THE PUBLIC WHO BEAT UP A MENTALLY ILL PERSON THINKING HE WAS A THIEF INCIDENT HAPPEND IN COIMBATORE SSR
Sad: దొంగ అనుకుని ఆ యువకుడిని కట్టేసి కొట్టారు.. తీరా అసలు నిజం తెలిసి ఏం చేశారంటే..
ఘటనకు సంబంధించిన దృశ్యం
ప్రస్తుత సమాజంలో మనిషిని సాటి మనిషే నమ్మే పరిస్థితి లేకుండా పోయింది. మనం బతుకుతున్న ఇదే సమాజంలో మనిషి తోలు కప్పుకున్న తోడేళ్లు కూడా తిరుగుతుండటమే ప్రజల అపనమ్మకానికి కారణం. బయటకు వెళితే ఇంటికి వచ్చేలోపు ఏం జరుగుతుందోనన్న భయం కొందరిని వెంటాడుతోంది. దొంగతనాలు, దోపిడీలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి.
ప్రస్తుత సమాజంలో మనిషిని సాటి మనిషే నమ్మే పరిస్థితి లేకుండా పోయింది. మనం బతుకుతున్న ఇదే సమాజంలో మనిషి తోలు కప్పుకున్న తోడేళ్లు కూడా తిరుగుతుండటమే ప్రజల అపనమ్మకానికి కారణం. బయటకు వెళితే ఇంటికి వచ్చేలోపు ఏం జరుగుతుందోనన్న భయం కొందరిని వెంటాడుతోంది. దొంగతనాలు, దోపిడీలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. డబ్బు కోసం దొంగలు సాటి మనిషి ప్రాణాలు తీసేందుకు కూడా వెనుకాడటం లేదు. చెడ్డీ గ్యాంగ్.. ఆ గ్యాంగ్, ఈ గ్యాంగ్ అంటూ విచ్చలవిడిగా దొంగతనాలకు పాల్పడుతూ దొంగలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. దీంతో.. రోడ్డుపై వెళ్లే సమయంలో ఏ ఒక్కరు కాస్తంత అనుమానంగా కనిపించినా దొంగేమోనని భావించి చితకబాదే పరిస్థితికి సమాజం చేరుకుంది.
అయితే.. అదే సమయంలో కొందరు అమాయకులను దొంగలేమోనన్న నెపంతో భావించి వారిపై దాడి చేసిన సమయంలో ప్రాణాలు కోల్పోయిన సందర్భాలనూ గతంలో చూశాం. సరిగ్గా అలాంటి ఘటనే.. తమిళనాడులోని కోయంబత్తూర్లో జరిగింది. అయితే.. అదృష్టవశాత్తూ ఆ వ్యక్తికి సంబంధించిన వాళ్లు వచ్చి నిజం చెప్పడంతో సదరు యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. కోయంబత్తూరులోని ఓ ప్రైవేట్ కాలేజ్ పక్కన మధ్యాహ్నం సమయంలో సురేష్ కుమార్ అనే వ్యక్తి కారును పార్క్ చేసి కాలేజ్లోకి వెళ్లాడు.
అతను తిరిగి బయటకు వస్తుండగా.. ఓ యువకుడు తన కారు అద్దాలను తీసేందుకు ప్రయత్నిస్తూ కంటపడ్డాడు. దీంతో.. తన కారును దొంగిలించడానికి అతను ప్రయత్నిస్తున్నాడనుకుని సురేష్ కుమార్ ‘దొంగ.. దొంగ’ అంటూ కేకలేశాడు. రోడ్డుపై ఉన్న జనం వెంటనే ఆ యువకుడిని పట్టుకున్నారు. కారు యజమానితో కలిసి ఆ యువకుడికి ఓ కరెంట్ పోల్కు కట్టేసి కొట్టారు. పోలీసులకు సమాచారం అందించారు. అయితే.. పోలీసులు అతనిని అరెస్ట్ చేసి తీసుకెళుతుండగా ఆ యువకుడికి సంబంధించిన వ్యక్తులు అక్కడికి వచ్చారు. ఆ యువకుడికి మతి స్థిమితం లేదని, ఆ కారును దొంగిలించే ఉద్దేశంతో అతను అలా చేయలేదని, క్షమించి వదిలేయాలని కోరారు. ఆ యువకుడికి నిజంగానే మానసిక స్థితి సరిలేదని నిర్ధారించుకున్న తర్వాత పోలీసులు అతనిని అక్కడే వదిలి వెళ్లిపోయారు. ఆ యువకుడిపై దాడి చేసిన స్థానికులు ఆ తర్వాత ‘అయ్యో పాపం’ అని జాలిపడ్డారు.
కరెంట్ పోల్కు కట్టేసిన ఆ యువకుడికి కట్లు విప్పి.. భోజనం పెట్టించారు. ఇంక ఎప్పుడూ ఇలా చేయవద్దని హెచ్చరించి వదిలేశారు. ఉత్తరాది రాష్ట్రానికి చెందిన ఆ యువకుడు మానసిక సమస్యతో బాధపడుతున్నాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయలేదు. అప్పట్లో అన్నం దొంగిలించాడనే కారణంగా ఓ యువకుడిని దారుణంగా కొట్టడంతో పాపం ఆ యువకుడు స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ తాజా ఘటనలో కూడా సమయానికి ఆ యువకుడికి సంబంధించిన వ్యక్తులు రావడం వల్ల ఆ యువకుడిని జనం ఆ యువకుడిని అసలు నిజం తెలిసి వదిలేశారు. లేకపోతే.. ఆ దెబ్బలకు తాళలేక ఆ మానసిక రోగి విలవిలలాడిపోయేవాడు.
Published by:Sambasiva Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.