హోమ్ /వార్తలు /క్రైమ్ /

Gurukula Teachers: వారిద్దరు ఏకాంతంగా ఉండగా వీడియో షూట్.. పాఠశాలలోనే ఇలాంటి ఘోరం.. చివరకు ఏమైందంటే..

Gurukula Teachers: వారిద్దరు ఏకాంతంగా ఉండగా వీడియో షూట్.. పాఠశాలలోనే ఇలాంటి ఘోరం.. చివరకు ఏమైందంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Gurukula Teachers: విద్యార్ధులు, గురువులు ఒకే చోట నివాసం ఉంటూ వారిలో జీవితం పట్ల, భవిష్యత్‌ పట్ల ఆశావహ దృక్ఫధాన్ని పెంపొందించడం, లక్ష్యసాధన దిశగా ముందుకెళ్లడం లాంటివి నేర్పాల్సిన ఉపాధ్యాయులు తామే చిన్నచిన్న బలహీనతలకు లొంగిపోతున్నారు. ఇక్కడ జరిగిన ఘనట తెలిస్తే.. మీకే అర్థం అవుతుంది.

ఇంకా చదవండి ...

(G.SrinivasaReddy,News18,Khammam)

సువర్ణపాక కళ్యాణి. వయసు 26. ఆమె ఓ ఉపాధ్యాయురాలు. సొంతూరు ఇల్లెందు మండలం రొంపేడు. అతను వైస్‌ ప్రిన్సిపల్‌ మన్మధరావు. ఇద్దరూ ఒకేచోట అంటే అన్నపురెడ్డిపల్లి ప్రభుత్వ గురుకుల కళాశాలలో పనిచేస్తున్నారు. కొన్నేళ్లుగా ఇద్దరూ ఒకే చోట పనిచేస్తున్నారు. చనువు ఏర్పడింది. తరచూ మాట్లాడుకునేవాళ్లు. ఇద్దరి అభిప్రాయాలు, ఆలోచనలు పంచుకునేవాళ్లు. అలా దగ్గరయ్యారు. ఒకే చోట పనిచేస్తారు.. ఒకే ప్రాంగణంలో నివాసం ఉంటారు. దీంతో సమయం దొరికినపుడు ఎక్కడో ఒక దగ్గర కలుస్తుంటారు. అలా గురువారం సాయంత్రం ఆమె, అతను ఒకే రూంలో ఉన్నారు. కాస్త ఏకాంతంగానే. అదే సమయంలో వీరిద్దరిని మరో ఉపాధ్యాయుడు వీడియో తీశాడు. తామిద్దరూ సన్నిహితంగా ఉన్న సమయంలో అతను వీడియో తీయడంతో ఆమె బాగా హర్ట్‌ అయింది. వీడియో తీసిన ఉపాధ్యాయునికి, ఈ ఇద్దరికి మధ్య కాసేపు వాగ్వివాదం చోటుచేసుకుంది.

Lawer-Young Women: అతడు ఒక లాయర్.. కానీ ఆ అమ్మాయి జీవితంలో మాయని మచ్చ తీసుకొచ్చాడు.. ఏం జరిగిందంటే..


ఓ పక్క విద్యార్ధులకు రీడింగ్‌ అవర్స్‌ నడుస్తుంటే‌ మీరిద్దరూ గదిలో ఏంచేస్తున్నారంటూ ప్రశ్నించడంతో ఆమె బాగా ఇబ్బంది పడింది. ఏంచేయాలో.. బయటకు తెలిస్తే పరువు ఎక్కడ పోతుందో.. ఇంట్లో వాళ్లకు ఎలా సమాధానం చెప్పుకోవాలో అర్థం కాక తల్లిడిల్లిపోయింది. నేరుగా తన క్వార్టర్‌కు వెళ్లిపోయింది. ఒంటరిగా కాసేపు ఏడ్చింది. భవిష్యత్‌ అంధకారంగా తోచింది. ఆ సమయానికి ఆమెకు భరోసా ఇచ్చేవాళ్లు కూడా లేకపోవడంతో ఆమె ఫ్యాన్‌కు ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. గిరిజన కుటుంబంలో పుట్టి పెరిగి కష్టపడి చదువుకుని ఉద్యోగం సాధించిన యువతి..

ఇలా ఇద్దరు మగాళ్ల మధ్య నలిగి ప్రాణాలు పోగొట్టుకుంది. భద్రాద్రి కొత్తూగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో చోటుచేసుకున్న ఘోరం ఇది. గత కొంత కాలంగా తీవ్రమైన లైంగిక వేధింపుల వల్లే ఆమె ఒకరికి బలవంతంగా దగ్గర కావాల్సి వచ్చినట్టు.. దీనిని ఓర్వలేని మరొక ఉపాధ్యాయుడు ఆమెను టార్గెట్‌ చేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని తెలియగానే ఆమెతో ఏకాంతంగా ఉన్న వైస్‌ ప్రిన్సిపల్‌ పరారవడం పలు అనుమానాలకు తావిస్తోంది. సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో ఎలాంటి దుస్థితి ఉందో ఈ ఘటన మచ్చుతునక మాత్రమే.

విద్యార్ధులు, గురువులు ఒకే చోట నివాసం ఉంటూ వారిలో జీవితం పట్ల, భవిష్యత్‌ పట్ల ఆశావహ దృక్ఫధాన్ని పెంపొందించడం, లక్ష్యసాధన దిశగా ముందుకెళ్లడం లాంటివి నేర్పాల్సిన ఉపాధ్యాయులు తామే చిన్నచిన్న బలహీనతలకు లొంగిపోతున్న పరిస్థితి ఉంది. దీనికితోడు కొన్ని చోట్ల సామాజికవర్గం ప్రాతిపదికగా ప్రాధాన్యతలు మారిపోతున్నట్టు ఆరోపణలున్నాయి. ఖమ్మం రీజియన్లో సాంఘిక సంక్షేమ విద్యాసంస్థల తీరు అధ్వానంగా మారింది.

'గురుకులం అంటే గురువు కుటుంబంలో ఒకరిగా కలిసిపోయి విజ్ఞానాన్ని అందించాలి. అనే ఉద్దేశంతో ప్రాచీన విద్యావిధానం ఆధారంగా ప్రభుత్వాలు వీటిని నెలకొచ్చాయి. కానీ ఖమ్మం రీజియన్ పరిధిలోని పలు గురుకుల విద్యాసంస్థలు దీనికి భిన్నంగా వ్యవహరిస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. గురువు కుటుంబంలో ఒకరిగా కాకుండా కులం'లో కలిసిపోయి విజ్ఞానానికి బదులు వివక్షపై దృష్టి పెడుతున్నట్లు తెలుస్తోంది. తద్వారా పాలన గాడితప్పి పలువురు విద్యార్థులు పాఠశాలల్లో ఉండలేక పరారయ్యే ప్రయత్నంలో ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్న ఉదంతాలు చోటుచేసుకుంటున్నాయి. గురువుల మధ్య ఆధిపత్య పోరాట ప్రభావం విద్యార్థుల పైనా పడుతోంది. అనుకుల ప్రధానో పాధ్యాయుడైతే " ఓ రకంగా లేదంటే మరోరకంగా  వ్యవ హరిస్తూ గురుకుల విద్యావ్యవస్థను కొందరు ఉపాధ్యా యులు ఉద్దేశపూర్వకంగా భ్రష్టు పటిస్తుంటే దానిని నియం త్రించాల్సిన ప్రాంతీయ అధికారి సైతం వక్రమార్కులకే వంతపాడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

ఇటీవల గురుకులాల్లో చోటుచేసుకున్న కొన్ని ఉదంతాలు...

పాలన గాడితప్పడంతో ఇటీవలికాలంలో గురుకులాల్లో కొన్ని ఉదంతాలు చోటుచేసుకున్నాయి. ఖమ్మం నగరంలోని బొమ్మ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్న ఎస్సీ గురుకుల పాఠశాల (ముదిగొండ)లో ఐదో తరగతి చదివే విద్యార్ధి రాజేష్ పురుగుల అన్నం తింటూ వసతిగృహంలో ఉండలేక ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించాడు. తాను నిద్రిస్తున్న గది కిటికీలో నుంచి కిందకు దూకడంతో ఆ విద్యార్ధి తలకు తీవ్రగాయమైంది. కుడి చేయి విరిగింది తృటిలో ప్రాణాపాయం తప్పింది. వైదా గురుకులంలో ఓ విద్యార్థిని అస్వస్థతకు గురైంది. కరోనా పాజిటివ్ అని తేలగానే అందరికీ పరీక్షలు చేయించారు. మొత్తంగా 29 నుండి విద్యార్థులకు కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణైంది. ముందస్తు అప్రమత్తత లోపించడంతోనే ఈ పరిణామం చోటు చేసుకుందనే విమర్శలు వచ్చాయి.

Christmas-Central Government: : కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు క్రిస్మ‌స్ కానుక‌.. డీఏ, డీఆర్ విషయంలో కీలక నిర్ణయం..?


నాటి నుంచి పాఠశాలలకు పేరెంట్స్అనుమతించే విషయంలో ఆంక్షలు విధించారు. ఖమ్మం నగరంలోని నాన్వాయిగూడెం బాలికల గురుకుల కళాశాలలో మూడు రోజులు నీటి సమస్య ఏర్పడినా ఎవరూ పట్టించుకోలేదు. ముల్కలపల్లి స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు. పాఠశాలలో నెలకొన్న సమస్యలను ప్రాంతీయ అధికారి (ఆరేసేవి) దృష్టికి తీసుకొచ్చారు. అయినా పరిష్కారం. కాకపోవడంతో నాటి సాంఘిక సంక్షేమ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవవీణ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు.

- భద్రాచలం బాలికల గురుకుల పాఠశాలలోనూ కొంతమంది టీచర్లను ప్రధానానోపాధ్యాయురాలికి వ్యతిరేకంగా ప్రాంతీయ అధికారి ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

 అన్నిగురుకులం అస్తవ్యస్తం

భద్రాద్రి జిల్లా అన్నపురెడ్డిపల్లి కళాశాల విషయంలో ఆర్ సీవో జోక్యం తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె సామాజికవర్గానికి చెందిన ఓ ఐదుగురు టీచర్లను ప్రధానోపాధ్యాయుడికి వ్యతిరేకంగా ప్రోత్సహిస్తున్నారని సమాచారం. ఆరిసీవో అండతో అక్కడి ఉపాధ్యాయులు ప్రిన్సిపాల్న లెక్కచేయకుండా వ్యవహరిస్తున్నారని ఆరో పణలు వస్తున్నాయి. ఇదే అదనుగా సంబంధిత ఉపాధ్యా యులు తాగి పాఠశాలకు వస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధా నోపాధ్యాయున్ని అబాసుపాలు చేసేందుకు తమ సామాజికవర్గానికి చెందిన కొందరు పిల్లలను దుర్వసనాలకు అలవాటు చేశారని తెలిసింది. వారు పాఠశాలలోని ఆహారపదార్థాల్లో సర్ఫ్ వంటివాటిని కలుపుతున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఆమధ్య సాంబార్లో సర్ప్ కలవడంతో ఒకరిద్దరు పిల్లలు వాంతులు, విరేచనాలు కావడంతో వెంటనే గుర్తించి మిగిలిన విద్యార్థులకు వినియోగించలేదని తెలిసింది.

ఆర్సీవో పై అభియోగాలు..

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలోని 29 సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల ప్రాంతీయ అధికారి .. రీజినల్ కోఆర్డినేటర్ పై అనేక అభియోగా లున్నాయి. గతంలో ఆమె చొర్రూరు గురుకుల కళాశాల ప్రిన్సిపాల్గా పనిచేశారు. ఆ సమయంలో అనేక అవకత వకలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. అయినా ఆమెకు పదోన్నతి కల్పించి నిబంధనలకు విరుద్ధంగా సొంత జిల్లాకు ఆర్సోవోగా బదిలీ చేయడం వివాదాస్పదమవు తోంది. ఇటీవల ఆమె కుమారుని వివాహం సందర్భంగా ఒక్కో ప్రిన్సిపాల్ నుంచి రూ.5,000 చొప్పున ఏఆరేస్వే ద్వారా వసూలు చేయించారని సమాచారం. అన్నపురెడ్డిపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల మార్చిలో కరో నాకు ముందు నిర్వహించిన ప్రాక్టికల్ పరీక్షల్లో సమయంలో కొందరు పిల్లలు దురలవాట్లకు లోనయ్యారు.

అటువంటి పిల్లలను గుర్తించి వారానికోసారి కౌన్సిలింగ్ చేయాలి. కానీ ఆ ప్రయ త్నమేది జరగటం లేదు. జిల్లాలోని విద్యాసంస్థలను సందర్శించేందుకు ఆర్సీవోకు నెలకు రూ.40వేలు ఇస్తుంటారు. కానీ ఆమె ఏ ఒక్క పాఠశాలను సందర్శించిన దాఖలాలు లేవని, కార్యాలయంలోనే ఉంటూ అనుకుల' ఉపాధ్యాయులతో కలిసి అన్నీతానై చక్రం తిప్పుతున్నట్లు విమర్శలు ఉన్నాయి.  అన్నపురెడ్డిపల్లి గురుకులంలో తన సామాజికవర్గం టీచర్ ద్వారా ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణకు వచ్చిన డబ్బులను విధుల్లో లేని ఉపాధ్యాయుల పేరుతో కాజేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కొద్దిరోజుల క్రితం అన్నపురెడ్డిపల్లి గురుకుల పాఠశాలలో నెలకొన్న సమస్యలపై అక్కడి ఉపాధ్యాయులు వాటి గురుకుల విద్యాసంస్థలు సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణుమారు రహస్య నివేదిక పంపారు.

Health Insurance: హెల్త్ ఇన్సూరెన్స్ వెయిటింగ్ పీరియ‌డ్‌ ఒక ఏడాదికి తగ్గింపు.. ప్రకటించిన డిజిట్ ఇన్సూరెన్స్ కంపెనీ


పాఠశాల నిర్వహణకు ఆటంకంగా మారిన ఒకే సామాజికవర్గం టీచర్లను తొలగించాల్సిందిగా ఆ రిపోర్టులో పేర్కొన్నట్లు సమాచారం, ఒకే సామాజికవర్గానికి చెందిన ఐదుగురు ఉపాధ్యాయులు సమావేశం నిర్వహించి ఇతర సామాజికవర్గ టీచర్లను ఎలా దెబ్బతీయాలో చర్చించారు. ఆ మీటింగ్కు సంబంధించిన ఆడియో బయటకు రావడంతో ఆర్సేషో విచారణ నిర్వహించారు. కానీ, ఇంతవరకు వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. కనీసం వారికి మెమో కూడా జారీ చేయలేదు. ఓ సామాజికవర్గం టీచర్లు చేస్తున్న అరచూలను తట్టుకోలేక ఓ పాటైం పీఈటీ రవి బయటకు వెళ్లి పెయింటింగ్ వర్క్ చేసుకుంటున్నారు.

శానిటేషన్ సామగ్రి విషయంలో అవకతవకలపై ఆర్నెళ్ల క్రితం విజిలెన్స్ ఎంకైరీ నిర్వహించారు. ఈ ఎంక్వైరీ అనంతరం ఆరిసీవోకు షోకాజ్ నోటీసు ఇచ్చి ఏఆర్ సేవోను తప్పించి దమ్మపేట అధ్యాపకులుగా డిమోషన్ ఇచ్చారు. కానీ ఆర్ సీవోపై ఎటువంటి చర్యలు తీసుకోని "పోవడం చర్చనీ యాంశంగా మారింది. ఆరేవో కార్యాలయ ఉద్యోగులు సైతం మనోవేదనకు గురవుతున్నట్లు సమా చారం కొందరు ఇక్కడి నుంచి బదిలీ చేయించుకునేందుకు శతవిధాలా ప్రయ త్నిస్తున్నట్లు తెలిసింది.

First published:

Tags: Crime, Crime news, Khammam

ఉత్తమ కథలు