ఇటీవలే సంగారెడ్డి (Sangareddy) జిల్లాలో ట్రాన్స్ జెండర్ దీపిక (Transgender Deepika) అనుమానాస్పదంగా మృతిచెందిన కేసు సంచలనంగా మారిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు (Police) దర్యాప్తు ప్రారంభించారు. ఎంతో చాకచక్యంగా వ్యవహరించి నిందితుడిని అరెస్టు చేసి కటకటాల వెనక్కి తోశారూ పోలీసులు. బుధవారం విలేకరుల సమావేశంలో డీఎస్పీ (DSP) రవీంద్రా రెడ్డి వివరాలు వెల్లడించారు. ఎల్బీనగర్‌కు చెందిన దీపిక అంబర్‌పేటకు చెందిన సాయిహర్ష మూడేళ్లుగా సహజీవనం (Live in relation) చేస్తున్నారు. దీపిక ఆర్థిక లావాదేవీలు సాయిహర్ష చూసుకునేవాడు. దీపిక (Transgender Deepika) గతంలో సాయిహర్ష నుంచి రూ.1.50 లక్షలు అప్పుగా తీసుకుంది.
మద్యం తాగించిన సాయి హర్ష..
అయితే సాయి హర్ష (Sai harsha) ఆ సొమ్ము తిరిగి ఇవ్వాలని దీపికను కోరాడు. దీంతో దీపిక (Transgender Deepika) అతడికి దూరంగా ఉండటం మొదలుపెట్టింది. కాగా, డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో సాయిహర్ష ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఈనెల 21న దీపిక మరో ముగ్గురు స్నేహితులతో (Frineds) కలిసి కొండాపూర్ (Kondapur) మండలం మారేపల్లిలో బోనాల జాతరకు (Bonali jatara) హాజరైంది. దీనిపై సమాచారం అందడంతో సాయిహర్ష కూడా మారేపల్లికి వెళ్లాడు. బోనాల జాతర ముగిసిన అనంతరం మద్యం తాగి, భోజనం చేశారు. అనంతరం అందరు కలిసి తిరిగి హైదరాబాద్‌కు పయనమయ్యారు. దీపికకు ఎక్కువగా మద్యం తాగించిన సాయి హర్ష కారులోనే ఆమె ప్రైవేట్ భాగాలపై పిడిగుద్దులు గుద్దడంతో అక్కడికక్కడే మృతి చెందింది.
అయితే పక్కా ప్రణాళిక ప్రకారం నిందితుడు ఆమెను లింగంపల్లిలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించాడు. పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో సాయిహర్ష దీపిక కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఫిట్స్ వచ్చి దీపిక చనిపోయిందని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పరారయ్యాడు. అయితే అప్పటికే దీపిక స్నేహితుడిపై ఆమె సోదరుడికి అనుమానం వచ్చింది. దీపిక సోదరుడు సురేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న కొండాపూర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో భాగంగా సాయిహర్షను పట్టుకున్నారు. అనంతరం అదుపులోకి తీసుకున్నారు.
Engineering Cheater: వీడి చదువుకి చేసే పనికి ఏమైనా సంబంధం ఉందా? బీటెక్ చదివి ఏం చేశాడో తెలుసా?
కాగా. నిందితుడైన సాయి హర్ష నుంచి పోలీసులు దీపిక పట్టా గొలుసులు, బోనం, మేకప్ కిట్, కారును స్వాధీనం చేసుకున్నారు . సాయిహర్షపై అట్రాసిటీ కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. అంతేకాదు దీపికతో పాటు ఇంటి నుంచి వచ్చిన మరో స్నేహితుడి శివ ప్రమేయంపై పోలీసులు విచారిస్తున్నారు. సాయిహర్ష ఒక్కడే హత్య చేశాడనే నిర్ధారణకు వచ్చినప్పటికీ శివపాత్రపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Murder, Sangareddy, Transgender