హోమ్ /వార్తలు /క్రైమ్ /

Son in law Theft: వీడి దుంప తెగ.. మామ ఇంటికే కన్నం వేసిన అల్లుడు.. ఎలా దొరికాడంటే?

Son in law Theft: వీడి దుంప తెగ.. మామ ఇంటికే కన్నం వేసిన అల్లుడు.. ఎలా దొరికాడంటే?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

అల్లుడు అంటే మామ బతుకు కోరేవాడు అంటాడు. కానీ, ఈ అల్లుడు మాత్రం మామ ఆస్తిని కోరుకున్నాడు. అంతటితో ఆగలేదు.. ఏకంగా దొంగతనం చేసేశాడు. మరి విధి ఆట మామూలుగా ఉండదుగా.. దొరికిపోయాడు.

 • Advertorial
 • Last Updated :
 • Hyderabad, India

  అల్లుడు (Son in law) అంటే మామ (Uncle) బతుకు కోరేవాడు అంటాడు. కానీ, ఈ అల్లుడు మాత్రం మామ ఆస్తిని (Property) కోరుకున్నాడు. అంతటితో ఆగలేదు.. ఏకంగా దొంగతనం (Theft) చేసేశాడు. మరి విధి ఆట మామూలుగా ఉండదుగా.. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడు అంటారు. కానీ, మన పోలీసులకు అల్లుడు దొరికిపోయాడు. ఇంతకీ ఎవరా అల్లుడు, ఎలా దొరికాడు?  పూర్తి వివరాలు తెలుసుకుందాం.. ఎల్బీనగర్ (LB nagar పోలీసుల కథనం ప్రకారం.. సైదాబాద్ సమీపంలోని కుర్మగూడలో నివసించే 19 ఏళ్ల యాసర్ ఉలేమాన్ (Yasar Uleman) ఇటీవలే ఇంటర్మీడియేట్​ పాసయ్యాడు. అయితే చేతిలో ఎక్కువగా డబ్బులు కోసం చాలా ప్రయత్నాలే చేసేవాడు. ఇక జల్సాల కోసం తప్పుడు దారులు వెతికాడు. ఆగస్టు 31న అతని పుట్టినరోజు ఉండటంతో తల్లిదండ్రులు పార్టీ నిర్వహించారు. మీర్​పేట సమీపంలోని షరీఫ్నగర్లో నివసించే అతని మామ, కుటుంబ సభ్యులు హాజరయ్యారు.

  మామ ఇంట్లోని నగలూ, నగదు, విలువైన వాచీలపై ఎప్పటినుంచో యాసర్ కన్నుంది. ఇటీవల అతని పిన్ని సైతం విదేశాల నుంచి వచ్చి ఇదే వేడుకకు (Celebrations) హాజరైంది. ఆమెకు చెందిన నగలూ, డాలర్లూ మామయ్య ఇంట్లోనే దాచిన సంగతి అల్లుడికి బాగా తెలుసు. దీంతో యాసర్​కు ఇదే సమయం అనిపించింది. వెంటనే మామ ఇంట్లోనే డబ్బు, నగదు కొట్టేయాలని పథకం పన్నాడు.  ఆ ఇంట్లో చోరీకి తన స్నేహితుడు మహ్మద్ అయాజ బాన్ (19)ను పురమాయించాడు.

  మహ్మద్ అయాజ బాన్ తన సహచరుడు హమాన్ అశ్వాక్ (19)తో కలిసి ఆ రాత్రి చోరీకి బయలుదేరారు. అశ్వాక్ ​కు గతంలో చోరీ చేసిన అనుభవముంది. బురఖా ధరించి యువతిలా అయాజన్ వెంట ద్విచక్రవాహనంపై వెళ్లాడు. బురఖా తీసి జరిన్ వేసుకొని అశ్వాక్ ఇంట్లోకి వెళ్లగా.. ఆయాజ్బన్ బయటే కాపలాగా ఉన్నాడు. యార్​తో వీరిద్దరూ కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడుతూ చోరీ పూర్తిచేశారు.

  అశ్వాక్ ఇంటి అద్దాలు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించాడు. వెంట తెచ్చుకున్న స్క్రూడ్రైవర్‌తో మొదటి, రెండో అంతస్తులోని అల్వారాలను తెరిచాడు. ఇరువురు రూ.10.5 లక్షల విలువైన చేతి వాచీలు, 36 తులాల బంగారం,  రూ.32వేల విలువైన అమెరికా డాలర్లు. రూ.1 లక్ష బరీదైన సోనీ డిజిటల్ కెమెరాను ఎత్తుకెళ్లారు. అయితే ఇక్కడే మరో ట్విస్టు చోటు చేసుకుంది. ఇద్దరు దొంగలు యాసర్​కు జలక్​ ఇచ్చారు.పెద్దఎత్తున బంగారం దొరికినా చాలా తక్కువే దొరికిందనీ ఆ ఇద్దరూ యాసర్​కు అబద్ధం చెప్పారు.

  బాధితుడి ఫిర్యాదు మేరకు మీర్​పేట పోలీసులు రంగంలోకి దిగారు. దీంతో ఎక్కడ తమ నేరం బయటపడుతుందన్న భయం అల్లుడు యాసర్కు పట్టుకుంది. దీంతో తన స్నేహితులిద్దరిపై అనుమానం ఉందంటూ తన మామకు ఉప్పందించాడు. కానీ... అశ్ఫక్తో పాటు అయాజన్ను పట్టుకుని తమదైన రీతిలో విచారించగా అసలు నేరస్థుడి బండారం బట్టబయలైంది.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Crime news, Hyderabad, Theft

  ఉత్తమ కథలు