సున్నితమైన మనస్థతత్వం గల వారు ప్రతీ చిన్న విషయానికి బాధ పడుతూ ఉంటారు. పరీక్షల్లో ఫెయిల్ అయినా, లవ్ బ్రేక్ అయినా, ఇంట్లో వాళ్లు తిట్టారని.. ఇలా ఏదో ఒక చిన్న కారణంతో ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్న సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి ఘటనే ఒకటి తాజాగా ఉత్తరప్రదేశ్ వారణాసిలో వెలుగుచూసింది. బర్త్ డే పార్టీకి రెండు వేల రూపాయలు తండ్రి డబ్బులివ్వలేదని తన కొడుకు ఆత్మహత్యాయత్నం చేశాడు. దగ్గర్లోనే ఉన్న గంగానదిలో దేకేశాడు. గమనించిన తండ్రి అతడిని కాపాడేందుకు గంగానదిలో దూకాడు. అయితే అక్కడే పడవ నడుపుతున్న స్థానికులు గమనించి వారిని కాపాడే ప్రయత్నం చేశారు. కానీ తండ్రిని మాత్రమే కాపాడారు. అతడి కొడుకు ఆచూకీ మాత్రం తెలియలేదు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ వారణాసిలోని ఆదమ్‌పూర్‌లో మనోజ్ కేసరి అనే వ్యక్తి జనరల్ స్టోర్ నడుపుతున్నాడు. మనోజ్ కేసరి కుమారుడు అశ్వని కేసరి తన బర్త్ డే పార్టీ కోసం అతడిని రెండు వేల రూపాయలు అడిగాడు.
తండ్రి ఇప్పుడు డబ్బులు ఇవ్వలేనని చెప్పాడు. వెంటనే అశ్వని కేసరి ఆగ్రహంతో ఊగిపోతూ... ఇంటి నుంచి బయటకు వచ్చి, నేరుగా గంగా నదివైపు పరిగెత్తాడు. కుమారుని తీరు గమనించిన తండ్రి కూడా అతని వెంట పరిగెత్తాడు. తండ్రి వెంట పడటాన్ని చూసిన కుమారుడు మరింత వేగంగా పరిగెడుతూ, రాజ్‌ఘాట్ దగ్గరకు వెళ్లి గంగలో దూకేశాడు.
కుమారుడిని కాపాడేందుకు తండ్రి కూడా గంగలో దూకాడు. వీరిని అక్కడున్న పడవ నడిపేవారు గమనించి మనోజ్‌ను కాపాడగలిగారు. అశ్విని ఆచూకీ ఇంకా తెలియరాలేదు. స్థానికులు మనోజ్‌ను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అదుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, గంగా నదిలో అతడి కొడకు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Attempt to suicide, Crime, Crime news, Son, Varanasi