Home /News /crime /

THE QUARREL WAS A HEADACHE FOR A HUSBAND WHO WAS UNABLE TO MEET HIS WIFE WISH FINALLY HUSBAND TAKEN THESE DECISION SSR

Newly Married: పాపం ఈ కుర్రాడు.. పెళ్లయి నాలుగు నెలలు.. భార్య గొంతెమ్మ కోరికలు తీర్చలేక..

చాంద్ పాషా (ఫైల్ ఫొటో)

చాంద్ పాషా (ఫైల్ ఫొటో)

భార్య కోరింది కాదనలేక, అడిగినన్నిసార్లు కొనివ్వలేక సతమతమైన ఓ యువకుడు పెళ్లయిన నాలుగు నెలలకే ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరులోని బసవేశ్వరనగరలో వెలుగుచూసింది.

  బెంగళూరు: పెళ్లయిన కొత్తలో భార్యాభర్తల మధ్య అచ్చటముచ్చట సహజం. భర్తతో కలిసి సరదాగా బయటకు వెళ్లాలని, సినిమాలుషికార్లకు వెళ్లాలని భార్య కోరుకోవడంతో ఎలాంటి తప్పు లేదు. ‘మల్లీశ్వరి’ సినిమాలో వెంకటేష్ చెప్పినట్లు ‘రోజూ సాయంత్రం మూర మల్లెపూలు, వారానికో సినిమా, నెలకోసారి పిక్‌నిక్, సంవత్సరానికొకసారి ట్రిప్’ ఇలాంటి కోరికలు ఉండటం పెద్ద సమస్య కాదు. కానీ.. భర్త ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా భార్య గొంతెమ్మ కోరికలు కోరితే మాత్రం భర్తకు చిక్కులు తప్పవు. అలా భార్య కోరింది కాదనలేక, అడిగినన్నిసార్లు కొనివ్వలేక సతమతమైన ఓ యువకుడు పెళ్లయిన నాలుగు నెలలకే ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరులోని బసవేశ్వరనగరలో వెలుగుచూసింది.

  ఇది కూడా చదవండి: Wife Smile: భర్త చనిపోయిన 15 రోజులకే ఎవరితోనో భార్య ఫోన్లో నవ్వుతూ మాట్లాడుతూ కనిపించేసరికి..

  ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బసవేశ్వరనగరలోని మంజునాథన్ నగర్ ప్రాంతానికి చెందిన చాంద్ పాషా అనే యువకుడికి ఉస్మా అనే యువతితో నాలుగు నెలల క్రితం వివాహమైంది. ఆ యువతికి, చాంద్ పాషాకు ఇద్దరికీ ఇది రెండో పెళ్లి కావడం గమనార్హం. చాంద్ భాషా మెకానిక్‌గా పనిచేస్తూ భార్యను ఇంటి వద్దే ఉంచి బాగానే చూసుకుంటుండేవాడు. పెళ్లయిన కొత్తలో అంతా బాగానే ఉంది. కానీ.. రోజులు గడుస్తున్న కొద్దీ చాంద్ పాషాకు భార్య నుంచి తలనొప్పులు మొదలయ్యాయి. రోజూ బయటకు వెళ్దామని ఒత్తిడి చేసేది. వెళ్లిన ప్రతిసారి మంచి బట్టలు, నగలు కొనివ్వాలని పాషాను ఇబ్బంది పెట్టేది. భార్య కోరిందల్లా కొనివ్వలేక పాషా చాలా ఇబ్బందిపడేవాడు. కానీ.. కొత్తగా పెళ్లవడంతో కాదనలేక కొన్నాళ్లు భార్య కోరుకున్నవన్నీ కొనిచ్చాడు. కానీ.. భార్య గొంతెమ్మ కోరికలు తీర్చడం పాషాకు రోజురోజుకూ కష్టతరంగా మారింది. ఈ విషయంలో భార్యాభర్తల మధ్య ఇటీవల రోజూ గొడవలు జరుగుతున్నాయి.

  ఇది కూడా చదవండి: Medical Shop: మెడికల్ షాపు నడుపుతున్నావ్.. మందులు అమ్ముకోకుండా ఇదేం పని.. ఇప్పుడేమైందో చూడు..

  మెకానిక్‌గా పనిచేస్తున్న తనకు కోరుకున్నవన్నీ కొనిచ్చేంత జీతం రాదని, అర్థం చేసుకుని సర్దుకుపోవాలని భార్యకు పాషా నచ్చజెప్పేవాడు. కానీ.. ఉస్మా మాత్రం చిన్నచిన్న కోరికలు కూడా తీర్చలేనప్పుడు ఎందుకు పెళ్లి చేసుకున్నావంటూ భర్తను దెప్పిపొడిచేది. దీంతో.. ఈ పరిణామాల కారణంగా పాషా తీవ్ర మనస్తాపానికి లోనయ్యాడు. పెళ్లయిన నాలుగు నెలలకే భార్య వల్ల మానసిక ఒత్తిడికి లోనయి ఇబ్బందిపడ్డాడు.

  ఇది కూడా చదవండి: HouseWife: ఈమె భర్తకు వాట్సాప్‌లో ఓ మెసేజ్ వచ్చింది.. అది ఎవరు పంపారో చూసి ఈమె షాక్.. చివరికి..

  ప్రేమగా మాట్లాడాల్సిన భార్య రోజూ పని ముగించుకుని ఇంటికి వస్తున్న తనకు తలనొప్పిగా మారడంతో ఇక బతకడం దండగ అని, ఆమె ఎన్ని విధాలుగా చెప్పినా అర్థం చేసుకోదని భావించిన పాషా క్షణికావేశంలో తొందరపాటు నిర్ణయం తీసుకున్నాడు. సోమవారం రాత్రి భార్య బెడ్‌రూంలో నిద్రిస్తుండగా హాల్‌లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లయిన నాలుగు నెలలకే కొడుకు ఇలా కోడలి కారణంగా ప్రాణాలు తీసుకోవడంతో పాషా తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఆమెను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
  Published by:Sambasiva Reddy
  First published:

  Tags: Bangalore, Crime news, Husband, Wife

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు