ఫేస్‌బుక్ లైవ్ సూసైడ్...ప్రియురాలు దక్కలేదని యువకుడి ఆత్మహత్య...

తన ప్రియురాలు లేకుండా బతకలేను అంటూ శ్యామ్ సూసైడ్ నోట్ రాశాడు. అనంతరం స్థానికంగా ఉన్న ఓ దేవాలయానికి వెళ్లి అక్కడ ఆవరణలో ఫేస్ బుక్ లైవ్ ద్వారా శ్యామ్ ఆత్మహత్య చేసుకున్నాడు.

news18-telugu
Updated: September 15, 2019, 11:02 PM IST
ఫేస్‌బుక్ లైవ్ సూసైడ్...ప్రియురాలు దక్కలేదని యువకుడి ఆత్మహత్య...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ప్రియురాలికి నిశ్చితార్థం అయ్యిందన్న బాధతో ఓ యువకుడు ఫేస్ బుక్ వేదికగా లైవ్ ఇస్తూ ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే ఆగ్రా జిల్లాకు చెందిన శ్యాం రాజ్ అనే యువకుడు ఓ యువతిని ప్రేమించాడు. అయితే ఈ తన ప్రియురాలికి మరో యువకుడితో ఇటీవల నిశ్చితార్థం జరిగిందని తెలుసుకొని ఆమెను ఎలాగైనా తనతో వచ్చేయాలని ఒత్తిడి తెచ్చాడు. అంతుకు ఆమె ఒప్పుకోలేదు. దీంతో తన ప్రియురాలు లేకుండా బతకలేను అంటూ శ్యామ్ సూసైడ్ నోట్ రాశాడు. అనంతరం స్థానికంగా ఉన్న ఓ దేవాలయానికి వెళ్లి అక్కడ ఆవరణలో ఫేస్ బుక్ లైవ్ ద్వారా శ్యామ్ ఆత్మహత్య చేసుకున్నాడు.

కాగా ఈ ఘటనను స్థానికులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయగా, మృతదేహాన్ని పోస్టుమార్టం జరిపించి బంధువులకు అందజేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Published by: Krishna Adithya
First published: September 15, 2019, 11:02 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading