ఆ మధ్య తెలుగులో వచ్చిన కనులు కనులు దోచాయంటే సినిమా(movie) గుర్తుందాం.. దుల్కర్ సల్మాన్ (Dhulkar salman) హీరోగా నటించిన ఈ సినిమాలో ఓ కారు దొంగతనం(theft) చేసే సీన్ ఉంటుంది. అత్యంత భద్రత గల ప్రాంతంనుంచి రిమోట్(Remote) సాయంతో కారు(Car)ను దొంగిలిస్తాడు హీరో. కనీసం డ్రైవర్ సాయం లేకుండానే రిమోట్‌తో ఆ కారు రోడ్డుపై నడుస్తుంది. ఎలాంటి హై సెక్యూరిటీ ఉన్నా ప్రస్తుతం దానిని మించిన టెక్నాలజీ(Technology)తో దొంగతనం చేస్తున్నారు ఘనులు. ఇలాంటి ఘటన ఇటీవల ఇంగ్లాండ్(England)లో జరిగింది. ఓ ఖరీదైన బెంజ్(Benz) కారును దుండుగుడు అపహరించాడు. ఏకంగా రిమోట్ సాయం(remote help)తో అత్యంత అధునాతన(sophisticated) కారును ఎత్తుకెళ్లిపోయాడు. ఇంతకీ ఆ కారు ఎవరిదో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. హాలీవుడ్లో బ్లాక్బ్లాస్టర్స్ సినిమాలు చేసిన టామ్‌క్రూజ్(Tom cruise)ది. అవును ఆ హీరోగారిదే. మన తెలుగు సినిమాలో అయితే హీరోగారే కొట్టేశారు. నిజ జీవితంలో మాత్రం హీరో గారి కారునే కొట్టేశారు. ఇంతకీ ఆ కారు ఎలా పోయింది... ఇంతకీ దొరికిందా లేదా.. అవే వివరాలు తెలుసుకుందాం..
టామ్‌క్రూజ్ మిషన్ ఇంపాజిబుల్ (mission: impossible) 7 సినిమాలో నటిస్తున్నాడు. సినిమా షూటింగ్ ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హోమ్‌లో జరుగుతోంది. అయితే షూటింగ్‌కి టామ్ క్రూజ్((Tom cruise) తన ఖరీదైన బీఎండబ్ల్యూ ఎక్స్7 కారులో వచ్చాడు. మామూలుగానే పార్కు చేసి షూటింగ్ లొకేషన్‌కు వెళ్లాడు. కాగా, ఆ కారులో హీరో టామ్ విలువైన వస్తువులను(Luggage) అలాగే ఉంచేశాడు. ఇక అప్పుడే ఎంటరయ్యాడు దొంగ(thief). ఆ కారు అసలే అత్యాధునికి టెక్నాలజీతో తయారైంది. కీ లెస్ కారు. తన పరిధి దాటి వెళ్లిపోతే కారు ఓనర్ గారెకి సందేశం సైతం వెళ్లిపోతుంది. దీంతో తన సాంకేతిక తెలివి తేటలను ఉపయోగించి కారును స్టార్ట్ చేసేశాడు. టామ్ క్రూజ్ సెక్యూరిటీ కళ్లు గప్పి కారును వైర్లెస్ ట్రాన్స్మిషన్ ద్వారా తీసుకెళ్లిపోయాడు. అంతేనా ఆ కారు అక్కడే కీ పరిధిలోనే ఉన్నట్లు సాంకేతిక ఉపయోగించాడు. కొద్ది సేపటి తర్వాత గమనించిన సెక్యూరిటీ సిబ్బంది హీరో గారి దృష్టికి విషయం తీసుకెళ్లారు. దీంతో పోలీసు కేసు నమోదు చేశారు.
ఇక రంగంలోకి దిగిన పోలీసులు కారు గురించి వివరాలు ఆరా తీశారు. అక్కడున్న సీసీ కెమెరాలు పరిశీలించి అవాక్కయ్యారు. సాంకేతికతను ఉపయోగించి సదరు దొంగ కారును ఎత్తుకెళ్లిన విధానంపై విస్తుపోయారు. అయితే కారు మామూలు వ్యక్తిది అయితే కాదు కదా.. అందుకే పోలీసులను అలర్ట్ చేసి కారును పట్టుకున్నారు. కానీ, కారులో టామ్‌క్రూజ్ విలువైన వస్తువులు(Luggage) మాత్రం దొంగ(thief) తీసుకెళ్లిపోయాడట. ఏదైతేనేం చివరికి మన హాలీవుడ్ హీరో గారి కారు దొరికేసింది. టామ్‌క్రూజ్ చేస్తున్న మిషన్ ఇంపాజిబుల్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా అభిమానం గణం గట్టిగానే ఉంది. గతంలో చేసిన మిషన్ ఇంపాజిబుల్ సిరీస్‌లు బ్లాక్‌బ్లాస్టర్ అయ్యాయి. దీంతో మిషన్ ఇంపాజిబుల్7తో నిర్మాతలు మళ్లీ వస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదలయ్యే అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CAR, Crime, Hollywood, Mercedes-Benz, Technology, Theft