డాక్టర్ బార్బెర్... 1912లో సంచలనం సృష్టించిన ఐడెంటిటీ థెఫ్ట్ కేసు

Dr Barber case : ఓ వ్యక్తి ఎలా డాక్టర్ అయ్యాడు. ఎలా నేరస్థుడు అయ్యాడు. చరిత్రలో సెన్సేషన్ సృష్టించిన రియల్ క్రైమ్ స్టోరీ.

Krishna Kumar N | news18-telugu
Updated: April 16, 2020, 6:53 AM IST
డాక్టర్ బార్బెర్... 1912లో సంచలనం సృష్టించిన ఐడెంటిటీ థెఫ్ట్ కేసు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలివైన విలన్ : హ్యారీ వర్చూ... ఓ ఖైదీ. కొన్నేళ్లపాటూ రకరకాల పేర్లతో తప్పించుకు తిరిగాడు. 1865లో మాంచెస్టర్‌లో పుట్టాడు. 1890లో వెటర్నరీ సర్జరీ ప్రాక్టీస్ చేశాడు. అడ్డమైన ఖర్చులు చేసి, అప్పులు పెట్టాడు. తరచూ వైద్య పరికరాలు, పుస్తకాలూ దొంగిలించేవాడు. చివరకు ఓ గుర్రం, దాని బగ్గీని కూడా చోరీ చేశాడు. ఓ రోజు అక్కడి నుంచీ పారిపోయాడు. అప్పుడతనికి డాక్టర్ బార్బెర్ చనిపోయిన విషయం తెలిసింది. అదే పేరుతో బ్రిటన్‌లో చెలామణీ అవ్వడం మొదలుపెట్టాడు.

అది 1904. డిసెంబర్ 1 అమెరికా... ఒరెగాన్‌ రాష్ట్రంలోని సుయుస్లా నది ఒడ్డున ఓ గుర్రం కనిపించింది. దాన్ని చూడగానే సెర్చ్ టీం సభ్యులు డాక్టర్ రిచర్డ్ హెన్రీ బార్బెర్ అని గట్టిగా అరిచారు. కానీ చుట్టుపక్కల ఎవ్వరూ కనిపించలేదు. కాస్త దూరంలో ఓ శవం కనిపించింది. అది ఎవరో కాదు డాక్టర్ బార్బెర్‌దే. గుర్రంపై వచ్చిన బార్బెర్ సుయుస్లా నది దాటేందుకు తెప్పలో వెళ్తూ... అది తిరగబడి ప్రాణాలు కోల్పోయాడు. తమకు ఎంతో సేవ చేసిన బార్బెర్ చనిపోవడంతో ఆ ప్రాంత వాసులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బార్బెర్ భార్య డాక్టర్ జీన్ బార్బెర్ ఒంటరిగా మెడికల్ ప్రాక్టీస్ ప్రారంభించింది.

ఈ కథలో డాక్టర్ బార్బెర్ చనిపోవడం, ఆయన డెడ్ బాడీని ఖననం చెయ్యడం అంతా పచ్చి నిజం. కానీ రెండేళ్ల తర్వాత ఇంగ్లండ్‌లో అదే డాక్టర్ బార్బెర్ కనిపిస్తే ఆశ్చర్యమే. 1906లో బ్రిటన్ జనరల్ మెడికల్ కౌన్సిల్‌కి డాక్టర్ బార్బెర్ నుంచీ లెటర్ వచ్చింది. తాను ఓరెగాన్ నుంచీ వచ్చేసి, లివర్‌పూల్‌లో ఉంటున్నట్లు తెలిపాడు. రెండేళ్లుగా అతడు ఇలాంటి చాలా లేఖలు పంపాడు. తాను ఫిజీషియన్లకు అసిస్టెంట్‌గా పనిచేస్తూ... దేశంలో చాలా ప్రాంతాల్లో నివసిస్తున్నట్లు ఎప్పటికప్పుడు కొత్త అడ్రెస్‌లు పంపేవాడు.

సౌత్ యార్క్‌షైర్‌లో డాక్టర్ బార్బెర్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేస్తున్న డాక్టర్ హెన్రీ బాండ్‌కి తన గురువుపై డౌట్ వచ్చింది. బార్బెర్ తరచూ ముఖ్యమైన ఆపరేషన్లు చెయ్యకుండా తప్పించుకోవడం, మెడికల్ సబ్జెక్టులపై వంకర టింకరగా మాట్లాడుతుండటం వంటి అనుమానాలు రావడంతో మెడికల్ డిఫెన్స్ యూనియన్‌కు సమాచారం అందించాడు బాండ్. 1912లో డిఫెన్స్ యూనియన్ నుంచీ డాక్టర్ బార్బెర్‌కి ఓ లేఖ వచ్చింది. చనిపోయిన బార్బెర్ బతికే వున్నాడని నిరూపించుకోవాలని అందులో కోరారు.

ఆ లేఖ వచ్చిన వెంటనే డాక్టర్ బార్బెర్ కనిపించకుండా పోయాడు. కొన్ని నెలల తర్వాత అతడు లివర్‌పూల్‌లో మళ్లీ ప్రత్యక్షమయ్యాడు. పోలీసులకు తెలిసింది. వాళ్లకు కావాల్సిందల్లా అతడు నిజమైన డాక్టర్ బార్బెర్ కాదన్న ఆధారాలు మాత్రమే. అవి తమ దగ్గర ఉంటే, వెంటనే వెళ్లి అరెస్టు చెయ్యొచ్చు.

తన భర్త పేరుతో మరో డాక్టర్ డ్రామాలాడుతున్నాడని తెలిసిన డాక్టర్ జీన్ బార్బెర్... అలర్టయ్యింది. అమెరికా నుంచీ హడావుడిగా బ్రిటన్ వెళ్లింది. అక్కడామెకు ఓ మెసేజ్ అందింది. లివర్‌పూల్‌లోని అడెల్ఫీ హోటల్ దగ్గర వెయిట్ చెయ్యమని ఆ మెసేజ్‌లో కోరారు డిటెక్టివ్స్.

ఆ దొంగ డాక్టర్ తన పేరు మార్చుకున్నాడు. డాక్టర్ చార్లెస్ థాంప్సన్ అని పెట్టుకున్నాడు. బ్రెజిల్ వెళ్లేందుకు ఓ ఓడ ఎక్కాడు. ఫిజీషియన్‌గా ఓడలో జాబ్ సంపాదించాడు.

డిటెక్టివ్‌లను కలిసిన జీన్ బార్బెర్... తన భర్త రాసిన మెడికల్ రిపోర్టులను వారికి చూపించారు. వాటిని దొంగ డాక్టర్ రాసిన రాతలతో పోల్చితే ఏమాత్రం సంబంధం లేదని తేలింది.

డిటెక్టివ్స్ చాలా వేగంగా స్పందించారు. ఓడ బయలుదేరకముందే నకిలీ డాక్టర్‌ను పట్టుకున్నారు. స్కాట్‌ల్యాండ్ యార్డ్‌కి తీసుకెళ్లేందుకు డిటెక్టివ్‌లు రైలు ఎక్కించారు. లావెటరీకి వెళ్తానని సంకెళ్లు తీయించుకున్న నకిలీ డాక్టర్... కదిలే రైల్లోంచీ కిందకు దూకేశాడు. డిటెక్టివ్‌లు అంత సాహసం చెయ్యలేకపోయారు.

గాయాలతో తప్పించుకున్న హ్యారీ... అక్కడి ఓ రైతు ఇంటికి వెళ్లాడు. రైల్లోంచీ జారిపడ్డానని అబద్ధం చెప్పాడు. కొంతసేపటికి రైలును ఆపిన డిటెక్టివ్‌లు అతను ఎటు వెళ్లిందీ కనిపెట్టి... రెండోసారి అరెస్టు చేశారు. కోర్టులో పిచ్చివాడిలా అరవడంతో అతన్ని కోర్టు బాన్‌స్టీడ్ శరణార్థుల గృహానికి పంపమని ఆదేశించింది. కొన్నాళ్ల తర్వాత అతనికి 9 నెలల జైలు శిక్ష విధించింది.

జైలు నుంచీ రిలీజైన హ్యారీ... లివర్‌పూల్‌కి వెళ్లాడు. తన పేరును హ్యారీ వర్చూ సిడ్డాన్స్‌గా మార్చుకున్నాడు. డాక్టర్ అని చెప్పుకొని మ్యారేజ్ చేసుకున్నాడు. బిర్కెన్‌హెడ్ మిలిటరీ మెడికల్ బోర్డులో జాబ్ సంపాదించాడు. తన పని ఏంటంటే... ఫిజికల్‌గా ఫిట్‌గా ఉండేవాళ్లను మిలిటరీలోకి రిక్రూట్ చెయ్యడం. కెప్టెన్ ర్యాంక్ సంపాదించిన హ్యారీ... లంచాలు మింగాడు. మిలిటరీ జాబ్ కోసం వచ్చే అభ్యర్థుల నుంచీ విస్కీ, డబ్బు గుంజేవాడు.

1917లో హ్యారీ చేస్తున్న తప్పులు బయటపడ్డాయి. ఈసారి చాలా కేసుల్లో అరెస్టయ్యాడు. విచారణ కౌన్సిల్ బెయిల్ ఇవ్వడం కుదరదంది. బాగా బతిమలాడాడు. సరేనంది.

హ్యారీపై విచారణ కొనసాగుతుండగా... 1917 అక్టోబర్ 29న హ్యారీ... తన ఇంట్లోనే చనిపోయి కనిపించాడు. నార్కోటిక్స్ (మత్తు పదార్థాలు) ఎక్కువగా తీసుకొని, ఆపరేషన్లలో వాడే సర్జికల్ కత్తితో... తన గొంతు తనే కోసుకొని... చనిపోయినట్లు తేలింది.

ఇవి కూడా చదవండి :

ఆండ్రాయిడ్ గేమ్స్ ని కంప్యూటర్ లో ఆడాలా? ఇదిగో ఫ్రీ ఆప్షన్

యూట్యూబ్ ద్వారా డబ్బు సంపాదించడం ఎలా... ఇలా చెయ్యండి

మొబైల్ ఆండ్రాయిడ్ యాప్ తయారీ... సింపుల్‌గా ఎలా... ఇలా చెయ్యండి

మొబైల్ నెట్‌వర్క్ మారాలా? జస్ట్ గంటలో పనైపోతుంది... ఇలా చెయ్యండి
Published by: Krishna Kumar N
First published: April 16, 2020, 6:51 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading