అతడికి అప్పటికే ఇద్దరు భార్యలు. ఒకే ఇంట్లో ఉంటూ జీవనం సాగిస్తున్నారు. రెండో పెళ్లి మాత్రం అతడు ఓ హిజ్రాను పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్య అతడితో బాగానే ఉన్నా.. రెండో భార్యతో మాత్రం తరచూ గొడవ పడుతుండేవారు. ఓ రోజు ఆ గొడవ చినికి చినికి పెద్ద గొడవగా మారింది. వారిద్దరి మధ్య వాగ్వాదం ముదిరిపోయింది. దీంతో అతడు మూడో పెళ్లి చేసుకుంటానంటూ రెండో భార్యతో తేల్చి చెప్పేశాడు. అతడికి ఎన్నో రకాలుగా చెప్పిచూసింది. అయినా అతడు వినకుండా మొండికేసి కుచ్చున్నాడు. మూడో పెళ్లికి సంబంధించి అమ్మాయిని కూడా చూసే పనిలో ఉన్నాడు. దీంతో అతడిపై ఆమె కోపం తెచ్చుకుంది. ఓ రోజు అదును చూసి అతడు పడుకున్న సమయంలో అతడిపై దాడి చేసింది. మీద పడి పిడిగుద్దులు గుద్దింది. అంతటితో ఆగకుండా వంట గదిలోకి వెళ్లి కత్తితీసుకొని వచ్చి పొట్టలో పొడిచింది. దీంతో అతడు అక్కడిక్కడే చనిపోయాడు. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి.
ఉత్తర ప్రదేశ్‌లోని ముజఫర్ నగర్ జిల్లా షికార్ పూర్ గ్రామంలో వకీల్ అహ్మద్( 57) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అతడికి ఇద్దరు భార్యలు. అతడు స్థానిక మసీదులో పనిచేసేవాడు. వీరిద్దరి మధ్య కొన్ని రోజుల నుంచి గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో వకీల్.. తన రెండో భార్య హజ్రాతో తాను మరో వివాహం చేసుకుంటానని తెలిపాడు. దీన్ని హజ్రా తీవ్రంగా వ్యతిరేకించింది. భర్తకు ఎన్నో రకాలుగా చెప్పడానికి ప్రయత్నించింది. అయితే, వకీల్ మాత్రం పెళ్లి విషయంలో వెనక్కు తగ్గలేదు. భర్త ప్రవర్తన పట్ల హజ్రా విసిగి పోయింది.
ఒకరోజు వకీల్ పడుకొని ఉన్నప్పుడు అతని ముఖంపై పిడిగిద్దులు కురిపించింది. అంతటితో ఆగకుండా కిచెన్‌లోని కత్తితో అతని పొట్టపై విచక్షణా రహితంగా పొడిచింది. ఆ కత్తిపోట్లకు వకీల్ అక్కడే మరణించాడు. ఈ సంఘటన జరిగినప్పుడు మొదటి భార్య ఇంట్లో లేదు. కాసేపటికి బయట నుంచి వచ్చిన ఆమె రక్తపు మడుగులో ఉన్నభర్తను చూసి షాక్‌కు గురైంది. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించింది. ఘటనా స్థలానికి చేరుకున్న భోరాకలాన్ పోలీసులు హజ్రాను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime, Crime news, Husband, Uttarapradessh, Wife murdered