హోమ్ /వార్తలు /క్రైమ్ /

Mother Love: కొడుకు అస్థికలు కలిపి.. తానూ ప్రాణాలు వదిలిన మాతృమూర్తి

Mother Love: కొడుకు అస్థికలు కలిపి.. తానూ ప్రాణాలు వదిలిన మాతృమూర్తి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఎవ్వరూ లేని ఆ మాతృమూర్తికి అన్నీ ఆ కొడుకే. కానీ, విధి ఆ మాతృమూర్తి(mother)తో ఆటలాడుకుంది. ఒక్కసారిగా తన కంటిదీపాన్ని దూరంచేసింది. కొడుకును మృత్యువు ఆవహించింది. అంతే ఆ తల్లి ప్రపంచమే మరిచిపోయింది.

  కొడుకు(son)ను అల్లారుముద్దుగా పెంచుకుంది ఓ తల్లి(mother). ప్రేమ(love)గా చూసుకుంది. తన కష్టాలన్నీతీరుస్తాడనుకుంది. ఎవ్వరూ లేని ఆ మాతృమూర్తికి అన్నీ ఆ కొడుకే. కానీ, విధి ఆ మాతృమూర్తి(mother)తో ఆటలాడుకుంది. ఒక్కసారిగా తన కంటిదీపాన్ని దూరంచేసింది. కొడుకును మృత్యువు ఆవహించింది. అంతే ఆ తల్లి ప్రపంచమే మరిచిపోయింది. కొడుకునే తలుచుకుంటూ ఏడుస్తూ రోజులు గడిపింది. ఎంత అంటే కనీసం కొడుకు అస్థికలు కూడా నీటిలో కలపకుండా వాటినే చూస్తూ రోజులు వెళ్లదీసింది. ఇక తన వల్ల కాదనుకుందేమో.. కొడుకు మరణాన్ని జీర్ణించుకోలేకపోయిందేమో.. ఆ తల్లి కొడుకు అస్థికలు కలిపి.. తనూ వెళ్లిపోయింది మృత్యుఒడిలోకి.. ఈ విషాదకర సంఘటన కేరళ (Kerala)లోని కోవళం(kovalam) బీచ్(beach)​లో చోటుచేసుకుంది. వివరాలు తెలుసుకుందాం..

  తాంబరం సమీపంలోని పెరుంగళత్తూరు గుండు మేడులో వసంతి (42) నివసిస్తోంది. ఆమె కుమారుడు గోకులన్​ (21) స్థానికంగా ఓ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్నాడు. గత నెల 22 వ తేదీ జరిగిన మోటారు సైకిల్ ప్రమాదంలో గోకులన్​  మరణించాడు. ఒక్కగానొక్క కుమారుడు దూరం కావడంతో వసంతి ఒంటరి అయింది. కొడుకు మృతిని తట్టుకోలేక దీనంగా ఏడుస్తూ రోజులు గడిపింది. అతడి అస్థికల్ని ఇంట్లో ఫోటో వద్ద ఉంచి ప్రతి రోజు పూజ చేసింది. తీవ్ర శోకంతో ఆమె ఉండటమే కాకుండా, అస్థికల్ని ఇంట్లోనే ఉంచుకోవడాన్ని బంధువులు వ్యతిరేకించారు. అస్థికల్ని సముద్రంలో కలిపేయాలని సూచించారు. క్రింద ఆమె శనివారం అస్థికల్ని కలిపేందుకు కోవళం బీచ్(beach) కొరకు వెళ్లారు. అయితే వసంతి తిరిగి ఇంటికి చేరకపోవడంతో బంధువులు గాలించారు. ఇక చూసి చూసి పోలీసులకు సమాచారం అందించారు బంధువులు. వసంతి ఫోన్ రింగ్ అవుతున్నా చాలా సేపటి వరకు ఎవ్వరూ తీయలేదు. ఎట్టకేలకు ఓ వ్యక్తి ఆ ఫోన్ అందుకుని బీచ్ సమయంలో పడిపోయినట్లుగా సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు అక్కడికి వెళ్లి విచారించారు.

  కోవళం బీచ్ వద్దకు వెళ్లి పోలీసులు జాలర్లను అడిగారు. ఓ మహిళ గంటల తరబడి సముద్రం ఒడ్డున అస్థికలతో కూర్చుని తీవ్రంగా ఏడుస్తున్నట్లుగా అక్కడి వారు  పోలీసులకు చెప్పారు. ఏడుస్తున్న వసంతిని కదిలించినా ఆమె మాట్లాడక పోవడంతో స్థానికులు కూడా పట్టించుకోలేదట. బీచ్​లో వెతకగా ఆమె మృతదేహం బయటపడింది. తీవ్ర మనోవేదనతో ఉన్న వసంతి అస్థికల్ని కలిపిన తర్వాత బలవన్మరణానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Died, Kerala, Love, Mother, Son

  ఉత్తమ కథలు