భార్య భర్తల్లో ఎవరు కనిపించకుండా పోయినా మరొకరు వెతుకుతుంటారు. కానీ, ఇక్కడ ఓ భార్య కనిపించకుండా పోతే ఇద్దరు భర్తలు వెతుకున్నారు. అదేంటి ఒక్క మహిళ కోసం ఇద్దరు భర్తలు వెతకడం ఏంటి.. అనుకుంటున్నారా? వినడానికి కొత్తగా ఉన్నా.. ఇదే నిజం.. వారిద్ధరికీ ఒక్కరే భార్య.. ఇపుడీ కథ హైదరాబాద్ (Hyderabad)కి చేరింది.. మొదటి భర్త (first Husband)ను పిల్లలను వదిలి ప్రియుడితో వెళ్లిపోయిన వివాహిత హైదారాబాద్‌లోని ఎస్సార్‌నగర్ పోలీస్ స్టేషన్ కు చేరింది. ఎస్సార్‌నగర్ పోలీసుల కథనం ప్రకారం ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.ఉమ్మడి వరంగల్ (Warangal) జిల్లాలోని కాజీపేట కు చెందిన మహిళ (women)కు హన్మకొండకు చెందిన వ్యక్తితో 13 ఏళ్ల క్రితం వివాహమైంది. ఈ దంపతులకు ఓ కుమారుడు, ఓ కూతురు ఉంది. కొడుకుకు 16 ఏళ్లు, కూతురికి 13 ఏళ్లు. కొంతకాలం క్రితం అమలాపురానికి చెందిన వ్యక్తితో భార్యకు పరిచయం ఏర్పడింది.
ఈ పరిచయం ప్రేమ (love)కు దారి తీసింది. దీంతో 2021 ఆగష్టు 20న ఇంట్లో నుండి 10 తులాల బంగారం, 25 తులాల వెండి, లక్ష రూపాయాల నగదును తీసుకెళ్లింది. ప్రియుడితో కలిసి ఆమె హైద్రాబాద్ బల్కంపేట (balkampet) లో నివాసం ఉంటుంది. అయితే ప్రియుడి (lover)తో తన భార్య బంగారం, నగదుతో పారిపోయిందని పోలీసులకు వివాహిత మొదటి భర్త ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు వివాహిత కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
అరెస్ట్ చేసి జైలుకు..
హైద్రాబాద్ బల్కంపేటలో ప్రియుడితో కలిసి వివాహిత ఉంటున్న విషయాన్ని వరంగల్ (Warangal) జిల్లా పోలీసులు గుర్తించారు. కాగా, అమెకు ప్రియుడితో వివాహం కూడా అయినట్లు సమాచారం. దీంతో వివాహితతో పాటు ఆమె రెండో భర్త (Second Husband)ను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత బల్కంపేటలోనే ఆమె ఉంటుంది. అయితే ఇటీవలనే ఆమె మరోసారి అదృశ్యమైంది (Missing).
రెండో భర్త కూడా ఆమె కోసం గాలింపు..
దీంతో రెండో భర్త ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు (Missing case) చేశాడు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమె కోసం గాలింపు చర్యలు (Search operation) చేపట్టారు. ఈ విషయం తెలిసిన మొదటి భర్త, రెండో భర్త కూడా ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే శనివారం నాడు తన రెండో భర్తతో కలిసి వివాహిత ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ (SR Nagar police station) కు చేరుకొంది. ఇంత కాలం ఎక్కడికి వెళ్లావని పోలీసులు ఆమెను ప్రశ్నించారు. అయితే ఆ విషయం మాత్రం తనను అడగవద్దని వివాహిత చెప్పడం గమనార్హం.
Tags: Extra marital affair, Hyderabad, Missing cases, Wife and husband