హోమ్ /వార్తలు /క్రైమ్ /

Imprisonment for Municipal Commissioner: తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు.. మున్సిపల్ కమిషనర్​కు జైలు శిక్ష.. ఎందుకంటే?

Imprisonment for Municipal Commissioner: తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు.. మున్సిపల్ కమిషనర్​కు జైలు శిక్ష.. ఎందుకంటే?

ts high court

ts high court

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపల్ కమిషనర్​ (Illendu Municipal Commissioner)గా గతంలో పనిచేసిన అంజన్ కుమార్ కు కోర్టు ధిక్కరణ కింద తెలంగాణ హైకోర్టు (Telangana High Court) రెండు నెలల జైలు శిక్ష విధించింది.

భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా ఇల్లందు మున్సిపల్ కమిషనర్​ (illendu Municipal Commissioner)గా గతంలో పనిచేసిన అంజన్ కుమార్ కు కోర్టు ధిక్కరణ క్రింద తెలంగాణ హైకోర్టు (Telangana High Court) రెండు నెలల జైలు శిక్ష విధించింది. ఇల్లందు పట్టణంలోని జగదాంబ సెంటర్ నుంచి కరెంట్ ఆఫీసు వరకు గల మెయిన్ రోడ్డు పై ఆక్రమణలు తొలగించాలని (Occupancies to be eliminated) పట్టణానికి చెందిన పెండెకట్ల యాకయ్య హైకోర్టును ఆశ్రయించాడు. ఈ మేరకు  విచారణ చేసిన హైకోర్టు ఆర్ అండ్ బి రోడ్డుకిరువైపులా ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించాలని మున్సిపల్ కమిషనర్ కు కొన్నేళ్ళ క్రితం తీర్పునిచ్చింది. హైకోర్టు తీర్పును అమలు చేయకుండా గత మున్సిపల్ కమిషనర్ అంజన్  కుమార్  (Anjan kumar) నిర్లక్ష్యంగా వ్యవహరించారని పెండేకంటి యాకయ్య అనే ఇల్లందు పట్టణ వాసి హైకోర్టు తీర్పును అమలు చేయడం లేదని కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశాడు. ఈ మేరకు విచారణ చేసిన హైకోర్టు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించి కోర్టు తీర్పును అమలు చేయనందున అంజన్ కుమార్ కు రెండు నెలలు జైలు శిక్ష విధించింది.

కలెక్టర్లకు జరిమానా..

కాగా, గతంలోనూ కోర్టు ధిక్కరణ కేసులు చాలానే నమోదయ్యాయి. మల్లన్నసాగర్ ప్రాజెక్టు కోర్టు ధిక్కరణ కేసలో తెలంగాణ హైకోర్టు గతంలోనే సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులపై విచారణ చేసిన హైకోర్టు ప్రభుత్వ అధికారులకు జైలుశిక్ష, జరిమానా విధించింది. కోర్టు ఆదేశాలను పాటించకుడా నిర్లక్ష్యంగా వ్యవహరించింనందుకు కోర్టు ధిక్కరణ కింద శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి, సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌కు రూ.2వేలు జరిమానా విధించింది. నాలుగు వారాలల్లో జరిమానా చెల్లించకపోతే నెల రోజుల జైలు శిక్ష పడుతుందని కోర్టు హెచ్చరించింది. అటు సిద్దిపేట ఆర్డీఓ జయచందర్‌రెడ్డికి 2 నెలల జైలు శిక్షతో పాటు రూ.2 వేలు జరిమానాను విధించింది. అంతేకాదు 12 మంది పిటిషనర్లకు రూ.2 వేల చొప్పున చెల్లించాలని అధికారులను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.

ఖమ్మంలో..

ఖమ్మంలోనూ ఇలాంటి ఘటనే జరిగింది.  ప్రభుత్వ పథకాల్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ ఖమ్మం ప్రజలు కలెక్టర్‌కు వినతీ పత్రాలు సమర్పించారు. ఆ వినతి పత్రాలపై చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. కానీ ఆ ఆదేశాలను కలెక్టర్ పట్టించుకోలేదు. కోర్టు ఆదేశాలను ఆదేశాలను అమలు చేయకపోవడంపై ఖమ్మం జిల్లా పెనుబల్లికి చెందిన కర్రి వెంకట్రామయ్య కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారించిన సింగిల్‌ జడ్జి ఖమ్మం జిల్లా కలెక్టర్‌ కర్ణన్‌కు రూ.500 జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని తన జీతం నుంచి వసూలు చేయాలని ఆదేశించింది.

ఈ నేపథ్యంలో సింగిల్ బెంచ్ సవాలు చేస్తూ కలెక్టర్‌ హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. దానిపై మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లి, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కలెక్టర్‌పై హైకోర్టు మండిపడింది. చివరి అవకాశంగా కోర్టుకు వస్తారని.. కానీ కోర్టు ఉత్తర్వులు ఇచ్చినా ఎందుకు అమలు చేయరని నిలదీసింది. కలెక్టర్ తరపున న్యాయవాది జోక్యం చేసుకొని.. తెలియక పొరపాటు చేశారని, ఇది మొదటి తప్పని సర్ధిచెప్పే ప్రయత్నం చేశారర. ఐతే 2012 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారికి ఈ మాత్రం తెలియదంటే ఎలా? అని హైకోర్టు మండిపడింది.

First published:

Tags: Bhadradri kothagudem, Crime news

ఉత్తమ కథలు