హోమ్ /వార్తలు /క్రైమ్ /

Shocking: జులై 2, 2021న పెళ్లైంది.. కాపురానికెళ్లి ఇల్లు క్లీన్ చేస్తుంటే భార్యకు ఊహించని నిజం తెలిసింది.. ట్విస్ట్ ఏంటంటే..

Shocking: జులై 2, 2021న పెళ్లైంది.. కాపురానికెళ్లి ఇల్లు క్లీన్ చేస్తుంటే భార్యకు ఊహించని నిజం తెలిసింది.. ట్విస్ట్ ఏంటంటే..

పీఎస్‌లో ఫిర్యాదు చేస్తున్న రీతా, నమత్ర

పీఎస్‌లో ఫిర్యాదు చేస్తున్న రీతా, నమత్ర

భారతీయ వైవాహిక వ్యవస్థకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉంది. పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయంటారు. అంతటి పవిత్ర కార్యాన్ని కొందరు తమ స్వార్థ ప్రయోజనాల కోసం అపహాస్యం చేస్తున్నారు. పెళ్లి పేరుతో ఇద్దరు యువతుల జీవితాలను నాశనం చేసిన ఓ మోసగాడిపై తన ఇద్దరు భార్యలు పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో వెలుగుచూసింది.

ఇంకా చదవండి ...

గ్వాలియర్: భారతీయ వైవాహిక వ్యవస్థకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉంది. పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయంటారు. అంతటి పవిత్ర కార్యాన్ని కొందరు తమ స్వార్థ ప్రయోజనాల కోసం అపహాస్యం చేస్తున్నారు. పెళ్లి పేరుతో ఇద్దరు యువతుల జీవితాలను నాశనం చేసిన ఓ మోసగాడిపై తన ఇద్దరు భార్యలు పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో వెలుగుచూసింది. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌నని చెప్పి లక్షలులక్షలు కట్నంగా తీసుకుని తమను మోసం చేశాడని ఆ ఇద్దరు మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నానని చెప్పి ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడు. పాతిక లక్షల కట్నం తీసుకున్నాడు. భార్యాభర్తల మధ్య గొడవలు రావడంతో ఆమె అప్పటి నుంచి పుట్టింట్లోనే ఉంటోంది.

ఆ తర్వాత అతను తాను సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌నని చెప్పి.. అదే అబద్ధాన్ని నిజమని నమ్మించి మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఆ యువతి కుటుంబం కూడా 15 లక్షలు కట్నంగా ఇచ్చి, కూతురినిచ్చి పెళ్లి చేశారు. జులైలో పెళ్లి జరిగింది. మొదటి పెళ్లి విషయం దాచి రెండో పెళ్లి చేసుకున్న ఈ ప్రబుద్ధుడు ఒక్క విషయంలో మాత్రం రెండో భార్యకు అడ్డంగా దొరికిపోయాడు. ఇటీవల ఒకరోజు అతని రెండో భార్య ఇల్లు క్లీన్ చేస్తుండగా.. మొదటి భార్యతో ఇతగాడు కలిసి ఉన్న ఫొటో ఒకటి రెండో భార్య కంట పడింది. దీంతో.. తాను మోసపోయానని గ్రహించిన ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. తనను సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అని నమ్మించి లక్షలకు లక్షలు కట్నం తీసుకున్నాడని.. తనకు తెలియకుండా గుట్టుగా రెండో పెళ్లి చేసుకున్నాడని మొదటి భార్య కూడా పోలీసులను ఆశ్రయించింది.

మొదటి భార్య పేరు రీతా(24). ఉత్తరప్రదేశ్‌లోని ఒరైలో ఈమెను ఆ వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్య పేరు నమ్రత(22). నమ్రత స్వస్థలం ఆగ్రా. వీళ్లిద్దరినీ మోసం చేసి పెళ్లాడిన ప్రబుద్ధుడి పేరు తరుణ్. రీతాను 2018 డిసెంబర్‌లో పెళ్లి చేసుకున్నాడు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగినని.. లక్షల్లో జీతం అని చెప్పడంతో రీతా తల్లిదండ్రులు భారీగా కట్నకానుకలు ముట్టజెప్పారు. 25 లక్షల నగదు, జ్యూవెలరీ, ఇంట్లో అవసరమైన సామాన్లు కొనిచ్చి మరీ కూతురి కాపురం బాగుండాలని తల్లిదండ్రులు కోరుకున్నారు. కానీ.. అత్తారింట్లో రీతాకు షాకింగ్ అనుభవం ఎదురైంది. తన భర్త తండ్రి ఆమెను వేధించసాగాడు. ఈ విషయాన్ని భర్త తరుణ్‌తో చెప్పగా పట్టించుకోలేదు. దీంతో.. తండ్రీకొడుకులపై రీతా కేసు పెట్టింది.

ఇది కూడా చదవండి: Wife Busy On Phone: భార్య ఎప్పుడు చూసినా ఫోన్‌లో బిజీగా ఉంటోందని ఈ భర్త ఏం చేశాడో చూడండి..

మొదటి భార్య కేసు పెట్టి.. కోర్టుకెళ్లినా తరుణ్ బుద్ధి మాత్రం మారలేదు. జులై 2, 2021న తాను బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగినని చెప్పి ఆగ్రాకు చెందిన నమ్రత కుషావహా(22)ను పెళ్లి చేసుకున్నాడు. 15 లక్షల కట్నం తీసుకున్నాడు. అయితే.. కొద్ది రోజుల క్రితం ఇల్లు శుభ్రం చేస్తుంటే రీతాతో తరుణ్ పెళ్లి ఫొటోలు, పెళ్లికి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ నమ్రతకు దొరికాయి. దీంతో.. తరుణ్‌కు ఇంతకు ముందే పెళ్లైందన్న విషయం తెలిసి నమ్రత షాకైంది. తనను మోసం చేశాడని తెలిసి తరుణ్ మొదటి భార్యను కలిసి ఆరా తీసింది. భర్త చేతిలో మోసపోయిన ఈ ఇద్దరూ పెళ్లి పేరుతో తరుణ్ తమను మోసం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసు గురించి సంబంధిత పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ వివేక్ ఆస్తానా మాట్లాడుతూ.. సదరు వ్యక్తిపై ఈ ఇద్దరి ఫిర్యాదు మేర కేసు నమోదు చేశామని, విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

First published:

Tags: Cheating, Crime news, Dowry, Husband, Wife

ఉత్తమ కథలు