వీధి కుక్కను చంపిన డాక్టర్... కేసు నమోదు... అరెస్ట్...

Thiruvananthapuram : సాధారణంగా వీధి కుక్కల్ని ఎవరూ చంపరు... పైగా డాక్టర్ వృత్తిలో ఉన్న వ్యక్తి అలా చెయ్యడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఆ డాక్టర్ కుక్కను ఎందుకు చంపాడు.

Krishna Kumar N | news18-telugu
Updated: September 7, 2019, 8:46 AM IST
వీధి కుక్కను చంపిన డాక్టర్... కేసు నమోదు... అరెస్ట్...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
అది... కేరళ... తిరువనంతపురంలోని... పూజప్పురా చడియారా ఆలయ ప్రాంతం. అక్కడి రోడ్డుపై ఉన్నట్టుండి... గన్ ఫైరింగ్ సౌండ్ వినిపించింది. ప్రజలంతా ఒక్కసారిగా ఆగి... కాల్పులు జరిపిన వ్యక్తివైపు భయంభయంగా చూశారు. ఆ క్షణంలో ఓ కుక్క... బుల్లెట్ గాయాలతో నేలపై పడి... విలవిలా కొట్టుకుంటోంది. వెంటనే కొందరు... అయ్యో అదేంటి... కుక్కను కాల్చారు... అంటూ... దాన్ని ఆటోలోకి ఎక్కించి... దగ్గర్లోని జంతువుల షెల్టర్‌కి తీసుకెళ్లారు. అప్పటికే ఆ కుక్క చనిపోయింది. ఈ విషయం తెలుసుకున్న జంతువుల సంక్షేమ కార్యకర్తలు... పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. జంతువుల రక్షణ చట్టం కింద కేసు నమోదైంది. కాల్పులు జరిపిన డాక్టర్ విష్ణును అరెస్టు చేశారు.

పోలీసులు... అతని దగ్గరున్న ఎయిర్ షాట్‌గన్‌ను రికవరీ చేసుకున్నారు. ఆ తర్వాత విష్ణు బెయిల్‌పై విడుదలయ్యారు. ఇంతకీ ఆ కుక్కను ఎందుకు చంపారంటే... విష్ణు ఓ విషయం చెప్పారు. తన కొడుకుతో ఆ వీధిలో వెళ్తుంటే... తరచూ ఆ కుక్క... తన కొడుకును చూసి... అదే పనిగా అరుస్తోందనీ... ఇరిటేషన్ ఎక్కువై కాల్చి చంపానని చెప్పాడు. మూగజీవంపై జాలి చూపకుండా... ఇరిటేషన్ తెచ్చుకోవడమేంటని పోలీసులు సీరియస్ అయ్యారు. ఓ డాక్టర్ అయివుండి... ఇలాగేనా చేసేది అని మండిపడ్డారు. వీధి కుక్కతో ఇబ్బందిగా ఉంటే... మున్సిపల్ అధికారులకు కంప్లైంట్ ఇస్తే సరిపోయేదన్న పోలీసులు... చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.

First published: September 7, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు