(న్యూస్ 18, మహబూబ్ నగర్, సయ్యద్ రఫీ)
కరుడుగట్టిన దొంగ (Thief) మహబూబ్ నగర్ (Mahbubnagar) జీఆర్పీ స్టేషన్ నుంచి పరారైన ఘటన (Thief Escaped) ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కర్ణాటకలోని రాయిచూరు జైలు నుంచి పీటీ వారెంట్‌పై నిందితుడిని వివిధ కేసుల్లో విచారణ తీసుకొని రాగా రైల్వే పోలీసుల కళ్లు గప్పి పారిపోవడంతో ఒక ఎస్సై ఇద్దరు కానిస్టేబుళ్లపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేసినట్లు తెలిసింది. నెలన్నర కిందట ఈ ఘటన చోటుచేసుకోగా నిందితుడి కోసం కోసం తెలంగాణ కర్ణాటక ఉత్తరప్రదేశ్ ఢిల్లీ ప్రాంతాలలో పోలీసులు గాలిస్తున్నట్లు సమాచారం.
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) అలీఘర్ జిల్లాలోని ఓర్ని గ్రామానికి చెందిన దానేదార్ సింగ్ రైళ్లలో చోరీలు ఇతర పెద్ద పెద్ద దొంగతనాల్లో (Theft) నిందితుడు. పలుమార్లు పోలీసులకు చిక్కి శిక్ష పడి మళ్లీ బయటకు వచ్చినా చోరీలు మాత్రం మానలేదు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన అతను గతంలో కర్ణాటక లోని వాడిలో పని చేసుకుంటూ దొంగతనాలకు అలవాటు పడ్డాడు. ఆ తర్వాత హైదరాబాద్ (Hyderabad) లో మకాం మార్చాడు. అక్కడ దొంగతనాలకు తెగబడ్డాడు.
రైళ్లలో ఏ చోరీ జరిగినా..
చోరీ సొమ్ముతో కుటుంబ సభ్యులు విలాసవంతంగా బతికేవారు. కొన్నేళ్ల కిందట బంజారాహిల్స్ పోలీసులకు పట్టుబడగా నిందితుడి వద్ద నుంచి రూ.లక్షల్లో సొమ్ము రికవరీ చేసినట్లు సమాచారం. బయటికి వచ్చిన తర్వాత అతను చోరీలు మానలేదు. రైళ్లలో ఏ చోరీ జరిగినా పిక్ పాకెట్ంగ్ జరిగినా వెంటనే దాన దార్ సింగ్ ను అదుపులో తీసుకుంటే చాలు చోరీలకు పాల్పడిన వివరాలు బయటపడతాయని రైల్వే పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
మహబూబ్‌నగర్ ప్రభుత్వ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలోని చోరీలో అతని ప్రమేయం ఉన్నట్లు తేలడంతో కేసు నమోదు చేసి రాయచూర్ జైల్ లో ఉన్న దానదార్ సింగ్ ను విచారణకు గత ఏడాది నవంబరు 24న మహబూబ్‌నగర్ తీసుకొచ్చారు. విధుల్లో ఉన్న ఇద్దరు పోలీసుల కళ్లుగప్పి అదే రోజు అర్ధరాత్రి అతను స్టేషన్ నుంచి పారిపోయాడు (Thief Escaped). ఈ ఘటనలో ఎస్సై తో పాటు ఇద్దరు పోలీసుల పై చర్యలు తీసుకున్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
దాన దార్ సింగ్ ఆచూకీ కోసం రైల్వే పోలీసులు నెలన్నరగా గాలిస్తున్నా ఆచూకీ లభ్యం కాలేదు. ఈ వ్యవహారంపై పోలీసు ఉన్నతాధికారులు సైతం సీరియస్‌గా ఉన్నారు. కాచిగూడ జి ఆర్ పి ఇన్స్పెక్టర్ వెంకట్ రాములును వివరణ కోరగా పలు దొంగతనాలు ప్రమేయం ఉండి శిక్ష అనుభవిస్తున్న దాని దారి సింగ్ మహబూబ్‌నగర్ నుంచి పారిపోయిన విషయం వాస్తవం అన్నారు. అయితే గాలింపు చర్యలు చేపట్టామని ఆయన తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mahabubnagar, Theft, Thief Arrested