమీపించి చోరీ (theft) చేస్తున్నారు. ఇక ఇటీవల తమిళనాడు (tamil nadu)లో సైతం రెచ్చిపోతోంది ముఠా.  పెరంబదూర్‌ (perumbadhuru)లో ఓ మహిళ మెడలో నుంచి బంగారం చైన్‌ (gold chain) లాక్కెళ్తుండగా అడ్డుకున్న స్థానికులు, పోలీసులపై తొపాకులు (guns), కత్తుల (knife)తో దాడి చేశారు. పోలీసులు (police) జరిపిన ఎదురుకాల్పుల్లో (firing) ఓ చైన్‌ స్నాచర్‌ హతమయ్యాడు (died). తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది.

  గత కొన్ని రోజులుగా చెన్నై (Chennai), తిరువళ్లూర్‌, కాంచీపురం జిల్లాల్లో చైన్‌ స్నాచింగ్‌ గ్యాంగ్‌ రెచ్చిపోతోంది. వరుసగా దోపిడీలకు పాల్పడుతోంది. తాజాగా పెరంబదూర్‌లో మహిళ మెడలో నుంచి బంగారం చైన్‌ లాక్కెళ్తుండగా ఆమె గట్టిగా కేకలు వేయడంతో.. స్థానికులు అతన్ని అడ్డుకునే (trying to stop) ప్రయత్నం చేశారు. ఐతే వారిపై కాల్పులకు తెగబడ్డాడు ఆ దొంగ (thief). సమాచారం అందుకొని అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా.. వారిపై కూడా అటాక్‌ (attack) చేశాడు. తుపాకీతో కాల్పులు (firing) జరిపాడు. దీంతో పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో జార్ఖండ్​కు చెందిన దొంగ ముర్తాసా (murthaasa) మృతి చెందాడు. ఈ ఘటనలో ముర్తాసాకు సాయం చేసిన మరో నిందితుడు నయీమ్​ అక్తర్ (Nayeem Akhtar)​ను తమిళనాడు పోలీసులు అరెస్ట్​ చేశారు.

  అడవిలో కాల్చివేత..

  మూడు జిల్లాల్లో వరుస దోపిడీలను సీరియస్‌గా తీసుకున్న తమిళనాడు పోలీసులు (tamil nadu police).. వారిపై నిఘా పెట్టారు. దొంగతనం చేసిన అనంతరం తెన్నలూర్‌ అటవీ ప్రాంతం (forest area)లో చైన్‌ స్నాచర్స్‌ దాక్కున్నారన్న సమాచారం (Information)తో పోలీసులు అలర్ట్​ అయ్యారు. ఆ ప్రాంతానికి వెళ్లగా పోలీసులపై అటాక్‌ చేసింది చైన్‌ స్నాచింగ్‌ గ్యాంగ్ (gang). గన్‌తో కాల్పులు జరుపుతూ, కత్తులతో దాడికి దిగారు దుండగులు. దీంతో వారిపైకి పోలీసులు కాల్పులు జరిపారు. అయితే ఘటనలో మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మరో ముగ్గురు దుండగులను పోలీసులు అరెస్ట్‌ (arrest) చేశారు. పోలీసుల సెర్చ్‌ ఆపరేషన్‌లో ముగ్గురు పోలీసులకు గాయాలయ్యాయి. ఐతే మరికొందరు దుండగులు పరారీలో ఉన్నారన్న సమాచారంతో వారికోసం అటవీ ప్రాంతాన్ని పోలీసులు జల్లెడ పడుతున్నారు.

  కోయంబత్తూరులో..

  తమిళనాడులోని కోయంబత్తూరులో కరామడై పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవలె చైన్ స్నాచింగ్ జరిగింది. గాంధీనగర్​లోని కరామడైలో విజయలక్ష్మి ఉంటున్నారు. ఆమె ఇంటికి వెళుతుండగా బైక్​పై వచ్చిన ఇద్దరు దగ్గరికి వచ్చారు. ఒకరు హెల్మెట్ పెట్టుకొని ఉండగా.. మరొకరు ధరించలేదు. బైక్​పై వేగంగా విజయలక్ష్మి దగ్గరికి వచ్చిన వారు మెడలోనే చైన్​ను హఠాత్తుగా లాగేశారు. ఆమె బైక్ వెంట పడి అరిచినా ఫలితం లేకపోయింది.  2.5 సవర్ల బంగారాన్ని దోచుకెళ్లారు. పట్టపగలే ఈ ఘటన జరిగింది. దీంతో వరుస చోరీలతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ చెన్ స్నాచింగ్​ తతంగం మొత్తం సీసీటీవీలో రికార్డు అయింది. దొంగలపై పోలీసులు గట్టి నిఘా పెట్టడంతో దొరికిపోయారు.
  Published by:Prabhakar Vaddi
  First published: