THE SON IN LAW COMMITTED SUICIDE AFTER HIS MOTHER IN LAW FAMILY MEMBERS REPEATEDLY HARASSED AND ASSAULTED HIM TO PAY THE SALARY MDK PRV
Siddipet alludu: అత్తింటి వారి వేధింపులు తట్టుకోలేకపోయిన అల్లుడు.. చివరికి ఏం చేశాడంటే..?
ప్రతీకాత్మక చిత్రం
ఆ యువకుడు ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకున్నాడు. సంతోషంగా జీవిద్దాం అనుకున్నాడు. కానీ, జీతం డబ్బులు ఇవ్వాలని భార్య, అత్త, బావమరిది తరచుగా వేధిస్తూ దాడి చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఇక విరక్తి చెంది..
ఆ యువకుడు ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకున్నాడు. సంతోషంగా జీవిద్దాం అనుకున్నాడు. జీతం డబ్బులు ఇవ్వాలని భార్య, అత్త, బావమరిది (mother-in-law family members) తరచుగా వేధిస్తూ (Harassed) దాడి చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైన అల్లుడు (Siddipet Alludu) ఆత్మహత్య (Suicide)చేసుకున్నాడు. సిద్దిపేట (Siddipet) జిల్లా మిరుదొడ్డి మండలం భూంపల్లి ఠాణా పరిధిలో ఈఘటన శనివారం చోటు చేసుకుంది. ఎస్ఐ హరీశ్ తెలిపిన వివరాల ప్రకారం.. భూంపల్లికి చెందిన లక్ష్మణ్(23) సిద్దిపేట మున్సిపాలిటీ పారిశుద్ధ్య విభాగంలో ఒప్పంద కార్మికుడిగా పని చేస్తున్నాడు. నాలుగేళ్ల క్రితం మిరుదొడ్డికి చెందిన కల్పనతో వివాహం కాగా సిద్దిపేట (Siddipeta)లో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో భార్య కల్పన, అత్త లక్ష్మి, బావమరిది యాదగిరి తరచూ జీతం డబ్బులు ఇవ్వాలంటూ వేధిస్తూ దాడి చేస్తున్నారని తండ్రి దుబ్బరాజయ్యకు లక్ష్మణ్ చెప్పాడు. ఈ విషయమై పలుమార్లు ఇరు కుటుంబాల మధ్య పంచాయతీ పెట్టించారు. పెద్దమనుషులు వారికి నచ్చజెప్పి లక్ష్మణ్, కల్పనల దగ్గరకు వెళ్లొద్దని అత్త బావమరిదికి సూచించారు.
నాలుగేళ్లుగా గొడవలు..
ఈ నెల 11 నుంచి మిరుదొడ్డిలో పోచమ్మ ఆలయ వార్షికోత్సవాలు జరుగుతుండటంతో బుధవారం లక్ష్మణ్, భార్య కల్పన, కుమార్తెతో కలిసి అత్తింటికి వచ్చాడు అల్లుడు (son-in-law ). శుక్రవారం డబ్బులు ఇవ్వాలంటూ లక్ష్మణ్‌తో గొడవపడి దాడి చేయడంతో అక్కడినుంచి భూంపల్లిలోని ఇంటికి వచ్చాడు. జరిగిన విషయం తండ్రి దుబ్బరాజయ్యకు చెప్పడంతో పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడదామని కుమారుడిని ఓదార్చాడు.
నాలుగేళ్లుగా భార్య, అత్తింటివారు డబ్బులు కావాలంటూ మళ్లీ వేధిస్తున్నారని లేఖ రాసి శనివారం తెల్లవారుజామున ఇంటి నుంచి వెళ్లిపోయాడు లక్ష్మణ్. ఉదయం తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికినా ఆచూకీ దొరకలేదు. లక్ష్మణ్ శివారులో చెట్టుకు ఉరేసుకుని ఉండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. తండ్రి రాజయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు మిరుదొడ్డి పోలీసులు.
గతంలోనూ ఇలాంటి గొడవే యూపీలో జరిగింది. అత్తింటి వేధింపులు తాళలేక ఓ అల్లుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఒంటి మీద పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. సజీవ దహనం అయ్యాడు. ఉత్తర్ ప్రదేశ్‌లోని లక్నోలో ఈ ఘటన జరిగింది. అభిషేక్ భరద్వాజ్ అనే వ్యక్తి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. 2009లో దీక్ష అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు. రజిని ఖండ్‌లోని ఓ ప్రాంతంలో అద్దె ఇంట్లో ఉంటున్నారు. వారి ఆర్థిక పరిస్థితికి సంబంధించి భార్య, భర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ క్రమంలో ఈ ఏడాది జూలైలో అభిషేక్ భార్య దీక్ష తన ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆ తర్వాత భార్య తరఫు వారు వచ్చి ఇద్దరు పిల్లలను తీసుకుని వెళ్లారు.
అనంతరం వారి నుంచి వేధింపులు పెరిగాయి. దీంతో అభిషేక్ పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. అతడు సజీవ దహనం అయ్యాడు. ఆ మంటలకు ఇంట్లోని ఫ్రిజ్ కంప్రెసర్ కూడా పేలింది. దీంతో ఆ చుట్టుపక్కల వారు భయభ్రాంతులకు గురయ్యారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి చూస్తే కాలిపోయిన అభిషేక్ శవం కనిపించింది. అతడు అభిషేక్ అని అతడి తల్లిదండ్రులు గుర్తించారు. ఆ ఇంట్లో అభిషేక్ రాసిన సూసైడ్ లెటర్ కనిపించింది. అందులో అత్తింటి వారు తనను వేధిస్తున్నారని, వారి వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్టు రాసి ఉంది.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.