Coronavirus:కృష్ణాజిల్లాలో 24 మంది అరెస్ట్.. ఎందుకో తెలిస్తే షాకవుతారు..

లాక్‌డౌన్‌ను కొంతమంది ప్రజలు ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తున్నారు. క‌ృష్ణాజిల్లాలో పేకాట, కోడి పందాలు ఆడుతున్న 24 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

news18-telugu
Updated: April 4, 2020, 12:29 PM IST
Coronavirus:కృష్ణాజిల్లాలో 24 మంది అరెస్ట్.. ఎందుకో తెలిస్తే షాకవుతారు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా విధించిన లాక్‌డౌన్‌ను కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తున్నారు. కొంతమంది ఏవో చిన్న చిన్న పనుల కోసం బయటికి వస్తుంటే.. మరికొంతమంది టైమ్ పాస్ చేసేందుకు పేకాట, కోడిపందాలు ఆడుతూ యథేచ్చగా నిబంధనలు ఉల్లంఘిస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కృష్ణాజిల్లాలోని పామర్రు నియోజకవర్గం తోట్లవల్లూరులో కోడి పందాలు, పేకాటకు తెర లేపారు. తోట్లవల్లూరు మండలంలో కనకవల్లి పొలాల్లో, గురివిందపల్లి మామిడి చెట్ల కింద, పొట్టి దిబ్బలంక, దేవరపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన పలు శిబిరాలపై తొట్లవల్లూరు ఎస్ఐ చిట్టిబాబు తన సిబ్బందితో కలిసి విచిత్ర వేషధారణలో వెళ్లి దాడి చేశారు. ఈ దాడుల్లో 18 మంది పేకాట రాయుళ్లను, కోడిపందాలు వేస్తున్న మరో నలుగురిని ఆదుపులోకి తీసుకున్నారు. మొత్తంగా ఈ దాడుల్లో 24 మందిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. వారి వద్ద నుంచి రూ.28,710 నగదును స్వాధీనం చేసుకున్నారు.
Published by: Narsimha Badhini
First published: April 4, 2020, 12:29 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading